ʹఏక్ పురాణి చెప్పల్ దేదో సాహెబ్... ʹ నెత్తురోడుతున్న కాళ్ళను చూపిస్తూ ఓ వలస కార్మికుడి అభ్యర్థన
"ఖానా తో మిల్ జాయెగా సాహిబ్.. ఏక్ పురాణి చప్పల్ దేదో" అని తిలోకి కుమార్ (32) తన కాళ్ళనుండి కారుతున్న రక్తాన్ని చూపించాడు. ఆ కాళ్ళు మొత్తం పుండులాగా ఉన్నాయి.
ఇది ఇక తిలోక్ కుమా ర్ పరిస్థితే కాదు...దేశంలో పట్టణాల నుండి పల్లెలకు వెళ్తున్న అన్ని రోడ్లు ఇప్పుడు వలస కూలీల నెత్తురుతో తడుస్తున్నాయి. దేశంలో పాము మెలికల్లాగా తిరిగే నల్లని విశాలమైన రోడ్లన్నీ ఇప్పుడు వలస కూలీల ఆకలి కథలు...నెత్తురు కథలే వినిపిస్తున్నాయి. అలాంటి కథే తిలోకి కుమార్ ది.
ఆయనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ జిల్లా లోని పిప్రైచ్ అనే ఊరు. బతుకు తెరువు కోసం గుజరాత్ లోని సూరత్ వెళ్ళాడు. సూరత్‌లోని వస్త్ర విభాగంలో పనిచేస్తున్నాడు.
ʹʹనేను శ్రామిక్ రైలు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఒక వారంపాటు వేచి ఉన్నాను. ఎవరూ పిలవలేదు. ఇక వేరే మార్గం లేక ఇంటికి నడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. తెలియని ప్రదేశంలో కంటే ఇంట్లో చనిపోవడం మంచిది కదా ʹʹ అని అన్నారు తిలోకి కుమార్.
రాజస్తాన్ నుండు ఉత్తరప్రదేశ్ బార్డర్ కు రాక ముందే ఆయన చెప్పులు తెగిపోయాయి, పనికి రాకుండా అయిపోయాయి.
"నేను చాలా దూరం నుండి చెప్పులు లేకుండా నడుస్తున్నాను నా అరి కాళ్ళనుండి రక్తస్రావం అవుతున్నాయి. నేను ఇంకా 300 కిలోమీటర్లకు పైగా నడవాలిʹʹ అని అన్నారు కుమార్.
ఈ బృందంలోని మరో వలస కూలీ ఠాకూర్ మాట్లాడుతూ అనేక మంది మనసున్న వాళ్ళుతమకు ఆహారం, నీళ్ళు ఇస్తున్నారని, చెప్పులే ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్నాయన్నాడు.
"నా షూ కింది భాగం ఊడిపోయింది. నేను దానిపై ఒక వస్త్రం కట్టాను. ఒకటి రెండు రోజులు ఆహారం లేకుండా వెళ్ళవచ్చు, కాని చెప్పులు లేకుండా నడవడం అసాధ్యంʹʹ అని అతను అన్నాడు.
ఓ జర్నలిస్టు.. త్రిలోక్ కుమార్, ఠాకూర్ లకు డబ్బులివ్వడానికి ప్రయత్నిస్తే ఇద్దరూ డబ్బును తిరస్కరించారు ʹʹమేము చెప్పులు ఎక్కడ కొంటాం సార్ʹʹ అన్నారు
చెప్పులు లేకుండా కాళ్ళు నెత్తుర్లు కారుతూ నడుస్తున్న ఈ వలసదారుల దుస్థితిని చూసి లక్నో శివార్లలోని ఉతరాటియాలో ఒక షూ షాపు యజమాని జత 60 రూపాయలకు చెప్పులు అమ్మాలని నిర్ణయించుకున్నాడు.
మరో వైపు ఓ సీనియర్ సిటిజన్స్ బృందం స్థానిక చెప్పుల షాప్ నుండి చెప్పులు కొని లక్నో-బారాబంకి రహదారిపై నడిచి వెళ్తున్న వలస కార్మికులకు ఇస్తున్నారు. ఆ బృందం తమ పేర్లు చెప్పడానికి నిరాకరించారు. ప్రచారం కాదు ఆదుకోవడమే ముఖ్యమన్నారు ఆ వృద్దులు.
మరో వైపు ప్రభుత్వాలు తాము వలస కార్మికుల కోసం ఏమేం చేస్తున్నామో రోజూ ప్రచారం చేసుకుంటున్నాయి. వాళ్ళు చెబుతున్న సహాయాలు ఏ ఒక్కటీ వలస కార్మికులకు అందకపోయినా...తమ భుజాలు తామే చరుచుకుంటున్నాయి.
ఈ వలస కార్మికుల శ్రమతో కోట్లకు పడ్గలెత్తిన పరిశ్రమల అధిపతులు ఈ కార్మికులు తమ స్వంత ఊర్లకు వెళ్ళకుండా బలవంతంగా ఆపే మార్గాల గురించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు.
Keywords : migrant, uttarapradesh, gujarat, surat, cheppal
(2022-06-28 12:03:23)
No. of visitors : 2100
Suggested Posts
| మరో గత్యంతరం లేదు...కొడుకు వికలాంగుడు...క్షమించండి... మీ సైకిల్ తీసుకెళ్తున్నా...వలస కార్మికుడి లేఖ
ఓ వలస కూలీ ఆకలితో ఉన్న కుటుంభానికి కడుపు నింపే దారి లేక.... ఉండే ఇల్లు లేక.... స్వంత ఊరు నడిచే వెళ్దామనుకున్నా వికలాంగుడైన కన్న కొడుకును తీసుకొని నడిచి వెళ్ళలేక... వెళ్ళడానికి వేరే దారి లేక... గత్యంతరం లేక... ఓ పాత సైకిల్ ను దొంగతనం చేశాడు. |
| అమృత్ మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని బోరుమంటున్న యాకూబ్...వలసకార్మికుల అంతులేని దుంఖంఉత్తర ప్రదేశ్ కు చెందిన అమృత్, యాకూబ్ మహ్మద్ గుజరాత్ లోని సూరత్ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పని లేదు, యజమానులు వదిలేశారు. తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితి వీళ్ళిద్దరిదే కాదు అక్కడున్న వలస కార్మికులందరిదీ. ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికులంతా తలా నాలుగు వేలు ఇచ్చి తమ స్వరాష్ట్రం వెళ్ళడానికి ఓ ట్రక్ మాట్లాడుకున్నారు. |
| 1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దగ్గర కూడా పోలీసులు వారిని ఆపలేదు కాని ట్రక్ అక్కడే ఆగిపోయింది. మరోసారి, వారు నడవడం ప్రారంభించారు. 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత వారికి మరొక ట్రక్కు దొరికింది. ట్రక్కు డ్రైవర్ వారిని ఎక్కించుకున్నాడు. |
| వలస కార్మికుడిని కొట్టి చంపిన పోలీసులుఅసలే కష్టాల్లో ఉన్న వలస కూలీలపై పోలీసుల దుర్మార్గాలు అంతులేకుండా ఉన్నాయి. గుజరాత్ లోని సూరత్ లో ఓ వలస కార్మికుడిని గురువారం సాయంత్రం పోలీసులు కొట్టి చంపారు. |
| వలస కూలీల ఆకలి కేకలు..అన్నం పొట్లం కోసం...! అప్పుడే రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గరున్న అన్నం పొట్లాల కోసం వలస కూలీలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ తిండికోసం నానా తిప్పలు పడ్డారు. |
| ఏమి బతుకూ..ఏమిబతుకూ...వలస బతుకూ...! ఈ రాము, ధన్వంతలదీ అదే వ్యథ !శంలో కోట్లాది మంది వలస కార్మికుల వంటిదే రాము కథ. మధ్యప్రదేశ్ బాలా ఘాట్ కు చెందిన రాము భార్య ధన్వంత, పసి పిల్ల అనురాగినితో కలిసి బతుకు దెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కూలీ పని చేసి బతికే రాముకు లాక్ డౌన్ వల్ల చేసేందుకు పనిలేక, ఇల్లుకు కిరాయి కట్టలేక, తినడానికి తిండి లేక... |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..