వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !


వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !

వరవరరావుతో

విప్లవ రచయిత వరవరరావు సహా జైల్లో ఉన్న సామాజిక కార్యకర్తలందరినీ బెయిల్ పై విడుదల చేయాలంటూ ప్రముఖ దర్శకులు ఆదూర్ గోపాల కృష్ణన్, సౌమిత్రా చటర్జీ, అపర్నా సేన్, నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ సహా దేశవ్యాప్తంగా 500 మంది అనేక రంగాలకు చెందిన‌ ప్రముఖులు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం...
1. వరవరరావు

2. సుధా భరద్వాజ్

3. షోమా సేన్

4. ఆనంద్ తేల్తుంబ్డే

5. గౌతమ్ నవ్ లఖా

6. అరుణ్ ఫెరీరా

7. వెర్నన్ గొంజాల్వెజ్

8. సురేంద్ర గాడ్లింగ్

9. మహేష్ రావత్

10. సుధీర్ దావ్లే

11. రోనా విల్సన్

పైన పేర్కొన్న సామాజిక కార్యకర్తలు అందరూ మేదావులు, రచయితలు, కవులు. దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత పేద మరియు అట్టడుగు ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు రాజకీయ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. వాళ్ళు ఉన్న మహారాష్ట్ర జైళ్లలో, కరోనా కారణంగా కొంతమంది ఖైదీలు మరణించారు. అనేక మందికి కరోనా సోకింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు బెయిల్ మంజూరు కాలేదు.

అదే విధంగా అస్సాంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పదేపదే స్వరం వినిపించిన అఖిల్ గొగోయికి కూడా బెయిల్ నిరాకరించబడింది.

ఈ కార్యకర్తలు దోషులుగా నిర్ధారించబడలేదు. వారు దేశం నుండి ఎక్కడికీ పారిపోవాలనుకోవడం లేదు. చట్టం నుండి తప్పించుకోవాలని అనుకోవడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న ఈ సమయంలో వారి ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున వారికి మానవతా దృక్పథంతో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని మేము కోరుతున్నాము. 80 సంవత్సరాల వయసున్న వరవరరావు చాలా అనారోగ్యంతో ఉన్నారని, పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించార‌ని తెలుసుకున్నాం.

సిఎఎకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు అరెస్టయిన జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థిని, గర్భిణీ అయిన సఫూరా జర్గర్ కు కూడా బెయిల్ నిరాకరించడం ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఆమె జీవితాన్నేకాక‌ పుట్టబోయే బిడ్డ జీవితాన్ని కూడా ప్రమాదంలోపడేస్తుంది.
CAA,NPR, NRC లకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రజాస్వామ్య, శాంతియుత ప్రజా నిరసనలకు నాయకత్వం వహించిన JNU, జామియా విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులను కూడా COVID-19 లాక్డౌన్ సమయంలో క్రిమినల్ కేసులలో ఇరికించి జైళ్ళలోకి నెట్టారు.
మొదట పేర్కొన్న సామాజిక కార్యకర్తలతో సహా సఫూరా జర్గర్, ఇతర విద్యార్థులందరికీ తక్షణం బెయిల్ మంజూరు చేయాలి.
జైళ్లలో కరోనా వ్యాప్తి గురించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు.

అమెరికన్ బార్ అసోసియేషన్ - సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ భారతదేశంలోని జైళ్ళలో నిర్బంధించబడుతున్న మానవ హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా మీరు గుర్తుంచుకోవాలి.

ఇటువంటి పరిస్థితులలో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలను, నిరసన తెలిపే విద్యార్థులను నిర్బంధించడాన్ని చూసి మేము చాలా బాధపడుతున్నాము. మీ దృష్టి మన దేశంలో అసమ్మతిని అణచివేయడంపై కాకుండా, జైలులో, బైట కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడంపై ఉండాలి.

ఒక అద్భుతమైన‌ భారతదేశం కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్న మన ప్రముఖ సామాజిక కార్యకర్తలు, అసమ్మతి వ్యక్తం చేసే విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా జైలులోపాలు చేశారు. ఇప్పుడు కరోనా మూలంగా జైళ్ళలో వారికేమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహి‍ంచాల్సి వస్తుంది.
అట్టడుగు ప్రజల కోసం నిలబడే వారిపట్ల‌, ప్రజాస్వామ్యబద్దమైన‌ విబేధాలతో ఉన్నవారి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఈ దేశం, ప్రపంచం మొత్తం నిశితంగా గమనిస్తుంది. ఈ సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల పరి రక్షకులందరినీ వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

సంతకాలు చేసిన వారి జాబితా:Keywords : varavararao, maharashtra jail, Soumitra Chatterjee, Adoor Gopalakrishnan,
(2021-05-06 12:36:14)No. of visitors : 627

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

Search Engine

మహానుభావా, దయచేసి దయచేయండి...ప్రధానికి అరుంధతీ రాయ్ విజ్ఞప్తి
మన ఈ పరిస్థితికి ఎవరిని నిందిద్దాం ?
షట్ అప్.. గెట్ అవుట్.. జర్నలిస్టులపై నోరు పారేసుకున్న బండి సంజయ్
సుధా భరద్వాజ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?
జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించండి - యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు
నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం... చీకట్లను చీల్చుకొని మళ్ళీ జనం మధ్యకు వస్తాం - విరసం
కేసీఆర్ కు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ - ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్
Professor Hargopal wrote a letter to KCR - demanding the lifting of the ban on 16 mass organizations
COVID19 : ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి - మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు
ఆస్పత్రిలో నా భర్తను చిత్ర హింసలు పెడుతున్నారు... ఆయనను జైలుకు తరలించండి: సీజేఐకి జర్నలిస్టు కప్పన్ భార్య విన్నపం
ఆక్సీజన్ కొరత పై రూమర్స్ ప్రచారం చేస్తే ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం
16 సంఘాల మీద నిషేధంపై ప్రజా సంఘాల ప్రెస్ మీట్ వీడియో
ʹతెలంగాణలో ప్రజా సంఘాలపై నిషేధం ఎమర్జన్సీని గుర్తుకు తెస్తున్నదిʹ
ʹప్రజా సంఘాలపై నిషేధం కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టʹ
ʹమావోయిస్టు ఎజెండా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజా సంఘాలపై నిషేధం విధించడం దుర్మార్గంʹ
తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థి సంఘాలపై నిషేధం ఎత్తి వేయాలి - AISF
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాల పై పెట్టిన నిషేధాన్ని ఎత్తి వేయాలి :ఎస్.ఎఫ్..ఐ
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం - న్యూ డెమాక్రసీ
పౌరహక్కుల సంఘానికి నాయకుణ్ణవుతా అన్నవాడే ఆ సంఘాన్ని నిషేధించడం అనైతికం
విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం
ఆదివాసీ ప్రాంతాలపై బాంబు దాడుల నేపథ్యంలో శాంతి కమిటీకి సీనియర్ జర్నలిస్టు రాజీనామా
పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల
థూ.......
మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌
more..


వరవరరావుతో