ఏమి బతుకూ..ఏమిబతుకూ...వలస బతుకూ...! ఈ రాము, ధన్వంతలదీ అదే వ్యథ !
దేశంలో కోట్లాది మంది వలస కార్మికుల వంటిదే రాము కథ. మధ్యప్రదేశ్ బాలా ఘాట్ కు చెందిన రాము భార్య ధన్వంత, పసి పిల్ల అనురాగినితో కలిసి బతుకు దెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కూలీ పని చేసి బతికే రాముకు లాక్ డౌన్ వల్ల చేసేందుకు పనిలేక, ఇల్లుకు కిరాయి కట్టలేక, తినడానికి తిండి లేక... ఎలాగైనా స్వంతూరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళ్ళడానికి బస్సులు లేవు, ట్రక్కులు కానీ ఇతర వాహనాలు గానీ దొరకలేదు. వాహనం కిరాయికి తీసుకుని వెళ్ళే స్తోమ్త కాదు వాళ్ళది. భార్యా భర్త మాట్లాడుకొని ఇక నడిచే వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అప్పటికే భార్య గర్బవతి, చేతిలో చంటి పిల్లతో నడుచుకుంటూ బయలు దేరారు. వాళ్ళు వెళ్ళాల్సిన దూరం 700 కిలో మీటర్లు. కొద్ది దూరం నడవగానే గర్భవతి అయిన ధన్వంతకు నడక కష్టంగా మారింది. అప్పటికే చిన్నారితో సహా ఎవ్వరికీ తిండి లేదు. అడవి మార్గం గుండా నడుస్తున్నారు. అడవిలో దొరికే కర్రలు, చెక్కల్తో తాత్కాలిక బండిని తయారు చేశాడు రాము. దాని మీద భార్యను, కూతురును కూర్చోబెట్టి లాక్కుంటూ మధ్యప్రదేశ్, బాలాఘాట్ జిల్లాలోని తమ గ్రామానికి చేరుకున్నారు.
"నేను మొదట నా కుమార్తెను మోసుకొని నడవడానికి ప్రయత్నించాను. కాని గర్భవతి అయిన నా భార్య ఎక్కువ దూరం నడవలేకపోయింది. దాంతో దారిలో అడవుల్లో దొరికిన కలప మరియు కర్రలతో తాత్కాలిక బండిని తయారు చేసి దానిపై నా భార్యాపిల్లలను కూర్చోబెటి లాగుతూ ఊరికి వెళ్ళాను" అని చెప్పాడు రాము. ఈ కుటుంభం ఏ రకమైన ఆహారం లేకుండా ఆకలితోనే అనేక రోజులు ప్రయాణించి తమ గ్రామాన్ని చేరుకున్నారు.
అతను హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర ద్వారా తన సొంత జిల్లాలోకి ప్రవేశించగానే సబ్ డివిజనల్ ఆఫీసర్ నితేష్ భార్గవ నేతృత్వంలోని పోలీసు బృందం వీళ్ళ ముగ్గురికి బిస్కెట్లు, ఆహారాన్ని అందించింది. ధన్వంత రాముల కూతురుకు భార్గవ కొత్త చెప్పులు కూడా ఇచ్చాడు.
"మేము కుటుంబానికి వైద్య పరీక్షలు చేయించాము. ఆ తర్వాత వారిని వారి గ్రామానికి ఒక వాహనంలో పంపించాము, అక్కడ వారు 14 రోజులు ఇంటి నిర్బంధంలో ఉంటారు" అని భార్గవ చెప్పారు.
ఇటువంటిదే మరొక కథ...మరోక వలస జీవితపు దుంఖం...
మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ మోవ్ పట్టణం నుండి తమ గ్రామమైన పత్తర్ ముండ్లా అనే గ్రామానికి ఓ వలస కూలీ కుటుంభం బయలు దేరింది. ఓ బండికి ఒక వైపు ఎద్దు, మరో వైపు ఈ వలస కూలీ బండిని లాగుతూ తన కుటుంభాన్ని తీసుకెళ్తున్నాడు.
"మేము ఉదయం మోవ్ నుండి బయలుదేరాము. పత్తర్ ముండ్లా గ్రామంలోని మా ఇంటికి చేరుకోవాలి. లాక్డౌన్ కారణంగా రవాణా అందుబాటులో లేనందున, మా గ్రామానికి బండిమీద వెళ్ళడం తప్ప మరో మార్గంలేదు. ఎద్దు ఒక్కటే బండిని లాగలేదు కాబట్టి నేను కూడా లాగుతూన్నా. మాకు వేరే మార్గం లేదు" అని ఆయన చెప్పారు.
రైల్వే ట్రాక్ లపై నిద్రిస్తూ రైలు దూసుకెళ్ళడం వల్ల చనిపోయిన వలస కూలీలు....ట్రక్కుల్లో వెళ్తూ ఆక్సిడెంట్ల కారణంగా ప్రాణాలు వదులుతున్న వలస కూలీలు...నడుచుకుంటూ వందల కిలోమీటర్లు ఆకలితో , దాహంతో ప్రయాణించడం వల్ల మరణించిన వలస కూలీలు....
దేశంలోని వలస కూలీలందరిని తమ స్వంత ఊర్లకు చేర్చడానికి ట్రైన్లను, బస్సులను ఏర్పాటు చేశామన్న పాలకుల మాటలు ఎంత బోగస్సీ తెలిఅయజేస్తున్నాయి.
Keywords : migrant workers, hyderabad, madhyapradesh, Migrant Worker Wheels Pregnant Wife, Child On Makeshift Cart For 700 km
(2021-04-14 22:07:44)
No. of visitors : 572
Suggested Posts
| వలస కార్మికుడిని కొట్టి చంపిన పోలీసులుఅసలే కష్టాల్లో ఉన్న వలస కూలీలపై పోలీసుల దుర్మార్గాలు అంతులేకుండా ఉన్నాయి. గుజరాత్ లోని సూరత్ లో ఓ వలస కార్మికుడిని గురువారం సాయంత్రం పోలీసులు కొట్టి చంపారు. |
| మరో గత్యంతరం లేదు...కొడుకు వికలాంగుడు...క్షమించండి... మీ సైకిల్ తీసుకెళ్తున్నా...వలస కార్మికుడి లేఖ
ఓ వలస కూలీ ఆకలితో ఉన్న కుటుంభానికి కడుపు నింపే దారి లేక.... ఉండే ఇల్లు లేక.... స్వంత ఊరు నడిచే వెళ్దామనుకున్నా వికలాంగుడైన కన్న కొడుకును తీసుకొని నడిచి వెళ్ళలేక... వెళ్ళడానికి వేరే దారి లేక... గత్యంతరం లేక... ఓ పాత సైకిల్ ను దొంగతనం చేశాడు. |
| అమృత్ మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని బోరుమంటున్న యాకూబ్...వలసకార్మికుల అంతులేని దుంఖంఉత్తర ప్రదేశ్ కు చెందిన అమృత్, యాకూబ్ మహ్మద్ గుజరాత్ లోని సూరత్ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పని లేదు, యజమానులు వదిలేశారు. తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితి వీళ్ళిద్దరిదే కాదు అక్కడున్న వలస కార్మికులందరిదీ. ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికులంతా తలా నాలుగు వేలు ఇచ్చి తమ స్వరాష్ట్రం వెళ్ళడానికి ఓ ట్రక్ మాట్లాడుకున్నారు. |
| ʹఏక్ పురాణి చెప్పల్ దేదో సాహెబ్... ʹ నెత్తురోడుతున్న కాళ్ళను చూపిస్తూ ఓ వలస కార్మికుడి అభ్యర్థన"ఖానా తో మిల్ జాయెగా సాహిబ్.. ఏక్ పురాణి చప్పల్ దేదో" అని తిలోకి కుమార్ (32) తన కాళ్ళనుండి కారుతున్న రక్తాన్ని చూపించాడు. ఆ కాళ్ళు మొత్తం పుండులాగా ఉన్నాయి.
ఇది ఇక తిలోక్ కుమా ర్ పరిస్థితే కాదు...దేశంలో పట్టణాల నుండి పల్లెలకు వెళ్తున్న అన్ని రోడ్లు ఇప్పుడు వలస కూలీల నెత్తురుతో తడుస్తున్నాయి. |
| 1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దగ్గర కూడా పోలీసులు వారిని ఆపలేదు కాని ట్రక్ అక్కడే ఆగిపోయింది. మరోసారి, వారు నడవడం ప్రారంభించారు. 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత వారికి మరొక ట్రక్కు దొరికింది. ట్రక్కు డ్రైవర్ వారిని ఎక్కించుకున్నాడు. |
| వలస కూలీల ఆకలి కేకలు..అన్నం పొట్లం కోసం...! అప్పుడే రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గరున్న అన్నం పొట్లాల కోసం వలస కూలీలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ తిండికోసం నానా తిప్పలు పడ్డారు. |
| వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మృతి |
| వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన నెటిజనులు |
| దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు... |
| ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు |
| కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు |
| ఏప్రిల్ 26 భారత్ బంద్ ను జయప్రదం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ పిలుపు |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు |
| Chattisghar Encounter: Maoist Party released a Letter |
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే - కే.కేశవరావు |
| అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ |
| లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి |
| సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత
|
| ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
|
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages |
| శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్ |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
|
| విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
|
| టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
|
| సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్ |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
|
| Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists |
more..