అధిక కరెంట్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి...సీపీఎం డిమాండ్


అధిక కరెంట్ బిల్లులను ప్రభుత్వమే భరించాలి...సీపీఎం డిమాండ్

అధిక

తెలంగాణలో అధిక కరంట్ బిల్లులతో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ రోజు జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆన్లైన్ లో జరిగిన ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ పార్టీ విడుదల చేసింది.

సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన ఆన్లైన్ లో జరిగింది. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలను చర్చించి, ఈ క్రింది తీర్మానాలను చేసింది. వాటిని పత్రికలకు విడుదల చేస్తున్నాం.

1. గత మూడు నెలల గృహ విద్యుత్ బిల్లులను సగటు చేయడం వల్ల స్లాబ్ మారి బిల్లులు పెరిగాయి. 50 యూనిట్లు లోపు వాడే వారు యూనిట్‌కు రు. 1.45లు చెల్లించేవారు స్లాబ్ పెరగడం వల్ల రు. 2.60లు కట్టాల్సి వస్తున్నది. డిస్కాంలు ఏనెలకు ఆనెల రీడింగ్ తీసి బిల్లింగ్ చేయాలి. కానీ మూడు నెలలు నెలవారీ రీడింగ్ తీయకపోవడం వల్ల అదనపు భారాన్ని వినియోగదారులు భరించాల్సి వస్తున్నది. డిపార్టుమెంట్ చేసిన విధాన సవరణ వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు. అందువల్ల నెలవారీ రీడింగ్ తీసి బిల్లింగ్ చేయాలి తప్ప సగటు బిల్లింగ్ చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లుల భారాన్ని నివారించాలని, ప్రస్తుతం పెరిగిన విద్యుత్ బిల్లుల భారాన్ని పేదకుటుంబాలకు తగ్గించాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.

2. పోడు భూముల సాగుదార్లకు రక్షణ కల్పిస్తానని, వారి భూమికి పట్టాలిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. నేడు ఫారెస్టుయంత్రాంగాన్ని మరియు పోలీసులను పంపించి నిర్బంధంగా బేదఖల్ చేయడం అత్యంత దుర్మార్గం. ఇప్పటికే రాష్ట్రంలో 1.65 లక్షల మంది రైతులు 4.57లక్షల ఎకరాల సాగులో వున్నారు. వీరిని తొలగించి చెట్లు నాటడం పేరుతో వారు సాగుచేస్తున్న పంటలకు నష్టం కల్గిస్తున్నారు. ఈ నిర్భంధ తొలగింపులు ముఖ్యమంత్రి ప్రకటించిన దానికి విరుద్ధం. ఫారెస్టు డిపార్టుమెంట్ వారు అక్రమంగా గిరిజనులపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. పోడు పేరుతో సాగును వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి మూడు, నాలుగు దశాబ్దాలుగా ఒకే చోట సాగుచేస్తున్న రైతులు పోడు వ్యవసాయం కాకుండా స్థిర వ్యవసాయం చేస్తున్నారు. వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించి 2020 వానాకాలంలో వారు సాగు చేసుకోవడానికి రాష్ట్రప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఫారెస్టు డిపార్టుమెంట్ అభ్యంతరం పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని సిపిఐ(ఎం)కోరుతున్నది.

3. లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. వైరసను ఎదుర్కోవడంలో ముందుపీఠిన నిలబడి సేవలందిస్తున్న డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, జర్నలిస్టులు కోవిడ్ బారిన పడుతున్నారు. ప్రజల్లో తీవ్రమైన అభద్రతా భావం నెలకొన్న ప్రస్తుత పరిస్తితుల్లో రాష్ట్రంలో కరోనా విస్తృతిని అంచనా వేయడానికి పరీక్షలు విస్తృతంగా జరపాలని, ఐసోలేషన్ వార్డుల్లో, ఇతర ఆసుపత్రుల్లో తగు సౌకర్యాలు కల్పించాలని, ట్రిమ్స్ ను కూడా వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సర్వేలు తక్కువ చేసి వ్యాధిగ్రస్తుల సంఖ్యను తక్కువ చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో వీలయినంత ఎక్కువ ప్రజానీకానికి పరీక్షలు చేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. హైదరాబాʹ పాటు వివిధ జిల్లాల్లో ముమ్మరంగా తగు ఏర్పాట్లు చేసి వ్యాధి నిరోధానికి కృషి చేయాలని కోరుతున్నాం. అందుకు పార్టీ సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాయి.
-తమ్మినేని వీరభద్రం
రాష్ట్ర కార్యదర్శి

Keywords : telangana, cpm, power bills
(2020-07-14 04:19:08)No. of visitors : 236

Suggested Posts


0 results

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


అధిక