మావోయిస్టు పార్టీ ప్రకటన...జీవో3ను అమలు చేయాలి, ఓపెన్ కాస్ట్ లను రద్దు చేయాలి, నల్లమలలో యురేనియం త్రవ్వకాలను నిలిపివేయాలి.....‌


మావోయిస్టు పార్టీ ప్రకటన...జీవో3ను అమలు చేయాలి, ఓపెన్ కాస్ట్ లను రద్దు చేయాలి, నల్లమలలో యురేనియం త్రవ్వకాలను నిలిపివేయాలి.....‌

మావోయిస్టు

(సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన పూర్తి పాఠం)

జీవో నంబర్ 3ను అమలు చేయాలి. అటవి భూముల రక్షణకై దున్నేవారికే భూమి జ‌ల్-జంగల్- జమీన్ ఆత్మగౌరవం పై ఆదివాసులకే అధికారం అంటూ సమరశీలంగా, మిలిటెంట్ గా పోరాడుదాం!

తరతరాలుగా కొన్ని వేల వందల సంవత్సరాలుగా ఆదివాసులు అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని పోడు వ్యవసాయం చేసుకుంటూ అడవులను రక్షిస్తూ అడవుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వర్గ‌ సమాజపుఆధిపత్య‌ విస్తరణ కాంక్ష, దోపిడీకాంక్ష అడవులలో నిక్షిప్తమై వున్న సంపదను దోచుకోవడానికి రాజులు, దళారీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు చరిత్ర పొడవున అనేక దురాక్రమణ యుద్ధాలు కొనసాగించారు. మారణ హోమాలు సృష్టించారు. ఆదివాసులు, రాజులకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా వీరోచితంగా సాయుధ తిరుగుబాటు కొనసాగించారు. నేటి వరకు పోరాడుతూనే ఉన్నారు. దీనితో వలస పాలకుల నుండి నేటి పాలకుల వరకు అనివార్యంగానే కొన్ని హ‌క్కులు కల్పిస్తూ చట్టాలు చేశారు. 5, 8వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి 1/70, పేసా, 2006 అటవీ హ‌క్కుల గుర్తింపు చట్టం, తదితర చట్టాలను కల్పించారు. కానీ ఆదరణలో అడవిలో వున్న వనరులను లూటీ చేయడానికి ఈ చట్టాలు అడ్డుగా వున్నాయి. దీనితో వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారు.
పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు, దళారీ పెట్టుబడిదారులకు అటవీ ప్రాంతాలలో వున్న అపారమైన ఖనిజ సంపదను దోచి పెట్టడానికి, దోచుకోవడానికి ఆది వాసులు కబ్జాదారులని కుట్రతో ముద్రలు వేస్తున్నారు. అడవులలో అక్రమంగా నివసిస్తున్నారని, పోడు వ్యవసాయం వల్ల అడవులు అంతరిస్తున్నాయని ఆదివాసీలను అడ‌వుల నుండి గెంటివేయాలని 2019 ఫిబ్రవరి 13వ తారీఖునాడు. సుప్రీంకోర్టు 21 రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా 40 లక్షల మంది ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.
గతంలో ఆదివాసీలు నిరక్షరాసులు కాబట్టి ఆదివాసేతరులే ఏజెన్సీలో ఉద్యోగాలు చేసేవారు. ఆదివాసులు ఇప్పుడిప్పుడే విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ రిజర్వేషన్ల ప్రకారం ఏజన్సీ ప్రాంతాల్లో కొన్ని ఉద్యోగాలలో మాత్రమే భర్తీ అవుతున్నారు. దీన్ని కూడా ఓర్వలేని దోపిడీ పాలకులు ఏజన్సీలో అన్ని ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వవద్దని, ఆదివాసీలకు ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలు ఇచ్చే జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు ద్వారా రద్దు పరిచారు. ఈ జీవోను వెంటనే పునరుద్ధరించాలి పునరుద్ధరణ చేసేవరకు ఆదివాసులు పెద్దఎత్తున పోరాడాలి.
ఆదివాసీలను అడవుల నుండి గెంటివేసే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే నూతన అటవీ ముసాయిదా సవరణ చట్టం-2019ని మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చింది. దీనితో ఆదివాసీల హక్కుల చట్టాలతో పాటు జీవనోపాధి, సంస్కృతిని కోల్పోతారు. ప్రస్తుతం ఉన్న చట్టాల జోలికి పోకుండానే వాటిని నీరు గారుస్తూ కొత్త చట్టాల ద్వారా పాలకులు కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలను నెరవేరుస్తున్నారు. పాలకులు ఆదివాసులను ఈ ప్రకృతిలో, మానవ సమాజంలో భాగంగా చూడడానికి ఇష్టపడడం లేదు.తెలుగు రాష్ట్రాల్లో 1980 తర్వాత నుండి షెడ్యూల్ ప్రాంతాల్లో ఇతరుల వలసలు విపరీతంగా పెరిగాయి. ఆదివాసీల నివాస ప్రాంతాలన్నీ ఆదివాసేతరుల నివాస ప్రాంతాలుగా, వ్యాపార కేంద్రాలుగాను మారిపోయాయి.

ఏజన్సీ ప్రాంతాలలో రకరకాల పరిశ్రమలు స్థాపించిన కార్పోరేట్ సంస్థలు, భూస్వాములు, కల్ప వ్యాపారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓపెన్ కాస్ట్ గనులు, ఇనుప గనులు, సిమెంట్, బాక్సైట్, యురేనియం త్రవ్వకాలు కొనసాగిస్తూ పరిశ్ర‌మలు స్థాపించి ప్రకృతిని, పర్యావరణాన్ని, అడవులను నాశనం చేస్తున్న వీళ్ళే అసలైన దురాక్రమణ దారులు. కానీ రెండు శాతం అటవీ భూములను తాము బ్రతకడానికి సాగు చేసుకుంటున్న ఆదివాసీలను దురాక్రమణ దారులుగా పాలకులు సుప్రీంకోర్టు ద్వారా పేర్కొనడు దొంగే దొంగ అన్న చందంగా ఉంది.
నేడు సామ్రాజ్యవాదుల ప్రపంచీకరణ అభివృద్ధి నమూనా ఆదివాసీల పాలిట శాపంగా మారింది. పెట్టుబడిదారుల కోసం అడవి బిడ్డలను గెంటివేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణలో అభివృద్ధి నమూనా బూచిని చూపి భారీ ప్రాజెక్టులు, గనులు వెలికితీత, ఓసీలు, టైగర్ జోన్లు, వన్యప్రాణి అభయారణ్యాలు, మేడిగడ్డ, పోలవరం, మల్లన్న సాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణాల వలన లక్షలాది ఎకరాల భూములు, అడవులు, జంతుజాలాలు అంతరించి పోతున్నవి. వందలాది ఆదివాసి, గైరాదివాసి గ్రామాలు జల సమాధి అవుతున్నాయి. లక్షలాది మంది ఆదివాసులు, పీడిత ప్రజలు నిర్వాసితులవుతున్నారు.

టీఆరెస్ కేసీఆర్ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయి ఆదివాసుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను తుంగలో తొక్కి 2015 నుండి హ‌రితహారాన్ని చేపట్టి ఆదివాసీల పంట చేళ్ళను ధ్వంసం చేస్తూ ఆదివాసీలు సాగుచేసుకుంటున్న అటవీ భూములను, ఫారెస్టును పోలీసుల ద్వారా దౌర్జన్యంగా ఆక్రమించుకొంటున్నారు. తిరిగి జూన్ 2020 నుండి 6వ దశ హ‌రితహారాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్నది. జంగల్ బచావో జంగల్ బడావో అంటూ జ‌ల్ జంగల్‍జమీనును ఆక్రమించుకుంటూ ఆదివాసులను వాళ్ళ భూముల నుండి, ఆవాసాల నుండి గెంటివేస్తున్నారు. పదుల సంఖ్యలో వలస ఆదివాసుల గ్రామాలను తగులబెట్టారు.

తెలంగాణలో 2018 నవంబర్ 30 తేదీ నాటికి 94,360 అటవీ హక్కుల పత్రాలను పంపిణీ చేశారు. వీటిలో 7, 54, 339 ఎకరాల భూమికి హక్కు పత్రాలు అందాయి. 83,757 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఈ వాస్తవాలు తెల్సి కూడా తెలంగాణ ప్రభుత్వం గత 5 ఏళ్ళుగా పట్టా భూములను గుంజుకుంటున్నది. భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలు మహబూబాద్, ములుగు, జయశంకర్, పెద్దపల్లి ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ వరకు భూములను సాగుచేసుకోకుండా భూముల చుట్టూ భారీ కందకాలు తవ్వుతున్నది. అడ్డుకున్న ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ వందలాది మందిపై కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తున్నది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అటవీ భూములకు పట్టాలిస్తానని నమ్మబలికి తీరా ఏరు దాటాకా బోడ మల్లయ్య అన్నట్లు కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అదే దౌర్జనాన్ని కొనసాగిస్తున్నది. ఆదివాసులు సంప్రదాయకంగా అడవిలోకి వేటకు పోవడాన్ని కూడా నిషేదించారు. ఉడుతలు, ఉడుములను వేటాడిన ఆదివాసులను ఫారెస్టు అదికారులు కొడుతూ జరిమానాలు విధిస్తూ జైళ్ళకు పంపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ నెలలో గండి గోపాలపూర్ గ్రామ మేకల కాపరిని ఫారెస్టు అధికారులు తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో అతను మరణించాడు. హరితహారానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రజాసంఘాల నాయకులను, అరెస్టు చేసి జైళ్ళలో బంధించారు. ఆదివాసుల అటవీ భూముల రక్షణ కోసం పోరాడుతున్న విప్లవకారులను (మావోయిస్టు పార్టీని) బూటకపు ఎన్‌కౌంటర్లలో, హత్యలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్, పారామిలటరీ బలగాలతో కూంబింగ్స్ చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవి ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం ఖనిజాన్ని వెలికితీయడానికి చెంచు ఆదివాసులను అడవి నుండి ఖాళీ చేయించడం మొదలు పెట్టాయి. ప్రజలు, ఆదివాసులు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు కలిసికట్టుగా పోరాటాలు కొనసాగించడంతో తాత్కాలికంగా త‌వ్వకాలు ఆపినట్లు నటిస్తూ మళ్ళీ త‌వ్వకాలను కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పోరేట్ సంస్థల బ్రోకరైన కేంద్ర, రాష్ట్ర పాలకులు గుంటకాడి నక్కలాగా పొంచి ఉన్నారు. వెంటనే తిరిగి పోరాటాన్ని కొనసాగించడం ద్వారానే నల్లమల్లను రక్షించుకోగలం. ఉత్తర తెలంగాణలో విస్తృతంగా త‌వ్వుతున్న ఓపెన్‌కాస్టుల వలన భూములు, అడవులు, పర్యావరణం దెబ్బతింటూ ఆదివాసీలు, రైతాంగం జీవనోపాధిని కోల్పోతున్నారు. అందువల్ల వెంటనే పెద్ద ఎత్తున ఓసిలకు వ్యతిరేకంగా పోరాడాలి.
హరితహారాన్ని భూస్వాముల భూములు, ప్రభుత్వ భూముల, మైదాన ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగించాలి. అటవి ప్రాంతంలో హరితహారం అవసరం లేదు. అటవి ప్రాంతంలో కొనసాగించే హరితహారం వేల కోట్ల రూపాయలు పాలకులు దోచుకునే పథకం తప్ప మరొకటి కాదు. అందుకే దున్నేవారికే భూమి నినాదంతో జల్-జంగల్-జమీన్ ఆత్మగౌరవం- అధికారం కోసం ఆదివాసీలు, పేదరైతులు సమరశీలంగా, మిలిటెంట్ గా పోరాటాలను కొనసాగించాలి. నక్సల్బరీ, శ్రీకాకులం, జగిత్యాల, ఇంద్రవెల్లిలను సృష్టించడం ద్వారానే అటవీ భూములను కాపాడుకోగలుగుతాం. రాండి పోరాడితే పోయేది ఏమీలేదు. భూమిపై, అడ‌వి పై అధికారం సిద్ధిస్తుంది.

డిమాండ్స్
(1) అటవీ భూముల పై, ఫారెస్టు, పోలీసు శాఖలు సమన్వయంతో చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలి.
(2) ఆదివాసులు, రైతాంగంపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
(3) ఆదివాసీలను అడవుల నుండి తొలిగించాలని ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలి.
(4) సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నంబర్-3ను అమలు చేయాలి ఏజెన్సీ ప్రాంతంలో మూల ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్లను కల్పించాలి.
(5) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టాన్ని, పెసా చట్టంతో కలిపి అమలు చేయాలి.
(6) తిరస్కరించబడిన అటవీ హక్కుల దరఖాస్తులన్నింటిని పెండింగ్ కేసులుగా పరిగణించి వాటిని సమీక్షించి పట్టాలివ్వాలి. కొత్త క్లెయిమ్స్ కూడా పట్టాలివ్వాలి.
(7) ఆదివాసీలు, పేదలు సాగుచేసుకుంటున్న అటవీ భూములను హరితహారం పేరుతో గుంజుకోవడం నిలిపివేయాలి.
(8) అభయారణ్యాలు, టైగర్ జోన్స్, ఓసిలను రద్దు చేయాలి. నల్లమలలో యురేనియం త్రవ్వకాలను నిలిపివేయాలి.
(9) ఆదివాసీలపై, పీడిత ప్రజలపై దాడులకు, హత్యలకు పాల్పడుతున్న ఫారెస్టు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజల చేతిలో ప్రజాకోర్టులో శిక్షలు తప్పవు.
విప్లవాభినందనలతో
జగన్
అధికార ప్రతినిధి

Keywords : maoists party, tribals , adivasi, media statement,
(2020-07-14 01:43:58)No. of visitors : 998

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


మావోయిస్టు