వందల మందితో టీఆరెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు...వార్త రాసిన రిపోర్టర్ ఇల్లు కూల్చి వేత‌


వందల మందితో టీఆరెస్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు...వార్త రాసిన రిపోర్టర్ ఇల్లు కూల్చి వేత‌

కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే మార్గమని ప్రకటించిన ప్రభుత్వాలు లాక్ డౌన్ లో అనే నిబందనలను ప్రకటించాయి. సామాన్యులు అత్యవసరం అయ్యి ఆ నిబందనలను కొద్ది గా అతిక్రమించినా లాఠీలతో చితకబాదిన పోలీసులు రాజకీయ్ అనాయకులను మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు పర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అన్ని నిబందనలను ధిక్కరించి వందల మందితో ధూ ధాంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. పైగా ఆ వార్త రాసిన పాపానికి ఓ జర్నలిస్టు ఇల్లు కూల్చేశారు అధికారులు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి త్న పుట్టిన రోజు వేడుకలకు వందలాది మ‍ందిని ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో కేకు కట్ చేశాడు. వచ్చిన వాళ్ళెవ్వరూ కనీస భౌతిక దూరం పాటించలేదు. ఎక్కువ మందికి మాస్క్ లు కూడా లేవు. ఇంత పెద్ద ఎత్తున నిబందనలు ఉల్లంఘన జరినా ఏ అధికారీ అడిగిన పాపానపోలేదు. ఎవ్వరూ అడ్డుకోలేదు. అయితే నారాయణ ఖేడ్ వీ6 రిపోర్టర్ పరమేశ్ ఈ విజువల్స్ ను తీసి తన చానల్ కు పంపాడు. అది ఆ చానల్ లో టెలీకాస్ట్ అయ్యింది. దాంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. తనకు వ్యతిరేకంగా వార్త రావడం తట్టుకోలేక పోయాడు.

వార్త వీ6 లో టెలీ కాస్ట్ అయిన రెండో రోజే పరమేశ్ కొత్తగా కట్టుకుంటున్న ఇల్లును అనుమతులు లేవని అధికారులు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేశారు. అప్పటికే ఆ ఇల్లు పూర్తి కావచ్చింది. పది లక్షలకు పైగా ఖర్చయ్యింది.
ఇల్లు కట్టుకోవడానికి అనుమతుల కోసం తాను అప్లై చేసి చాలా రోజులయ్యిందని, లాక్ డౌన్ కారణ్‍అమ్గా అనుమతులు పెండింగులో ఉన్నాయని పరమేశ్ అంటున్నాడు. పైగా మున్సిపల్ కమిషనర్ తన ఇంటి ముందే ఉంటాడని తాను అప్లిఅ చేసిన విషయం కూడా అతనికి తెలుసని చెప్పాడు పరమేశ్. ఇల్లు కూల్చిన విషయం తెలిసి వృద్దుడైన తన తండ్రి గుండె పోటుతో కూలిపోయాడన్నాడు పరమేశ్.

ఈ విషయంపై జర్నలిస్టు సంఘాలు మండి పడ్డాయి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్యాయంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. భూపాల్ రెడ్డి ధౌర్జన్యాలను ఖండిస్తూ వీ6 రిపోర్టర్ కు న్యాయం చేయాలనే డిమాండ్ తో వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ నాయకత్వంలో జర్నలిస్టులు సంగారెడ్డిలో ధర్నా నిర్వహించారు.

నారాయణ్ ఖేడ్ MLA భూపాల్ రెడ్డి దౌర్జన్యం పై మంత్రి హరీష్ రావుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ ఫిర్యాదు చేసింది. దానిపై ఆ యూనియన్ విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ MLA భూపాల్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని న్యూస్ కవర్ చేసిన స్థానిక V6 రిపోర్టర్ పరమేష్ పై కక్షసాధిపు ధోరణితో రిపోర్టర్ నిర్మించుకుంటున్న ఇల్లును కూల్చి వేయించాడు. దీనిని TUWJ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కు ఫిర్యాదు చేయడం జరిగింది. TUWJ నాయకుల ఫిర్యాదుకు స్పందించిన మంత్రి రిపోర్టర్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు కానీ, బెదిరింపు చర్యలు కానీ జగకుండా చూడాలని జర్నలిస్టు యూనియన్ నాయకులు మంత్రి హరీష్ రావును కోరారు. మంత్రిని కలిసిన వారిలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, TEMJU రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, TUWJ హైద్రాబాద్ అధ్యక్షుడు పి.యోగానంద్, TEMJU హైద్రాబాద్ నగర అధ్యక్షుడు జి. సంపత్,TUWJ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షు విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్, సంగారెడ్డి జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, యోగనంద్ రెడ్డి, ధారసింగ్ తదితరులు ఉన్నారు.

Keywords : telangana, kcr, narayana khed, bhupal reddy, v6 reporter, paramesh
(2020-09-17 18:25:01)No. of visitors : 1006

Suggested Posts


కొమురయ్య బెయిల్ పై విడుదల - టీఆరెస్ నేతలతో ప్రాణ హాని ఉందని ఆందోళన

ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర రాక పోవడంతో ఆగ్రహించి మంత్రి కడియం శ్రీహరి మీద చెప్పు విసిరిన కొమురయ్య సోమవారం జైలు నుండి విడుదలయ్యాడు....

జంప్ లు షురూ !

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల గోడ దూకడాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార పార్టీలలోకి వలసలు ముమ్మరమవుతాయి. తిండి దొరికే చోటికి వలస వెళ్ళడం పక్షులకు అవసరం కదా......

కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?

టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంటు కెటిఆర్ గారు ప్రసంగిస్తూ దేశంలో అసహనం పెరిగిపోతుందనీ తర్కానికి, విభిన్నాభిప్రాయాలకు, వైరుధ్యాలకు అందులోనూ మిత్రవైరుధ్యాలకు విలువలేకుండా పోతుందనీ, ప్రశ్నించే స్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, భిన్న శక్తుల మధ్య జరిగే సంఘర్షణ నుండే చరిత్ర పుడుతుందని. కావున తెలంగాణా వికాస సమితి కలిసికట్టుగా ఉంటూ ʹఅవసరమైతేʹ సందర్భానుసారం

Search Engine

పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
Delhi Police Violated Human Rights Standards, Domestic Laws During Delhi Riots: Amnesty International
ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
నాజీ ల పాలన కన్నా దుర్మార్గమైన భారతీయ కుల వ్యవస్థ పై అమెరికన్ జర్నలిస్టు పుస్తకం‌
కంగనా అమ్మగారికి ఒక లేఖ
more..


వందల