CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం


CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

CLC

(పెట్టుబడిదారులు అధిక లాభాలు గడించడం కోసం... కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పౌరహక్కుల సంఘం(CLC), తెలంగాణ శాఖ విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...)

కార్మిక చట్టాలను 1000 రోజుల వరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు (మూడు సంవత్సరాలు) నిలిపి వేస్తూ చేసిన ఆర్డినెన్స్ ఉపసంహరించు కోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.......

7 & 8 మే 2020 తేదీలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మరియు గుజరాత్ రాష్ట్రం కార్మిక చట్టాలను సుమారు మూడు సంవత్సరాల వరకు( వెయ్యి రోజులు) నిలిపి వేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. భారతదేశంలో సంక్షోభం తలెత్తుతుందని కార్పొరేట్లు బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చడానికి BJP పార్టీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలోనే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు , 35 కార్మిక చట్టాలను సుమారు మూడు సంవత్సరాల వరకు (1000 రోజులు) నిలిపివేస్తూ 7&8 మే,2020 న ఆర్డినెన్స్ తీసుకువచ్చినారు.యుద్ధ సమయాల్లోనూ లేదా అత్యవసర విపత్కర పరిస్థితుల్లో కూడా కార్మిక చట్టాల నిలిపి వేయడం లేదా రద్దు చేయడానికి సాహసం చేయరు.కానీ గత మూడు నెలలుగా ప్రపంచం కరోనా వైరస్ కారణంగా ఒక భయానక స్థితిలో లక్షల సంఖ్యలో మరణాలతో మానవాళి ఒక గడ్డు స్థితిని ఎదుర్కొంటున్న ఈ ఆపత్కాల డిజాస్టర్స్ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు కార్మికుల పట్ల, ప్రజల పట్ల సహాయపడే విధంగా ఉండి సంక్షేమాలను, బ్రతుకు తెరువును పట్టించుకోవాల్సి ఉండే. మరింత బాధ్యతతో మానవీయంగా మెదలాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి పేరున అకస్మాత్తుగా లోక్డౌన్ ప్రకటించి కోట్లాది వలస కార్మికుల బ్రతుకులు చిదిమేసినారు. అసమాన పోరాటలతో సాధించుకున్న కార్మిక చట్టాల వలన కొద్దిపాటిగానైన రక్షణతో,మెరుగైన సౌకర్యాలతో సంఘటిత రంగం కార్మికులు లబ్ది పొందుతున్నారు. కానీ కోట్లాది మంది అసంఘటిత రంగంలో కార్మికులకు ఎలాంటి రక్షణ, వేతన భద్రత లేకుండా సామాజిక భద్రత కొరవడి బ్రతుకుతున్నారు.ఈ సంక్షోభ సమయంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక రంగ సంక్షోభాన్ని నివారించడానికి,కార్పొరేట్లు, బహుళ జాతి కంపెనీలకు లబ్ది చేకూరడానికి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని బలి చేయడమే లక్ష్యంగా ఈ కార్మిక చట్టాలను 1000 రోజుల వరకు(3సంవత్సరాలు) 35 కార్మిక చట్టాలను నిలిపివేత మరియు 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చడం వంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్మిక చట్టాల మార్పు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO) మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO) ఒప్పందాలను బేఖాతరు చేయడమే. ఈ రద్దు చేయబడిన 35 కార్మిక చట్టాలలో ప్రధానంగా పారి శ్రామిక వివాదాల చట్టం, కార్మికవర్గం రక్షణ ,వైద్యం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, వలస కూలీల చట్టం,కార్మిక భద్రత, వేతనాల చట్టాలను మరియు 8 గంటల నుంచి 12 గంటల వరకు కార్మికుడు పనిచేస్తే,పని గంటలనకు ఎలాంటి వేతనాలు మరియు అదనపు వేతనం ఇవ్వకపోవడం ఉన్నాయి. 49 మంది వరకు పనిచేసే కార్మికులు ఉన్న సంస్థ లో యాజమాన్యాలు ఎవరినైనా ఉద్యోగంలో నియమించు కోవచ్చు తొలగించుకోవచ్చు. ఎలాంటి లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కార్మిక చట్టాలు మార్పులు చేసినారు. కార్మికుల రక్షణపై భద్రతపై చట్టాల అమలు లోపాలను ఎవరు ఏ హక్కుల సంఘం, కార్మిక సంఘాలు ప్రశ్నించకుండా ఒక నల్ల చట్టం( draconian చట్టాన్ని) బిజెపి కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలు 7, 8 మే,2020 తేదీలలో తీసుకు వచ్చాయి. ఇప్పటికే అసంఘటిత రంగం,ఇతర కాంట్రాక్ట్ రంగంలోని కార్మికులు సేవరంగం లాంటి IT రంగాలలో 8 గంటల పనివిధానం నుండి 12 గంటల పని విధానం అమలులో ఉంది. కరోనా సంక్షోభాన్ని గట్టెక్కించడానికి చట్టాలను నిలిపివేత అని చెప్పడం పరిపాలన అసమర్థత అవుతుంది. ఇప్పుడు 12 గంటల పనివిధానం అమలు చేయడమంటే,అది చట్టబద్దత చేయడం కోసమే గత ఆరు సంవత్సరాల నుండి కార్పొరేట్ల, బహుళజాతి కంపెనీలకు మెప్పుల కోసమే BJP కేంద్ర ప్రభుత్వం తీక్షణంగా ఎదురుచూస్తుంది.నిజానికి రాజ్యాంగం ప్రకారం, చట్టప్రకారం పరిపాలన సాగిస్తామని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి బేఖాతరు చేసి కార్పొరేటు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరే విధంగా 125 సంవత్సరాల చరిత్ర గలిగిన కార్మిక చట్టాలను రద్దు చేయడం తమ పరిపాలన డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఈ అసమర్ధ పాలన‌ నుంచి తాము తొలగిపోయి వేరే ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలి.ఇది అత్యాశే. కానీ అబద్ధాలతో వక్రీకరణలతో కరోనాలాంటి సంక్షుభిత సమయంలో లాక్డౌన్ పేరునా తీసుకున్న ఈ నిర్ణయంతో కార్మికులు బానిసత్వంలోకి పోతారు.కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.
ఈ విధంగా కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకురావడం మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కును హరించి వేయడమే అవుతుంది.ఈ కార్మిక చట్టాలను తిరిగి ఉపసంహరించు కొనేవరకు కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు కార్మికవర్గానికి అండగా ఉండాలని, పోరాడదామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరియురాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల మార్పిడిని ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.....

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.

2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.

3.మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.

ఆదివారం,రాత్రి,8:15 గంటలు..
హైదరాబాద్,10 మే,2020

Keywords : uttarapradesh, madhyapradesh, gujarat, suspends labour laws,
(2021-09-22 10:10:02)No. of visitors : 1605

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు

తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప.

Search Engine

300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
more..


CLC