కామ్రేడ్ సృజన అమరత్వంపై మావోయిస్టు పార్టీ ప్రకటన...20న గడ్చిరోలి జిల్లా బంద్ కు పిలుపు


కామ్రేడ్ సృజన అమరత్వంపై మావోయిస్టు పార్టీ ప్రకటన...20న గడ్చిరోలి జిల్లా బంద్ కు పిలుపు

కామ్రేడ్

(మే 2వ తేదీ నాడు చత్తీస్ గడ్ గడ్చిరోలి జిల్లా, ఏటపల్లి తాలూకా, జారవండి పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న సీన్‌భట్టి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నాయకురాలు సృజన చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. అయితే అది ఎన్ కౌంటర్ కాదని ఏక పక్ష కాల్పులని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం..)

2020 మే 2 నాడు గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా సీన్‌భట్టి అడవుల్లో పోలీసులు చేసిన హత్యను ప్రతిఘటిస్తూ 2020 మే 20 న గడ్చిరోలీ జిల్లా బంద్‌ను విజయవంతం చేయండి.

ప్రియమైన విప్లవ ప్రజానీకానికి!

మే 2 నాడు గడ్చిరోలి జిల్లా, ఏటపల్లి తాలూకా, జారవండి పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న సీన్‌భట్టి అటవీ ప్రాంతంలో నరహంతక పోలీసు కమాండోలు సి-60 చేసిన దాడిలో ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలు సీనియర్ మహిళా ప్రజా నాయకురాలు కామ్రేడ్ సృజనక్క @జైనక్క తన అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసింది. ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ తరఫున వినమ్రంగా విప్లవ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కామ్రేడ్ సృజన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ హత్యకు నిరసనగా మే 20వ తారీఖు నాడు గడ్చిరోలి జిల్లా అంతటా బంద్‌ పాటించాలని పిలుపునిస్తున్నాం.

ఈనాడు కరోవా (కోవిడ్-19) వైరస్ ప్రపంచమంతటా అన్నిరంగాలనూ కదిలించి వేస్తోంది. సంక్రమణ వ్యాధి తీవ్ర గత్తర రూపాన్ని తీసుకొన్నది. ఇలాంటి విపత్తులు ఎలా వస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందుకు బాధ్యులు ఎవరు? ఇలాంటి విపత్తులు రాకుండా ఆపడానికి, వాటి నుంచి కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? అనే విషయాలను తెలుసుకోవాలి. దేశంలో లాక్డౌన్ అమలులో వున్నది. ఈ గత్తర నుంచి కాపాడుకోవడానికి భౌతిక దూరాన్ని పాటించాలి. పీడిత తాడిత గ్రామీణ ప్రజలను ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడానికి మా పార్టీ ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలు కామ్రేడ్ సృజన (డిసిఎం) నాయకత్వంలో కసన్సూర్ దళ కామ్రేడ్స్‌ కేంపెయిన్ చేపట్టారు. ఒకవైపు ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటుంటే మరోవైపు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో వున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు ప్రభుత్వాల ఆదేశం మేరకు లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ గడ్చిరోలికి చెందిన నరహంతక సి-60 కమాండోలు దొంగచాటుగా మా దళం పైన దాడి చేసి కామ్రేడ్ సృజనను హత్య చేశారు. ఈ హత్యను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో ఖండించాలి.

గడ్చిరోలి జిల్లాలో, దండకారణ్యంలో ప్రకృతి సంపదను- ఖనిజ సంపద, నీళ్ళు, అడవి, భూమి వనరులను దోపిడీ చేయడానికీ, ఇక్కడ నడుస్తున్న ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నరహంతక సి-60 బలగాలను విచ్చలవిడిగా వదిలేయడంతో గడ్చిరోలీ జిల్లాలో విప్లవకారులను, అమాయక ఆదివాసీలను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపడం గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2018 ఫిబ్రవరి 5 న చెందిన వడిశెలతో వేటకు వెళ్ళిన రామ్ కుమార్ కేశేను (ఏటపల్లి తాలూకా గర్దేవాడ గ్రామ పంచాయతీ పరిధి, కోయన్‌వర్సే గ్రామం)తూటాలతో కాల్చేశారు. 2018 మార్చి 30న గుమ్మడి నాలేలో పక్షులవేట కోసం ఇంటినుంచి బయలుదేరిన సొంసూ ఉసెందిని పట్టుకొని చిత్రహింసల పాలుచేసి కాల్చేశారు. ఏప్రిల్ 3 నాడు సిరొంచ తాలూకా సిర్కోడా ప్రాంతంలో నిరాయుధులైన ముగ్గురు కామ్రేడ్స్ విలాస్ కుడ్‌ మేథే, అంసీ తలండీ, వందాన్ కోవాసీలను తూటాలకు బలి చేశారు. ఏప్రిల్ 27నాడు భామ్రాగఢ్ తాలూకాలోని గుండూర్‌వాహి గ్రామం దగ్గర విప్లవ ప్రజానాయకురాళ్ళు దక్షిణ గడ్చిరోలీ డివిజన్ కమిటీ సభ్యురాలు రాంకో నరోటి, భామ్రాగఢ్ ఏరియా కమిటీ సభ్యురాలు కామ్రేడ్ శిల్పా దుర్వాలను ఉదయం 10 గంటలకు అరెస్టు చేసి క్రూర చిత్రహింసలపాల్జేసి 12.30కు దారుణంగా హత్య చేశారు. భామ్రాగఢ్ తాలూకా థోడ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న నేల్‌గుండా గ్రామ పంచాయతిలోని మోరోహ్‌మెట్ట గ్రామం దగ్గరి అటవీ ప్రాంతంలో నవంబర్ 29న జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో సాధారణ గ్రామీణులయిన నెల్‌గుండా నివాసి ప్రకాష్ ముహన్దా, మోరోహ్‌మెట్ట నివాసి రాజూ పూసాలీ తమ స్వంత పనుల కోసం వెళ్తున్నప్పుడు మధ్య దారిలో పట్టుకొని హత్య చేశారు. ఇంతే కాకుండా కల్లేడా, కస్నూర్-తుమ్మీర్‌గుండా, మెడ్రీ, నిహాయకల్, ముస్‌పర్సీ, దరాచీ, నార్‌కస్సా ఇలా ఎన్నో వూళ్ళలో పోలీసులు దొంగచాటున వచ్చి హత్యాకాండలకు పాల్పడుతున్నారు. వీటన్నింటినీ ఖండించాలని మా పార్టీ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రజాస్వామిక వాదులు, బుద్ధిజీవులు, వ్యాపారస్తులు, విద్యార్థి యువకులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, ఆదివాసీల శ్రేయోభిలాషులు, మహిళలు, పౌర హక్కుల కార్యకర్తలు అందర్నీ పోలీసులు చేస్తున్న హత్యాకాండని ఖండించాలనీ, 2020 మే 20 నాడు గడ్చిరోలి జిల్లా బందును పాటించాలనీ కోరుతున్నాం..

కామ్రేడ్ సృజన అమర్ రహే! అమరుల ఆశయాన్ని కొనసాగిస్తాం!

కామ్రేడ్ సృజనా మీ అమూల్య త్యాగాన్ని వృథా పోనీయం!

మీ త్యాగాల నుంచి వేలమంది విప్లవ యోధులు, యోధురాండ్లు ప్రభవిస్తారు!
కామ్రేడ్ సృజన అమరత్వ సంస్మరణ సమావేశాలు, సభలు ఏర్పాటు చేసి ఆమె త్యాగాన్ని ఎలుగెత్తి చాటండి, కామ్రేడ్ సృజన ఆశయాలను సఫలం చేస్తామని ప్రతిజ్ఞ చేయండి

అమరులారా మీ ఆశయాలను చివరివరకు కొనసాగిస్తాం

కామ్రేడ్ సృజనక్క నాటిన విప్లవ బీజాలు- ప్రజా సంఘాలు, జన మిలిషియా, విప్లవకర జనాతన సర్కార్‌ను బలోపేతం చేస్తాం, విస్తృత పరుస్తాం.

లొంగిపోవడం కాదు, ఆత్మ గౌరవం కోసం కామ్రేడ్ సృజనక్క బాటలో కొనసాగుతాం

సామ్రాజ్యవాద, దళారి నియంతృత్వ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాటాన్ని తీవ్రతరం చేద్దాం!

బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు నరేంద్ర మోడీ, ఉద్భవ్ తాక్రే ముర్దాబాద్!

అభివృద్ధి నిరోధక యుద్ధ వ్యూహం సమాధాన్‌ని పాతరేద్దాం!

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జిందాబాద్!

పి ఎల్ జి ఏ జిందాబాద్!

విప్లవం వర్ధిల్లాలి!

విప్లవాభివందనాలతో,

పవన్,
కార్యదర్శి, ఉత్తర గడ్చిరోలీ డివిజనల్ కమిటీ

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : maoists, police, encounter, chattis garh, rago, srujana
(2020-06-04 02:18:10)No. of visitors : 1658

Suggested Posts


రాగో @ సృజన ఏం కోరుకుంది? -పి.వరలక్ష్మి

రాగో ఏం కోరుకుంది? ఏ లక్ష్యం కోసం పోరాడింది? ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఏ లక్ష్యం కోసం రాగోలను చంపుతున్నది? పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారు అని మాట్లాడే మేధావులకు మాత్రమే కాదు, రాగో ఏమవుతుంది అని సందేహించిన వాళ్లకు కూడా సమాధానం అయింది రాగో. రాగో మార్గం అలా ఉంచి రాగో మాటలైనా వినే సంసిద్ధత నాగరిక సమాజానికుందా?

ʹరాగోʹ @ సృజనక్కను చంపేశారు ‌

సాధన రాసిన ʹరాగోʹ నవల తెలుగు సమాజంలో విప్లవాభిమానులు చదవని వారుండరు. రాగో పాత్రను ప్రేమించనివారుండరు. బలవంతపు పెళ్ళి నిర్బంధాల నుంచి విపరీతంగా పెనుగులాడి బయటపడి దళంతో కలుస్తుంది ʹరాగోʹ. తను అనుభవించిన క్షోభ,స్వేచ్ఛకోసం పడే ఆరాటం, మిగతా స్తీలందరిలోనూ చూస్తుంది రాగో.

Search Engine

వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
more..


కామ్రేడ్