మరో గత్యంతరం లేదు...కొడుకు వికలాంగుడు...క్షమించండి... మీ సైకిల్ తీసుకెళ్తున్నా...వలస కార్మికుడి లేఖ
ఓ వలస కూలీ ఆకలితో ఉన్న కుటుంభానికి కడుపు నింపే దారి లేక.... ఉండే ఇల్లు లేక.... స్వంత ఊరు నడిచే వెళ్దామనుకున్నా వికలాంగుడైన కన్న కొడుకును తీసుకొని నడిచి వెళ్ళలేక... వెళ్ళడానికి వేరే దారి లేక... గత్యంతరం లేక... ఓ పాత సైకిల్ ను దొంగతనం చేశాడు (అది దొంగతనమేనా? ).... అలా సైకిల్ ను తీసుకెళ్తున్నప్పుడు ఎంత మదనపడ్డాడో....ఎంత అవమానంగా ఫీల్ అయ్యాడో.....ఆ సైకిల్ యజమానికి ఓ క్షమాపణ లేఖ రాసి ఆ ఇంట్లో పెట్టి వెళ్ళాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ దగ్గర్లో ఉన్న ఓ గ్రామానికి చెందిన మహమ్మద్ ఇక్బాల్ అనే వలస కార్మికుడు రాజస్తాన్ రాష్ట్రం భరత్ పూర్లో కూలీగా పని చేస్తూ కుటుంభాన్ని పోషిస్తున్నాడు. దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల అష్టకష్టాలు పడ్డాడు. తాను పని చేస్తున్న యజమాని వదిలేశాడు. చేయడానికి వేరే పని లేదు. తినడానికి తిండి లేదు. కిరాయి కట్టలేక పోవడంతో ఇంటి వోనర్ ఖాళీ చేయమని పోరు... ఇంట్లో భార్యా, నడవలేని వికలాంగుడైన కొడుకు. ఎలాగైనా స్వంత ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ దగ్గర్లో సాహెబ్ సింగ్ అనే అతని ఇంటి ముందు ఓ పాత సైకిల్ కనిపించింది. ఓ చిన్న పేపర్ పై సింగ్ ను క్షమాపణ కోరుతో ఓ లేఖ రాసిన ఇక్బాల్ సైకిల్ పై కొడుకును భార్యను ఎక్కించుకొని 250 కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇక ఇక్బాల్ ఆ లేఖలో ఏం రాశాడంటే...
నమస్కారమండీ, నేను ఒక కూలీని చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను. మీ సైకిల్ తీసుకుంటున్నాను. నేను నేరం చేస్తున్నాను. కానీ నాకు మరో మార్గం లేదు. క్షమించండి. నేను బరేలీకి వెళ్ళాలి. నా కొడుకు వికలాంగుడు, మా ఊరు చేరుకోవడానికి వేరే మార్గాలు లేవు...
ఇట్లు
మహమ్మద్ ఇక్బాల్
అని లేఖ రాసి సింగ్ ఇంట్లో వేసి సైకిల్ తీసుకొని 250 కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
అతను, అతని కుటుంభం క్షేమంగా ఇల్లు చేరారో లేదో తెలియదు... చేరు కోవాలని కోరుకుందాం.
Keywords : migrant, lockdown, corona, uttarapradesh, rajastan
(2021-02-27 05:52:03)
No. of visitors : 1200
Suggested Posts
| వలస కార్మికుడిని కొట్టి చంపిన పోలీసులుఅసలే కష్టాల్లో ఉన్న వలస కూలీలపై పోలీసుల దుర్మార్గాలు అంతులేకుండా ఉన్నాయి. గుజరాత్ లోని సూరత్ లో ఓ వలస కార్మికుడిని గురువారం సాయంత్రం పోలీసులు కొట్టి చంపారు. |
| అమృత్ మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని బోరుమంటున్న యాకూబ్...వలసకార్మికుల అంతులేని దుంఖంఉత్తర ప్రదేశ్ కు చెందిన అమృత్, యాకూబ్ మహ్మద్ గుజరాత్ లోని సూరత్ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పని లేదు, యజమానులు వదిలేశారు. తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితి వీళ్ళిద్దరిదే కాదు అక్కడున్న వలస కార్మికులందరిదీ. ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికులంతా తలా నాలుగు వేలు ఇచ్చి తమ స్వరాష్ట్రం వెళ్ళడానికి ఓ ట్రక్ మాట్లాడుకున్నారు. |
| ʹఏక్ పురాణి చెప్పల్ దేదో సాహెబ్... ʹ నెత్తురోడుతున్న కాళ్ళను చూపిస్తూ ఓ వలస కార్మికుడి అభ్యర్థన"ఖానా తో మిల్ జాయెగా సాహిబ్.. ఏక్ పురాణి చప్పల్ దేదో" అని తిలోకి కుమార్ (32) తన కాళ్ళనుండి కారుతున్న రక్తాన్ని చూపించాడు. ఆ కాళ్ళు మొత్తం పుండులాగా ఉన్నాయి.
ఇది ఇక తిలోక్ కుమా ర్ పరిస్థితే కాదు...దేశంలో పట్టణాల నుండి పల్లెలకు వెళ్తున్న అన్ని రోడ్లు ఇప్పుడు వలస కూలీల నెత్తురుతో తడుస్తున్నాయి. |
| 1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దగ్గర కూడా పోలీసులు వారిని ఆపలేదు కాని ట్రక్ అక్కడే ఆగిపోయింది. మరోసారి, వారు నడవడం ప్రారంభించారు. 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత వారికి మరొక ట్రక్కు దొరికింది. ట్రక్కు డ్రైవర్ వారిని ఎక్కించుకున్నాడు. |
| వలస కూలీల ఆకలి కేకలు..అన్నం పొట్లం కోసం...! అప్పుడే రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గరున్న అన్నం పొట్లాల కోసం వలస కూలీలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ తిండికోసం నానా తిప్పలు పడ్డారు. |
| ఏమి బతుకూ..ఏమిబతుకూ...వలస బతుకూ...! ఈ రాము, ధన్వంతలదీ అదే వ్యథ !శంలో కోట్లాది మంది వలస కార్మికుల వంటిదే రాము కథ. మధ్యప్రదేశ్ బాలా ఘాట్ కు చెందిన రాము భార్య ధన్వంత, పసి పిల్ల అనురాగినితో కలిసి బతుకు దెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కూలీ పని చేసి బతికే రాముకు లాక్ డౌన్ వల్ల చేసేందుకు పనిలేక, ఇల్లుకు కిరాయి కట్టలేక, తినడానికి తిండి లేక... |
| కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్
|
| మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల లేఖ
|
| దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం |
| అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు |
| వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
|
| టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగరన్ మంచ్ʹ మూక దాడి
|
| Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital |
| జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య డిమాండ్ |
| ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
|
| ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
|
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
|
| రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR |
| రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ? |
| రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన |
| రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
|
| రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్ |
| CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers |
| నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన రైతు నాయకుడు |
| జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన
|
| రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
|
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
|
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
more..