ʹబజరంగీ బాయ్ జాన్ʹ తో సెలబ్రిటీ అయిన సాదా సీదా జర్నలిస్టు


ʹబజరంగీ బాయ్ జాన్ʹ తో సెలబ్రిటీ అయిన సాదా సీదా జర్నలిస్టు

పాకిస్తాన్ లో ఓ న్యూస్ చానల్ పని చేసే అతను సాదా సీదా జర్నలిస్టు. కానీ బజరంగీ బాయీ జాన్ సినిమాతో సెలబ్రీటీ అయిపోయాడు. అట్లని ఆయన ఆ సినిమాలో నటించలేదు. అదెలా ? అనే అనుమానం రావడం సహజమే. అదెలాగంటే.....
అతని పేరు చాంద్ నవాబ్. 2008 లో ఓ చిన్న టీవీ చానెల్ రిపోర్టర్ గా పని చేసే వాడు ఈద్ సందర్భంగా ఓ రోజు కరాచి రైల్వే స్టేషన్లో నిలబడి వచ్చిపోయే రైళ్ల రాకపోకల గురించి పీస్ టూ కెమేరా (పీ టు సీ) అనే కార్యక్రమం నిర్వహించాడు. ఆ సందర్భంగా తనకుగానీ, కెమేరాకుగానీ అడ్డొచ్చే ప్రయాణికులను తప్పుకోమని కోరుతూ. కొన్ని సార్లు వారిని తోసేస్తూ, తనదైన రీతిలో ప్రయాణికులను తిడుతూ ఆయన చేసిన హంగామా ను ఫన్నీగా ఫీలైన ఆయన మిత్రులు ఆ కార్యక్రమం ఎడిట్ చేయని వీడియో క్లిప్పింగ్ ను 2008 లో యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు. అది అప్పట్లోనే కాదు ఇప్పటికీ హల్ చల్ చేస్తోంది.
ఆ వీడియో క్లిప్పింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని బజరంగీ బాయ్ జాన్ చిత్రంలో జర్నలిస్టు పాత్రను సృష్టించారు. అంతే అతని దశ తిరిగి పోయింది. దేశ విదేశీ జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ కోసం క్యూలు కడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ టీవీ, గల్ఫ్ న్యూస్, డాన్, హిందుస్థాన్ పత్రికలు, ఇంటర్నేషనల్ న్యూస్ వైర్ సర్వీస్, రేడియో మిర్చి లాంటి ఎఫ్ఎమ్ రేడియోలు ఇంటర్వ్యూలు చేయగా, మరికొంత మంది అతని ఇంటర్వ్యూల కోసం క్యూలో ఉన్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్లు కూడా వస్తున్నాయట.
బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లు వసూలు చేస్తూ ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం బజరంగీ బాయ్ జాన్ లో పాకిస్తాన్ జర్నలిస్టు పాత్రకు స్ఫూర్తి చాంద్ నవాబ్. ఈ చిత్రంలో పాక్ జర్నలిస్టుగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర పేరు కూడా చాంద్ నవాబ్ కావడం గమనార్హం. ఈ చిత్రం పాకిస్తాన్లో కూడా సూపర్ హిట్టవడంతో చాంద్ నవాబ్ హఠాత్తుగా సెలబ్రిటీ అయ్యారు. మొన్నటి వరకు ఆయన కరాచీ ప్రెస్ క్లబ్కు రోజూ వెళ్లినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అక్కడికొచ్చే జర్నలిస్టులంతా అతనితోని ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడడమే కాకుండా కేవలం అతన్ని కలుసుకునేందుకే ప్రెస్ క్లబ్ కు ఎంతో మంది వస్తున్నారు.
తనను సెలబ్రిటీని చేసిన చిత్రం హీరో సల్మాన్ ఖాన్, తన పాత్రధారి సిద్దిఖీ, దర్శకుడు కబీర్ ఖాన్ కు చాంద్ నవాబ్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనను స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా తన టీవీ కార్యక్రమంలో తాను ఉపయోగించిన భాషనే చిత్రంలో ఉపయోగించుకున్నందుకు తనకు కొంత సొమ్ము పరిహారంగా ముట్ట చెప్పాలని అతను కోరుతున్నారు. తానేమీ డిమాండ్ చేయడం లేదని, తానొక పేద జర్నలిస్టునని, గతేడాది తన భార్య కూడా చనిపోయిందని నవాబ్ చెబుతున్నారు. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ లు తనను కలసుకునేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆ సందర్భంగా తనకు కొంత సొమ్ము ఇవ్వాలని ఆశిస్తున్నానని, అలా ఇవ్వకపోయినా ఫర్వాలేదని అంటున్నారు

Keywords : Funny Journalist, pakistan, bajarangi bhaijan
(2018-06-21 02:13:02)No. of visitors : 1278

Suggested Posts


0 results

Search Engine

నయీ పీష్వాయీ నహీ చలేగీ - వరవరరావు
ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !
అన్యాయాన్ని ప్రశ్నించాడని.. దళితుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారు..!
declaration by the ʹStruggle Associationʹ, an underground Maoist organization in China
కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
Members of European Parliament, condemn the presence of Sushma Swaraj on Yoga Day
Dalits In Haryana Allege Social Boycott, Threaten To Convert To Buddhism
ఆర్ఎస్ఎస్ ఎన్నికల వ్యూహంలో కాశ్మీర్ సమిద కానున్నదా?
ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
more..


ʹబజరంగీ