జైల్లో రాజకీయ ఖైదీ సుశాంత్ శీల్ మృతి.... ప్రభుత్వానిదే బాధ్యత అని CRPP ప్రకటన‌


జైల్లో రాజకీయ ఖైదీ సుశాంత్ శీల్ మృతి.... ప్రభుత్వానిదే బాధ్యత అని CRPP ప్రకటన‌

జైల్లో

రాజకీయ ఖైదీల విడుదల పోరాట కమిటీ ( CRPP ) ఏర్పాటు చేసిన అత్యవసర పత్రికాసమావేశం ప్రకటన...

జైలు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సుషాంత్ షీల్ అనే రాజకీయ ఖైదీ డమ్ డమ్ కేంద్ర కారాగారంలో ఈ మధ్యాహ్నం ( 16 - 6 - 2020 ) మరణించారు. అతని మరణవార్తను అధికారికంగా ధృవీకరించనప్పటికీ సుషాంత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి లోనవుతున్నాం. ఇప్పటివరకు స్థిరంగా ఆరోగ్యంగా ఉన్న ఒక రాజకీయ ఖైదీ హఠాత్తుగా చనిపోవడానికి కారణాలు ఏమైవుండాలి? మాకు తెల్సిన సమాచారం మేరకు షుషాంత్ షీల్ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. కానీ గత తొమ్మిదేళ్లుగా విచారణ ఖైదీగా ఉన్న వ్యక్తి మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధీనంలోని జైళ్ళ శాఖదే. గత కొన్నేళ్లుగా రాజకీయ ఖైదీలు ఒకరితర్వాత ఒకరుగా తమ అమూల్యమైన ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. జైళ్ళల్లోని ఖైదీల స్థితి గతుల పట్ల ప్రభుత్వం, జైళ్ళ శాఖ అవలంభిస్తోన్న నిర్లక్ష్య ధోరణి, వారిపట్ల కక్ష్య సాధింపు విధానాలే రాజకీయ ఖైదీల మరణాలకు ప్రధాన కారణాలుగా తేలుతున్నాయి. అనేక సంవత్సరాలుగా జైళ్లలోని అనారోగ్య వాతావరణం, సరైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడం, జైళ్ళు కిక్కిరిసిపోయి ఉండడం ఖైదీల ఆరోగ్య పరిస్థితులని దెబ్బతీస్తున్నాయి.

నెలకొన్న ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్లో ఖైదీలందర్నీ విడుదల చేసి జైళ్లని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు పదేపదే ఆదేశాలిస్తున్నా సరే ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏ రాష్ట్రంలోనూ ఒక్క రాజకీయ ఖైదీని కూడా విడుదల చేయలేదు. దీనికితోడు న్యాయ వ్యవస్థ మందగమనం, జైళ్లలోని అనారోగ్య వాతావరణం కలిసి రాజకీయ ఖైదీల జీవించే హక్కుని కాలరాచి వేస్తున్నాయి. ఇకపై ఇటువంటి సందర్భాల్ని మనం ఎంతమాత్రం కొనసాగనివ్వకూడదు. సుషాంత్ షీల్ మృతిపై, నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా వివిధ జైళ్ళల్లో మగ్గుతున్న అనేకమంది రాజకీయ ఖైదీలనీ, మరీ ముఖ్యంగా అనారోగ్య పీడితుల్ని, వయోవృద్ధుల్ని, గర్భిణీ స్త్రీలని, మహిళల్ని, ఆదివాసీల్ని తక్షణమే విడుదల చేయాలి. కరోనా పాండమిక్ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు అదేశాల్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

సంచిత
కార్యదర్శి
CRPP, బెంగాల్

Keywords : west bengal, political prisoner, DUM DUM Jail, Death
(2020-07-14 09:07:21)No. of visitors : 285

Suggested Posts


కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ

జాదవ్ పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సహకారంతో ఏబీవీ సృష్టించిన హింసాకాండను వ్యతిరెకిస్తూ... ప్రజాస్వామ్యంపై కాషాయ మూక చేస్తున్న దాడులను నిరసిస్తూ....విద్యార్థిలోకం గర్జించింది. వాళ్ళకు మద్దతుగా ప్రజలు కదం తొక్కారు.

అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌

సిద్దాంతపరంగా శత్రువులమని చెప్పుకునే సీపీఎం, బీజేపీ లు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి సిద్దాంతాలు అవసరం లేదని భావిస్తున్నట్టున్నాయి ఆ రెండు పార్టీలు. పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో త్రుణమూళ్ కాంగ్రెస్ ను ఓడించడం కోసం

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ లో ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది.

భిన్నాభిప్రాయాలపై దాడికి తీవ్ర‌ ప్రతిఘటన ఉంటుంది.. ప్రాణాలకు తెగించే ప్రజలున్నారు - అమర్త్యసేన్

ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని

కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాల యంలో గురువారంనాడు ఏబీవీపీ నిర్వహించిన సెమినార్ కు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో హాజరయ్యి మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని, మూక దాడులను ప్రతిసారీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రోహోదగ్రులై నిరసన వ్యక్త

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


జైల్లో