అరెస్టవబోయే ముందు గౌతమ్ నవ్లాఖా రాసిన ʹస్వేచ్ఛా గీతంʹ


అరెస్టవబోయే ముందు గౌతమ్ నవ్లాఖా రాసిన ʹస్వేచ్ఛా గీతంʹ

అరెస్టవబోయే


ఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధాన కార్యాలయంలో సరెండర్ అవడానికి వెళ్లబోతూ, ఈ వారం బైట గడపడానికి, నాకొక వారం స్వేచ్ఛ ఇవ్వడానికి ఏప్రిల్ 8న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇచ్చిన తీర్పుకు సంతోషపడుతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, ఈ లాక్ డౌన్ సమయంలో కూడ, ఒక వారం రోజుల స్వేచ్ఛ అంటే చాల విలువైనది. ముంబాయిలోని ఎన్ఐఎ కార్యాలయంలో ఏప్రిల్ 6న నేను సరెండర్ కావాలని, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం మార్చ్ 16న ఇచ్చిన ఉత్తర్వులను పాటించే దుస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని నేను మథన పడుతున్నప్పుడు, ఈ వారం రోజుల పొడిగింపు ఉత్తర్వు వచ్చింది. పాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నేను ముంబాయి వెళదామనుకున్నా లాక్ డౌన్ వల్ల ప్రయాణసౌకర్యాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయవలసి ఉంటుందో ఎన్ఐఎ ముంబాయి నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. ఇప్పుడు నేను ఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధానకార్యాలయంలో సరెండర్ కావచ్చునని స్పష్టత వచ్చింది.

కొవిడ్19 మహమ్మారి మనకు విసిరిన సవాలును భారత ప్రధాన మంత్రి ʹజాతీయ అత్యవసర పరిస్థితిʹగా అభివర్ణించారు. ఈలోగా, సర్వోన్నత న్యాయస్థానం కూడ ఇటీవలనే జైలు పరిస్థితుల విషయంలో జోక్యం చేసుకుని కిక్కిరిసిన జైళ్లలో ఖైదీలకూ, నిర్బంధితులకూ, జైలు సిబ్బందికీ, జైలు బాధ్యతల్లో ఉన్న ఇతరులకూ రానున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాలను ఇచ్చింది.

ఆ ప్రమాదం అలాగే ఉన్నప్పటికీ, జైళ్లలో కొవిడ్19 అంటువ్యాధి సోకిన సమాచారమేదీ ఇప్పటికి రాలేదు గనుక నాకు కాస్త ఊరట ఉంది. కాని కొవిడ్19 మధ్యలో నేను బందీగా ఉంటే ఏమవుతుందో అని నా ఆత్మీయులూ సన్నిహితులూ అనుభవిస్తున్న భయం నన్ను కూడ ప్రభావితం చేస్తున్నది.

కాని నిరాశ పడడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే, భారతదేశంలో మనందరినీ, ప్రపంచాన్నంతా ఆ మహమ్మారి చుట్టుముట్టినప్పటికీ, ఏప్రిల్ 8న సుప్రీం కోర్టు ఇచ్చిన క్లుప్తమైన ఆదేశంలో కొవిడ్19 మహమ్మారి గురించి మాట కూడ మాట్లాడలేదు.

ఏది ఏమైనా, నేనిప్పుడు వాస్తవ చట్ట ప్రక్రియను ఎదుర్కోవడం మొదలు పెట్టవలసి ఉంది. అంటే చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధ) చట్టం – యుఎపిఎ – నిబంధనలను ఎదుర్కోవలసి ఉంది. అటువంటి చట్టాలు సాధారణ చట్ట ప్రక్రియనూ, న్యాయశాస్త్రాన్నీ తలకిందులు చేస్తాయి. ʹనేరస్తుడిగా రుజువయ్యేవరకూ ఒక వ్యక్తిని నిర్దోషిగానే భావించాలిʹ అనే సాధారణ న్యాయసూత్రం ఇంకెంతమాత్రమూ వర్తించదు. ఇటువంటి చట్టాల ప్రకారం, ʹనిర్దోషిగా తేలేంతవరకూ ప్రతి నిందితుడూ నేరస్తుడే.ʹ

యుఎపిఎ లో అత్యంత కఠినమైన శిక్షలు విధించే దుర్మార్గమైన నిబంధనలున్నాయి గాని, సాక్ష్యాధారాల విషయంలో, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల విషయంలో అనుసరించే పద్ధతులు మాత్రం అంతే కఠినంగా, కచ్చితంగా లేవు. మామూలుగా ఏ న్యాయవిచారణలోనైనా సాక్ష్యాధారాల విషయంలో కఠినంగా, కచ్చితంగా ఉండే పద్ధతులను, ఈ చట్టాల కింద మాత్రం ఎటుపడితే అటు సాగదీయగలిగేలా మార్చారు. ఇటువంటి రెండంచెల దాడి వల్ల, జైలే సాధారణమూ, బెయిల్ మినహాయింపూ అవుతుంది. ఈ అధివాస్తవిక ప్రపంచంలో విచారణా ప్రక్రియే శిక్ష అవుతుంది.

ఇప్పుడిక నాకూ నా సహనిందితులకూ వేగవంతమైన, న్యాయమైన విచారణ అందుతుందనే ఆశ మాత్రమే మిగిలింది. అటువంటి వేగవంతమైన, న్యాయమైన విచారణ జరిగినప్పుడు మాత్రమే ఇందులోనుంచి నా పేరు తొలగించుకోవడానికీ, మళ్లీ స్వేచ్చగా బైట తిరగడానికీ వీలవుతుంది. ఈలోగా నేనింతకాలం చేసుకున్న అలవాట్లను తొలగించుకోవడానికి జైలు జీవితం వీలు కల్పిస్తుంది.
అలా బైటికి వచ్చినప్పుడు మళ్లీ కలుద్దాం.

అప్పటివరకూ బాబ్ మోర్లే పాడినట్టుగా,

ʹమీరు నాకొక సాయం చేయరూ...
నేనీ స్వేచ్ఛాగీతాలు పాడడానికి
సాయం చేయరూ...
ఎందుకంటే
నేనింతదాకా చేసినది
విముక్తి గీతాలు పాడడమే
విముక్తి గీతాలు...
స్వేచ్ఛా గీతాలు....

మీ
గౌతమ్ నవ్లాఖా
ఏప్రిల్ 14, 2020, న్యూ ఢిల్లీ

(తెలుగు: ఎన్ వేణుగోపాల్)

Keywords : gautam navlakha, corona, covid 19, NIA, court, bhima koregaon
(2020-08-09 09:01:11)No. of visitors : 241

Suggested Posts


భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు

దళితుల ఐక్యత కు, పోరాటానికి చిహ్నమైన భీమా కోరేగావ్.. పాలకులను ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన భీమా కోరేగావ్ లో దళితులు నిర్వహించిన‌ విజయోత్సవాలపై దుర్మార్గమైన దాడులు చేసి దళితుల మరణానికి, వందలాది మంది గాయాలపాలవ్వడానికి కారణమైన హిందూ మతోన్మాద ఉగ్రవాదులను వదిలేసిన పోలీసులు దళితులకు మద్దతుగా నిలబడ్డవారిపై విరుచుకపడుతున్నారు.

కరోనా కాలంలో...ఆనంద్ తేల్తుంబ్డే కు తాత్కాలిక బెయిల్ తిరస్కరించిన కోర్టు

ఎల్గర్ పరిషత్ - భీమా కోరెగావ్ కేసులో నిందితుడు విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే వైద్య కారణాలపై దాఖలు చేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టు అతన్ని తలోజా జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee

We would like to extend our appreciation of the directions made by you on 12.05.2020, liberalizing the conditions for the release of undertrial prisoners in Maharashtra jails, and also clarifying that those undertrials who are otherwise excluded from this category (including those who are charged under Special Acts such as UAPA, NDPS etc) are eligible to

ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా

హానీ బాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా అన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. మిరాండా హౌస్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా

Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR

The Campaign Against State Repression (CASR) condemns the arrest of Professor Hany Babu MT at Mumbai by the National Investigation Agency (NIA) in connection with the Bhima Koregaon-Elgaar Parishad case.

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


అరెస్టవబోయే