కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

కరోనామహమ్మారి, దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం...

కరోనా సామ్రాజ్యవాదుల సృష్టి- సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించడం ద్వారానే దీన్ని అరికట్టగలం!!

లాక్ డౌన్ సమయంలో నష్టపోతున్న 10 కోట్ల మంది అసంఘటిత, వలస కూలీలకు అన్ని విధాల సహాయాన్ని అందించాలి! లాక్ డౌన్లో అవకాశాల మేరకు సడలింపులు కొనసాగించాలి!!!

నోవల్ కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారీ (పండామిక్) ప్రపంచంలో 210 పైగా దేశాల్లో విస్తరించడంతో ఇప్పటికీ లక్షకు పైగా మరణాలు సంభవించాయి. 16 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులుగా గుర్తించబడినాయి. మన దేశంలో 16 వేలకు పైగా ఈ వ్యాధి భారిన పడ్డారు. వందల మంది మృత్యువాత పడినారు. ఈ క్రిమి చైనాలోని వూహాన్ లో బయటపడి యూరప్, అమెరికా, బ్రిటన్లో మృత్యు హేలను కొనసాగిస్తున్నది. ఈ కరోనా వైరస్ అమెరికాలో ప్రభావం చూపిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈ వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని నిందించాడు. దీన్ని చైనా ఖండించింది. ఈ ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉన్నంత వరకు యుద్ధాలు అనివార్యం. ఈ యుద్ధాల్లో విజయం సాధించడానికి సామ్రాజ్యవాదులు అనుసరించని మార్గమంటూ వుండదు. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఆటంబాంబు ఉపయోగం నుండి ఇప్పటికీ మానవాళిపై కొనసాగిస్తున్న మారణహెూమం ప్రపంచానికి తెలిసిందే. ప్రస్తుతం కరోనా లాంటి వినాశ కరమైన జీవ విధ్వంస ఆయుధాలు పుట్టుకొని రావడం సామ్రాజ్యవాద విధానాల ఫలితమే తప్ప మరేమి కాదు. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది.

ఈ కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అనేక చర్యలకు పూనుకుంటున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకొంటున్నాయి. కాని ʹచేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్నʹ చందంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కేరళలో మొట్టమొదటి కరోనా కేసు బయల్పడిన నెలరోజుల తర్వాత కాని మేల్కొనలేదు. మోడీ ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ , ఆ తదుపరి 24 నుండి ఎప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించాడు. పెద్ద నోట్ల రద్దు తరహలోనే ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటించడంతో దేశమంతా అల్లకల్లోలం అయింది. ముఖ్యంగా వలస కూలీలు, రోజు కూలీలు , పేదలు దాదాపు పది కోట్ల మంది జీవితాలు అస్తవ్యస్తమైనాయి. లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థితికి ఇది అద్దం పట్టింది. లాక్ డౌన్ ప్రకటన సమయంలో ఈ కోట్లాది మంది కూలీల పరిస్థితిని దృష్టిలో వుంచుకొని తిండి, వసతి, ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారికి మందులు లేవని ʹసామాజిక దూరం పాటించడంʹ ఒకటే మార్గమని, అందుకు లాక్ డౌనను పాటిస్తూ ప్రజల పట్ల కూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పేదల పరిస్థితిని దృష్టిలో వుంచుకొని ఆర్థిక, వైద్య సదుపాయాల విషయం ఆలోచించడం లేదు. లాక్ డౌన్ ప్రకటించిన మూడు రోజుల తరువాత ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ జీడీపీలో ఒక శాతంకు తక్కువ (కేటాయించిన బడ్జెట్ పద్దుల కలయిక మాత్రమే) కాగా, ప్రస్తుతం పేద ప్రజల భుక్తి, ఆరోగ్య సమస్యలకు కనీసం జీడీపీలో పది శాతం కేటాయింపులు అవసరం. కూలీలతో పాటు రోజువారిగా పని చేసుకొని పొట్ట పోసుకొనే చిరు వ్యాపారులు, రిక్షా కార్మికులు హెటల్ వర్కర్స్ మొదలగు అనేక అసంఘటిత కార్మికులు తమ జీవనాధారం కోల్పోయిన తరుణంలో ప్రభుత్వం అన్ని రకాల సహాయానికి ముందుకు రావాలి. దేశంలో 58 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల స్టాక్ ఉంది. ఇందులో 21 టన్నుల కనీస స్టాక్ ను విడిచి పెడితే తక్కిన 37 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ప్రజలకు పబ్లిక్ డిస్ట్రిబూషన్ స్కీమ్ ద్వారా పంపిణి చేయవచ్చు. కాని ప్రభుత్వం ఒకవైపు ద్రవ్యోల్బణం మరోవైపు ద్రవ్యలోటు పెరిగిపోతుందని ఈ చర్యలకు సిద్ధం కావడం లేదు. ʹప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతʹ కానీ ఆర్థిక స్థితి ఎలా ఉందనే విషయం ముఖ్యం కాదని పదేపదే వల్లిస్తున్న ప్రభుత్వాలు ఆచరణలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నాయో, తెలుస్తూనే వుంది. అందుకని పేద ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, కూలీలకు అర్థిక సహాయం అత్యవసరంగా అందించాలని డిమాండ్ చేయాలి.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తమ ప్రాణాలను లెక్కజేయకుండా చేస్తున్న కృషి అభినందనీయం. వారు ఎంతో రిస్కులో ప్రాణాన్ని ఒడ్డి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారు. వారికి వైరస్ తాకిడిని నిలవరించే దుస్తులు 7.25 లక్షలు, ఎన్ 95 మాస్కులు 60 లక్షలు, మూడంచెల మాస్కులు ఒక కోటి అవసరమవుతాయి. కాని వారి రక్షణకు అవసరమైన పి.పి.ఇ (రక్షణ కవచాలు) దేశంలో, వివిధ రాష్ట్రాల్లో చాలినన్ని అందుబాటులో లేవు. దీనిపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపాలు వెలిగించి, చప్పట్లు చరచి వైద్య సిబ్బంది మనోధైర్యాన్ని పెంచాలని చేస్తున్న ప్రధానమంత్రి విన్యాసాలు అసలు సమస్యలకు పరిష్కారం కాదు.

మొదట ప్రభుత్వం కరోనాను నయం చేసే హైడ్రాక్సైడ్ క్లోరోక్విన్ మాత్రలపై ఎగుమతి నిషేధం విధించింది. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ‌ దేశానికి మాత్రలు పంపాలని లేనిచో భారత దేశంపై ప్రతికార చర్యలు ఉంటాయని బెదిరించగానే, అమెరికాకు బడితొత్తు అయిన మోడీ వెంటనే వాటిని అమెరికాకు ఎగుమతి చేశాడు. ఇంతగా అమెరికాకు గులాంగురి చేస్తూ దేశంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో నిర్లక్ష్యం వహిస్తున్న మోడీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ లే మార్గమని చెబుతూ రక్షణ బాధ్యతను వ్యక్తిపై మోపుతున్నారు. కాని ప్రభుత్వం బాధ్యతను తీసుకోవడం లేదు.

బీజేపి ప్రభుత్వం, పార్టీ కరోనా మహమ్మారీ విస్తృతిని ఒక కమ్యూనిటిపై నెట్టి మతం రంగుపులుముతున్నారు. మార్చి చివరి వారంలో డిల్లీలోని నిజాముద్దీన్లో తబ్లీక్ జమాత్ సంస్థ నిర్వహించిన ప్రార్థన వలన అక్కడ జమకూడిన వారి ద్వారా దేశంలో వైరస్ వ్యాపించింది. దీనిని అసరా చేసుకొని బిజేపి- ఆర్ఎస్ఎస్ వారిపై దుమ్మేతి పోస్తూ ప్రచారాన్ని అందుకుంది. వారు పథకం ప్రకారమే వైరస్ వ్యాప్తి జేస్తున్నారని అబద్ద ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రపంచమంతా కరోనా వ్యాపిస్తున్న సమయంలో మన దేశానికి లక్షలాది మంది విదేశాల నుండి వస్తూనే వున్నారు. వారి ద్వారా మొదటగా మన దేశంలో వ్యాప్తి జరిగింది కదా! అప్పుడు మేల్కొనని ప్రభుత్వం, బీజేపి పార్టీ తబ్లీక్ పై దుమ్మెత్తి పోయడం వెనుక వున్న అసలు ఉద్దేశ్యం ఈ మహమ్మారీకి మతం రంగుపులిమి ముస్లింలను సామాజికంగా వెలివేసి శాశ్వతంగా వారిని ఈ దేశం నుండి దూరం చేసే కుట్ర ఇందులో దాగి వుందనేది. నిజం కాదా!

కరోనా వైరస్ నుండి పౌరుల జీవించే హక్కును కాపాడడానికి ప్రభుత్వం ప్రజలనందరిని స్వీయ నిర్బంధంలోకి తీసికెళ్ళింది. ప్రభుత్వం పాటిస్తున్న ఈసూత్రాన్ని జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలందరికి వర్తింపజేయాలి కదా! జైళ్ళలో వాటి సామర్థ్యాన్ని మించి ఖైదీలను కుక్కుతున్నారు. ఖైదీల జీవన పరిస్థితులు అతి దుర్భరంగా ఉంటాయి. వీరికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో వయోవృద్ధులు ఇంకా ఎక్కువగా కరోనా బారిన పడడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కోర్టులు, పౌరుల జీవించే హక్కుకు గ్యారంటిగా ఉంటామంటూనే తన వర్గ స్వభావానికి కట్టుబడి నిర్ణయాలు తీసికొంటున్నాయి. ʹఅర్బన్ నక్సల్స్ʹ పేరుతో అక్రమంగా అరెస్టులు చేసిన విప్లవ కవి వరవరరావు, 90 శాతం అంగవైకల్యం కలిగిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను వారితో పాటు అరెస్టు అయిన వారికి బెయిలను కోర్టులు నిరాకరిస్తున్నాయి. 60 సంవత్స‌రాల పైబడిన వారికి కరోనా అత్యంత ప్రమాదకరమైనది. 80 సంవత్స‌రాల వయస్సు కలిగిన వరవరరావు, అనారోగ్యంతో బాదపడుతున్న సాయిబాబాతో పాటు ఇతరులకు బెయిల్ ఇవాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమం కొనసాగుతుండగానే గోవా యూనివర్సిటీ ప్రొపెసర్ తేల్ తుంబ్డే, సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖలకు ఈ కరోనా ముప్పులో ప్రభుత్వం అరెస్టు చేయకండా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా 5 వేల మంది ప్రముఖులు, 15 సంస్థలు విజ్ఞప్తి చేసినప్పటికి దాన్ని పెడచెవిన పెట్టడమే కాకుండా వారు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికి వారికి స్టే ఇవ్వకుండా ఒక వారం లోగా పోలీసులకు లొంగిపోవాలని హెచ్చరించింది. ప్రభుత్వాలు ఆచరణలో తీసుకొంటున్న ఇలాంటి ఫాసిస్టు చర్యలు కరోనా సమయంలో వాటి నిజస్వరూపాన్ని బయటపెడుతూనే వున్నాయి.

ప్రభుత్వం మరో రెండు వారాల పాటుగా లాక్ డౌనను పొడగించింది. వైద్యానికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ కేటాయింపులు తగ్గించిన ఫలితంగా ఈరంగాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాన్ని ప్రైవేటీకరించడంతో ప్రస్తుతం కరోనా మహమ్మారినీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా లేదు. అందుకే ఇతర ప్రత్యామ్నాయాల పైన ఆధారపడే బదులు లాక్ డౌన్ పైననే పూర్తిగా ఆధారపడుతున్నది. మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో చాలా ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వుంటుంది. వాటిని మళ్లీ మళ్లీ నిర్వహిస్తేనే రోగులను సకాలంలో గుర్తించ గలుగుతాం. కాని ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువ మొత్తంలో నిర్వహించడంలో సన్నద్ధతతో లేదు. అంతే కాక లాక్ డౌన్ ను పోలీసు వ్యవస్థ నిర్బంధ విధానాల ద్వారా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో ప్రభుత్వాలకున్న అసక్తికంటే నిర్భంధ విధానాల పైననే విశ్వాసమున్నది.

*ప్రభుత్వం పెద్ద మొత్తంలో పదేపదే కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటీవ్ ఫలితం వచ్చిన వారికి వైద్యం అందించాలి. దేశంలో కోట్లాది మంది పేద, కూలీ, కార్మిక, వ్యవసాయ కూలీ, రైతుల ఆర్థిక స్థితిని దృష్టిలో వుంచుకొని బడ్జెట్ పద్దులకు అవతల 5 లక్షల కోట్లు కేటాయించి తక్షణం సహాయ చర్యలు చేపట్టాలి.

*డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, అశా, అంగన్ వాడీ కార్యకర్తల ప్రాణ రక్షణకు అధిక ప్రాధాన్యత నిచ్చి వారికి అవసరమైన చర్యలు వెంటనే పెద్ద ఎత్తున చేపట్టాలి.

*ఈ క్లిష్ట సమయంలో ప్రజల నుండి అభిప్రాయాలు తీసికొని ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపట్టడానికి భావస్వేచ్చకు ప్రాధాన్యతనివ్వాలి. అందులో భాగంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. అక్రమ కేసుల్లో జైళ్ళల్లో మగుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.

*కరోనా లాంటి మహమ్మారికీ మతం, కులం లాంటి తేడాలు ఏమి వుండవు. కరోనా వ్యాప్తికి మత రంగుపులిమి మైనార్టీలను వేధించే చర్యలను బీజేపి-అర్ఎస్ఎస్ ముఠా వెంటనే నిలుపుదల చేయాలి. లాక్

8లాక్ డౌన్లో ప్రభుత్వం ఇప్పటికీ పంట కోతలు, ధాన్యం అమ్మకాలు, మత్స్య పరిశ్రమకు ఇచ్చిన వెసులుబాటులాగానే ఇంకా ఇతర రంగాలకు కూడా వర్తింపజేయాలి.

*లాక్ డౌన్ ను దేశంలో రెడ్, హట్ స్పాట్లుగా గుర్తించిన ఏరియాలకు పరిమితం చేయాలి. సంపన్నులు, ధనిక వర్గం విలాసాల కోసం, అడంబరాల కోసం గుమిగూడే స్థలాలనూ, ఇతర గుమికూడే అవకాశాలున్న స్థలాలను గుర్తించి లాక్ డౌన్ ను అమలు చేయాలి.

అభయ్
అధికార ప్రతినిధి,
కేంద్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
తేది:13 ఏప్రిల్ 2020

Keywords : corona, lockdown, maoists, bjp, modi, migrants, muslims, workers
(2024-04-25 02:54:27)



No. of visitors : 3646

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

అత్యవసర డ్యూటీ నుండి వస్తున్న డాక్టర్లపై పోలీసుల లాఠీ చార్జ్... చేయి విరిగిన డాక్టర్

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని ఎయిమ్స్ డాక్టర్లు ఇద్దరిని పోలీసులు దారుణంగా కొట్టారు. రీతూ, యువరాజ్ అనే డాక్టర్లు బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో అత్యవసర విధులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు దాడి చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కరోనా,