1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కులేశ్వర్ గ్రామానికి చెందిన కుతుబుద్దీన్ ఖాన్ బతకడానికి బెంగళూరు వలస వచ్చాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఊర్లో ఉన్న భార్య అప్పటికే రోజూ ఫోన్ చేసి వచ్చేయమని అడుగుతోంది. తమ రాష్ట్రానికి తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఇక ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక బయలుదేరే ముందు తన వస్తువులు ఒక గ్యాస్ స్టవ్, కొన్ని పాత్రలు మరియు రెండు ప్లాస్టిక్ కుర్చీలు 2,000 రూపాయలకు అమ్మేశాడు.
ఆ తర్వాత ఏం జరిగిందనే దాని గురించి కుతుబుద్దీన్ ʹది క్వింట్ʹ తో మాట్లాడారు.
"నా భార్యఫోన్ చేయగానే ఇక నా మరో నలుగురు స్నేహితులతో కలిసి ఇంటికి నడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కెఆర్ పురం (బెంగళూరులో) సమీపంలో మేము పశ్చిమ బెంగాల్ వెళ్ళే మార్గం కోసం కొంతమందిని అడిగాము. వాళ్ళు చెప్పినట్టుమేము హైవే మీద నడక ప్రారంభించాంʹʹ
వాళ్ళు సుమారు 20 కిలోమీటర్ల దూరం నడిచిన తరువాత ఓ పోలీసు చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చారు. వీళ్ళను పోలీసులు ఆపేశారు. ʹʹమళ్ళీ వెనక్కి పంపుతారేమోనని భయపడ్డాము కానీ ఓ కానిస్టేబుల్ హైవేపై వెళ్తున్న ఒక ట్రక్కును ఆపి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు మమ్మల్ని వదిలివేయమని డ్రైవర్ను కోరాడు"

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దగ్గర కూడా పోలీసులు వారిని ఆపలేదు కాని ట్రక్ అక్కడే ఆగిపోయింది. మరోసారి, వారు నడవడం ప్రారంభించారు. 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత వారికి మరొక ట్రక్కు దొరికింది. ట్రక్కు డ్రైవర్ వారిని ఎక్కించుకున్నాడు. "ప్రజలు మంచివారు. వారిలో చాలా మంది పోలీసు అధికారులతో సహా మాకు ఆహారం, నీరు ఇచ్చారు. ట్రక్ డ్రైవర్లు ఎవరూ మమ్మల్ని డబ్బు అడగలేదు. అలా ట్రక్కులు మారుతూ నడుస్తూ మేము ఒడిశా సరిహద్దుకు చేరుకున్నాము" అని చెప్పారు కుతుబుద్దీన్.
ఒడిశా సరిహద్దు నుండి నేరుగా కోల్‌కతా వెళ్తున్న ట్రక్కు వీరికి దొరికింది. నాలుగు రోజుల ప్రయాణం తర్వాత చివరకు ఇంటికి చేరుకున్నాడు. "ఎంతో ఆనందంతో ఇంటికి చేరుకున్న నాకు ఇంటిని చూడగానే దుంఖమొచ్చింది.ʹʹ అని బోరుమన్నాడు కుత్బుద్దీన్.

బెంగుళూరు నుండి 1800 కిలోమీటర్లు అష్టకష్టాలు పడి ప్రయాణించి గ్రామానికి చేరుకున్న కుత్బుద్దీన్ కు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది. పశ్చిమ బెంగాల్ లో తుఫాన్ సృష్టించిన భీభత్సం అనేక జీవితాలను అతలాకుతలం చేసింది. ఒకవైపు కరోనా గత్తరతో...లాక్ డౌన్ కష్టాలతో పోరాడుతున్న ప్రజలకు ఉంపాన్ తుఫాను తీరని ధుంఖాన్నే మిగిల్చింది. కుత్బుద్దీన్ గ్రామం కూడా తుఫాన్ ధాటికి వణికి పోయింది. ఇళ్ళు కూలిపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు.
కుత్బుద్దీన్ ఇల్లు సగం కూలి పోయింది. పైకప్పు ఎగిరిపోయింది. వణుకుతూ భార్యాపిల్లలు అక్కడే గడుపుతున్నారు. వర్షం వస్తే ఎక్కడ ఉండాలో కూడా తెలయదు. నాలుగు రోజుల ప్రయాణ కష్టం మర్చి పోయాడు కుత్బుద్దీన్.ఇప్పుడు అంతకన్నా పెద్దకష్టం వచ్చి పడింది.
ʹʹమాకు ఇంతవరకు ఎటువంటి సహాయం అందలేదు. ఏ అధికారి ఇక్కడకు రాలేదు. నా ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి దెబ్బతిన్న ఇంట్లోనే మేము ఇంకా నిద్రపోతున్నాము.ʹʹ అని అతను చెప్పాడు
కొంతమంది పొరుగువారు కుత్బుద్దీన్ కుటుంభానికి సహాయం చేస్తున్నారు కాని బెంగళూరులో ప్రారంభమైన కుత్బుద్దీన్ కష్టాలు ఇంటికి చేరుకున్నా వెంటాడుతూనే ఉన్నాయి.
" నేను పశ్చిమ బెంగాల్‌లోని నా ఇంటికి వస్తే ఆకలితో ఉండను అని అనుకున్నాను కాని ఇప్పుడు నా తలపై పైకప్పు కూడా లేదు" అని అన్నాడు కుత్బుద్దీన్
Keywords : bengaluru, west bengal, kutbuddeen, migrant, corona
(2021-01-17 11:10:19)
No. of visitors : 812
Suggested Posts
| వలస కార్మికుడిని కొట్టి చంపిన పోలీసులుఅసలే కష్టాల్లో ఉన్న వలస కూలీలపై పోలీసుల దుర్మార్గాలు అంతులేకుండా ఉన్నాయి. గుజరాత్ లోని సూరత్ లో ఓ వలస కార్మికుడిని గురువారం సాయంత్రం పోలీసులు కొట్టి చంపారు. |
| అమృత్ మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని బోరుమంటున్న యాకూబ్...వలసకార్మికుల అంతులేని దుంఖంఉత్తర ప్రదేశ్ కు చెందిన అమృత్, యాకూబ్ మహ్మద్ గుజరాత్ లోని సూరత్ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పని లేదు, యజమానులు వదిలేశారు. తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితి వీళ్ళిద్దరిదే కాదు అక్కడున్న వలస కార్మికులందరిదీ. ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికులంతా తలా నాలుగు వేలు ఇచ్చి తమ స్వరాష్ట్రం వెళ్ళడానికి ఓ ట్రక్ మాట్లాడుకున్నారు. |
| మరో గత్యంతరం లేదు...కొడుకు వికలాంగుడు...క్షమించండి... మీ సైకిల్ తీసుకెళ్తున్నా...వలస కార్మికుడి లేఖ
ఓ వలస కూలీ ఆకలితో ఉన్న కుటుంభానికి కడుపు నింపే దారి లేక.... ఉండే ఇల్లు లేక.... స్వంత ఊరు నడిచే వెళ్దామనుకున్నా వికలాంగుడైన కన్న కొడుకును తీసుకొని నడిచి వెళ్ళలేక... వెళ్ళడానికి వేరే దారి లేక... గత్యంతరం లేక... ఓ పాత సైకిల్ ను దొంగతనం చేశాడు. |
| ʹఏక్ పురాణి చెప్పల్ దేదో సాహెబ్... ʹ నెత్తురోడుతున్న కాళ్ళను చూపిస్తూ ఓ వలస కార్మికుడి అభ్యర్థన"ఖానా తో మిల్ జాయెగా సాహిబ్.. ఏక్ పురాణి చప్పల్ దేదో" అని తిలోకి కుమార్ (32) తన కాళ్ళనుండి కారుతున్న రక్తాన్ని చూపించాడు. ఆ కాళ్ళు మొత్తం పుండులాగా ఉన్నాయి.
ఇది ఇక తిలోక్ కుమా ర్ పరిస్థితే కాదు...దేశంలో పట్టణాల నుండి పల్లెలకు వెళ్తున్న అన్ని రోడ్లు ఇప్పుడు వలస కూలీల నెత్తురుతో తడుస్తున్నాయి. |
| వలస కూలీల ఆకలి కేకలు..అన్నం పొట్లం కోసం...! అప్పుడే రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గరున్న అన్నం పొట్లాల కోసం వలస కూలీలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ తిండికోసం నానా తిప్పలు పడ్డారు. |
| ఏమి బతుకూ..ఏమిబతుకూ...వలస బతుకూ...! ఈ రాము, ధన్వంతలదీ అదే వ్యథ !శంలో కోట్లాది మంది వలస కార్మికుల వంటిదే రాము కథ. మధ్యప్రదేశ్ బాలా ఘాట్ కు చెందిన రాము భార్య ధన్వంత, పసి పిల్ల అనురాగినితో కలిసి బతుకు దెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో కూలీ పని చేసి బతికే రాముకు లాక్ డౌన్ వల్ల చేసేందుకు పనిలేక, ఇల్లుకు కిరాయి కట్టలేక, తినడానికి తిండి లేక... |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
|
| అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
|
| షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ
|
| దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్ |
| బీహార్ లో వేలాది మంది రైతుల ర్యాలీ - పోలీసుల దాడి |
| తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ పొలంపనుల్లో... |
more..