కేంద్రం దుర్మార్గమైన చర్య... లాక్ డౌన్ కాలంలో జీతాల చెల్లింపు తప్పనిసరి కాదంటూ ఆర్డర్స్

కేంద్రం

క‌రోనా గత్తర క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో వివిధ కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య సంస్థ‌లు పనిచేయకున్నా సరే, ఉద్యోగుల‌కు, సిబ్బందికి పూర్తి వేత‌నాలివ్వాలంటూ మార్చి 29నాడు తాను ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్ర‌భుత్వం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలలో హోం శాఖ ఈ విషయం స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద ఇటీవ‌ల‌ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ మార్చి 29 ఉత్తర్వును సవాలు చేస్తూ పలు వ్యాపార సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. చేసిన పనికి పూర్తి జీతాలు చెల్లించాలన్న ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు అన్నింటికీ ఒకే సూచననివ్వడం ఏకపక్షంగానూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ను ఉల్లంఘన అని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా లాక్డౌన్ సమయంలో తమ కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించని ప్రైవేట్ సంస్థలపై ఎటువంటి బలవంతపు చర్యలను ఆశ్రయించవద్దని సుప్రీం కోర్టు మార్చి 15న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, "హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పూర్తి వేతనాలు చెల్లించడం చిన్న మరియు ప్రైవేట్ సంస్థలకు ఆచరణీయంగా ఉండకపోవచ్చు, అవి లాక్డౌన్ కారణంగా దివాలా అంచున ఉన్నాయి. మార్చి 29 న ఉత్తర్వులో అనేక అంశాలు, వివిధ సమస్యలు ఉన్నాయి , వీటిని ప్రభుత్వం జాగ్రత్తగా పున: పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని కోర్టు వ్యాఖ్యానించింది
వేతన చెల్లింపుపై హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించని సంస్థలపై ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు నిషేధించడంతో, ఆ ఉత్తరువును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ చర్యకు సంబంధించిఎలాంటి వివరణ ఇవ్వలేదు.

మే17న జారీ చేసిన ఉత్తర్వులో ʹమే 18న జారీచేసిన ఉత్తర్వుతో జతచేయబడిన మార్గదర్శకాలలో, విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 10 (2) (I) కింద హోం కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలోని జాతీయ కార్యనిర్వాహక కమిటీ జారీ చేసిన అన్ని ఉత్తర్వులు 2020 మే 18వ తారీఖు నుండి అమలులో ఉండవుʹఅని పేర్కొంది. ఈ ఆర్డర్‌లో ఇంతకుముందు జారీ చేసిన వివిధ సూచనల జాబితా వున్నది కానీ మార్చి 29 ఉత్తర్వు మాత్రం లేదు.

మార్చి 29 నాటి ఉత్తర్వులో ʹయజమానులందరూ, దుకాణాలు లేదా ఏ వాణిజ్య సంస్థలు అయినా, లాక్డౌన్ సమయంలో పనిచేయనప్పటికీ కూడా తమ కార్మికుల వేతనాలను, వారి పనిస్థలంలో, నిర్ణీత తేదీన, ఎటువంటి తగ్గింపు లేకుండా చెల్లించాలి" అని వున్నది. ఈ ఉత్తర్వు వేతన కోత లేదా ఉపసంహరణపై కార్మిక మంత్రిత్వ శాఖ సలహాకు సమానంగా ఉంది. అంటే హోం మంత్రిత్వ శాఖ యొక్క ఉత్తర్వు ఒక చట్టం ద్వారా మద్దతు పొందింది కాబట్టి ఇప్పుడు ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవడాన్ని తప్పనిసరిగా చట్ట ఉల్లంఘనచేసిన శిక్షాత్మకచర్యగా పరిగణించాల్సి వుంటుంది.


ఈ ఉత్తర్వు వేతన మినహాయింపు లేదా ఉపసంహరణపై కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సలహాకు అనుగుణంగానూ, ఒక చట్టం మద్దతునూ కలిగి వుంది కాబట్టి హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వు తప్పనిసరిగా అమలు చేయాల్సి వుంటుంది. ఇలా ఉత్తరువును వెనక్కు తీసుకోవడం అనేది చట్ట ఉల్లంఘనగానూ, శిక్షార్హమైన చర్యగా పరిగణించాల్సి వుంటుంది.

Keywords : corona, lockdown, narendra modi
(2024-04-30 11:47:50)



No. of visitors : 1818

Suggested Posts


లాక్ డౌన్: ఆకలితో,దాహంతో 230 కిలోమీటర్లు నడిచి ప్రాణాలు విడిచిన అభాగ్యురాలు

కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన గంగమ్మ(27) దంపతులు ఉన్న చోట బతుకుదెరువు లేక బెంగళూరుకు వలసపోయి కెంగేరి ఏరియాలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పని చేస్తున్నారు.

ఆరెస్సెస్ వారు ఏ హక్కుతో తనిఖీలు చేస్తున్నారు ? ఇది చట్ట విరుద్దం కాదా ?

తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్, నల్ల టోపీ, చెతులో లాఠీతో రోడ్డుపై పోయేవారి పత్రాలు చెక్ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళ‌న కలిగించింది. ఆ ఫోటోల్లో ఆరెస్సెస్ వారు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్న స్థలంలో పోలీసులు కూడా ఉండటం...వీరికి పోలీసుల అనధికార మద్దతు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో పోలీసులపై దాడులు ఆపేస్తున్నాం - మావోయిస్టు పార్టీ

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ సమయంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్యపరుస్తామని మావోయిస్టు పార్టీ మల్కనగిరి- కొరాపుట్ విశాఖ బోర్డర్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు.

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

లాక్ డౌన్ ప్రకటించే సమయంలో వీరి భద్రత, సంరక్షణ విషయంలో ప్రధానమంత్రి ఎలాంటి ప్యాకేజిని ప్రకటించలేదు. భయకంపితులైన కూలీలు ఒక్కసారి రోడ్ల మీదకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేసింది. దానితో వేలాది మంది కూలీలు కాలినడకన సుదూర ప్రాంతాలకు తమ పల్లెలు చేరుకోవడానికి కాలినడక ప్రారంభించారు. ప్రజల దయనీయ పరిస్థ

లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ

కరోనా వైరస్ భయంతో భారత దేశం లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షలాది మంది పేద వలస కార్మికులు నగరాల్లో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక నగరాల నుండి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్ళడానికి వాహనాలు లేక వందలాది కిలోమీటర్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పోలీసుల కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగానే కొనసగుతోంది.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేత‌నాలు ఇవ్వాల్సిన అవసరంలేదు -పార్లమెంటరీ కమిటీ దుర్మార్గ సిఫార్సు

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికుల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గురువారం దుర్మార్గమైన‌ సిఫార్సు చేసింది.

మావోయిస్టు పార్టీ ప్రకటన పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి...పౌరహక్కుల సంఘం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మావోయిస్టు పార్టీ, పోలీసులపై ఎలాంటి దాడులు చేయబోమని ,స్వీయ నియంత్రణ పాటిస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం.ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.

వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికుల కష్టాలు, వారిపై పోలీసుల దౌర్జన్యాలు అంతులేకుండా ఉన్నాయి. గ్రామాల్లో బతకడానికి మార్గం లేక పట్టణాల్లో కూలీ పని చేసుకొని బతుకుతున్న వలస కూలీలు లాక్ డౌన్ తో అష్టకష్టాలు పడుతున్నారు.

8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌

ఆమె పేరు యాస్మీన్. ఆమెకు 8 నెలల గర్భం.... తన భర్త వకీల్ తోకలిసి తినడానికి తిండి దొరకక, తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకక 100 కిలోమీటర్లు నడిచింది. ఆకలితో..అలసటతో...నడక తప్ప మరో దారి లేక నడక...నడక...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కేంద్రం