రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !


రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !

రాజకీయ

బూటకపు భీమా కోరెగావ్ కేసులో ఖైదీలుగా వున్న 11 మంది ప్రముఖ మేధావులు, ప్రజాస్వామ్య / మానవ హక్కుల కార్యకర్తలతో సహా దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో వున్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ), ఇతర క్రూర చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఈ చట్టాల క్రింద అరెస్టు చేసిన జెఎన్‌యు, జామియా మిలియా విశ్వవిద్యాలయం, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి నాయకులు(షార్జీల్ ఇమామ్, షఫూరా జర్గర్, మీరన్ హైదర్, ఖలీద్ షెఫీ, గల్ఫిషన్ ఫాతిమా, దేవాంగనా కత్లిత, నటాషా నార్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తదితరులు), కార్మిక సంఘాల కార్యకర్తలు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు అందరినీ వెంటనే విడుదల చేయాలని, CAAను రద్దు చేయాలని, NRC , NPR ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, ఈ చట్టానికి/ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా అరెస్టు చేసినవారినందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రైట్స్ (AFDR), ఇతర ప్రజా సంఘాలు ఈ నెల 4, 5, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, తాలూకాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించి అధికారుల ద్వారా దేశ రాష్ట్రపతికి మెమోరాండాలు పంపించాయి. ఆ సంస్థ లేఖ డిమాండ్ల పూర్తి పాఠం...

అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రైట్స్ (AFDR)

పంజాబ్

ప్రొ. ఏ. కె. మలెరీ ప్రొ. జగ్‌మోహన్ సింగ్

అధ్యక్షులు కార్యదర్శి

2409 కృష్ణ నగర్, లూధియానా 141001

గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి,

రాష్ట్రపతి భవన్, న్యూ ఢిల్లీ.

జిల్లా కమిషనర్ల ద్వారా………………..

విషయం: - UAPA ను ఏకపక్షంగానూ, అనుచితంగానూ ఉపయోగించడంపై తనిఖీ చేయడానికి సంబంధించి -

సర్,

లాక్డౌన్ కాలంలో ప్రజా సమస్యల కోసం గళాన్నెత్తిన
వివిధ సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నాయకులు, పాత్రికేయులను ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) లాంటి వివిధ క్రూర చట్టాల క్రింద అరెస్టు చేసి జైళ్ళ లో పెడుతోందని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్ (AFDR) పంజాబ్, ప్రజా సమస్యలగురించి ఆందోళన చెందుతున్న వివిధ పౌరులు, ప్రజాసంఘాలకు చెందినవారమైన మేము - మీ దృష్టికి తీసుకురాదల్చుకున్నాము. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా, దీర్ఘకాల లాక్డౌన్ ప్రకటించిన కారణంగా అత్యధిక ప్రజానీకపు జీవనోపాధి, సాధారణ జీవిత కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమైన సమయంలో ఇదంతా జరుగుతోంది. సాధారణ ప్రజల జీవితాలను మున్నెన్నడూ కనీ, వినీ ఎరుగని కష్టాలు ముంచెత్తాయి. లాక్డౌన్ నిబంధనలు కాస్త సడలించబడుతున్నప్పటికీ, ఇప్పటికే నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, నిర్వాసిత్వాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న రోజు కూలీ కార్మికులు, చిన్న వ్యాపారవేత్తలు, రైతాంగం, ఆదివాసీల అనేక సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణం ద్రృష్టిపెట్టాల్సిన అవసరం వుంది.

మా డిమాండ్లు:

1 బూటకపు భీమా కోరెగావ్ కేసులో ఖైదీలుగా వున్న 11 మంది ప్రముఖ మేధావులు, ప్రజాస్వామ్య / మానవ హక్కుల కార్యకర్తలతో సహా దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో వున్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి. కోవిడ్ -19 అంటువ్యాధి నేపథ్యంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయడంలో రాజకీయ అనుబంధాల ఆధారంగా జరుగుతున్న వివక్షను అంతం చేసి రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి .
2 చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ), ఇతర క్రూర చట్టాలను వెంటనే రద్దు చేయాలి. ఈ చట్టాల క్రింద అరెస్టు చేసిన జెఎన్‌యు, జామియా మిలియా విశ్వవిద్యాలయం, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి నాయకులు(షార్జీల్ ఇమామ్, షఫూరా జర్గర్, మీరన్ హైదర్, ఖలీద్ షెఫీ, గల్ఫిషన్ ఫాతిమా, దేవాంగనా కత్లిత, నటాషా నార్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తదితరులు), కార్మిక సంఘాల కార్యకర్తలు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు అందరినీ వెంటనే విడుదల చేయాలి.
3 CAAను రద్దు చేయాలి, NRC , NPR ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. ఈ చట్టానికి/ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా అరెస్టు చేసినవారినందరినీ విడుదల చేయాలి.
4 ఇటీవల ఢిల్లీలో జరిగిన హింసాకాండపై నిజాయితీతో, న్యాయమైన, నిష్పాక్షిక విచారణ జరగాలి. రెచ్చగొట్టే ఉపన్యాసాలు (అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రా, పర్వేష్ వర్మ మరియు ఇతరులు) చేసిన, హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్న నాయకులను సంబంధిత నేర చట్ట నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలి.
5 కరోనా గత్తరని ఎదుర్కోవడం అనే ముసుగులో ఇటీవల చేసిన కార్మిక చట్టాల నిబంధనలను సడలించడం, రైతు / వ్యవసాయ వ్యతిరేక ఆర్డినెన్సులు, సమాజంలోని ఇతర సెక్షన్లకు వ్యతిరేకంగా తీసుకున్న విధానాలు / నిర్ణయాలు ఆదివాసీలను పెద్ద ఎత్తున నిర్వాసితులను చేసే విదేశీ, దేశీయ కార్పొరేట్ సంస్థలకు మైనింగ్ హక్కులను ఇవ్వడం లాంటి చట్టపర, విధానపర నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
6 కోవిడ్ 19 అనేది ఆరోగ్య క్షేత్రానికి సంబంధించిన ఒక తీవ్రమైన సమస్య కాబట్టి దాన్ని ఆరోగ్య నిపుణులు పరిష్కరించాలి. కాని ఆ బాధ్యతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అప్పగించి, ఒక శాంతిభద్రతల సమస్యగా మార్చడం వల్ల సమస్య మరింతగా తీవ్రతరమై ప్రజలు ఎనలేని కష్టాలకు గురికావాల్సి వచ్చింది. అంటువ్యాధి సమస్యను సరిగ్గా పరిష్కరించడంలో పొందిన వైఫల్యాన్ని, ప్రజలను తీవ్ర అసౌకర్యాలకు గురిచేయడంలో గల తన బాధ్యతను ప్రభుత్వం అంగీకరించాలి. కార్మికులను శారీరకంగా హింసించి, అణచివేతకు గురి చేసిన పోలీసు అధికారులందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కరోనా గత్తరను ఎదుర్కోనే పేరుతో పోలీసు అధికారులకు ఇచ్చిన విశేష విచక్షణాధికారాలు, విశేష నియమాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను తగ్గించే విపత్తు నిర్వహణ చట్టం 2005 మరియు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 లోని వివిధ నిబంధనల ప్రకారం ఆమోదించబడిన అన్ని ఏకపక్ష, అప్రజాస్వామిక ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి.
7 లాక్డౌన్ వ్యవధిలో మెరుగైన ఆరోగ్య సేవలకు బదులు, లాక్డౌన్‌కు ముందు తమకు అందుబాటులో ఉన్న అతి తక్కువ ఆరోగ్య సేవలను కూడా ప్రజలు కోల్పోయారు. ప్రజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా వివిధ రుగ్మతలకు చికిత్స పొందడానికి వీలుగా సాధారణ ఆరోగ్య సేవా సౌకర్యాలను పున: ప్రారంభించాలి.
8 ఆకలి పేదరికాల నుంచి ప్రజల ఉపశమనం కోసం, దీర్ఘకాల, ముందస్తు ప్రణాళిక లేని లాక్డౌన్ కారణంగా నిరుద్యోగులైన యువత, కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారవేత్తలకు ఉపాధి కల్పించడానికి వెంటనే దృఢమైన చర్యలు చేపట్టాలి. లాక్డౌన్ కారణంగా సాధారణ జీవితమూ, జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమైన వలస కార్మికుల పునరావాసం కోసం దేశ స్థాయి ప్రత్యేక కార్యక్రమాలు / పథకాలు ప్రణాళిక అమలు చేయాలి. అటువంటి పథకాల అమలు జరిగే లోపు వారికి తగినంత ఉచిత రేషన్లు, నగదు బదిలీ రూపంలో తగిన ఉపశమనం కల్పించాలి. కార్మికులు, ఇతర వ్యక్తులు తమ పని ప్రదేశాలకు వెళ్ళేందుకు వీలుగా స్థానిక బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.
9 కరోనా గత్తర ప్రజారోగ్య సేవల కొరతను బయటపెట్టింది. కాబట్టి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోవాలి. ఆరోగ్యం, విద్య, తాగునీటి సరఫరా, ప్రజా పారిశుధ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ మొదలైన వాటికి సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, విభాగాలను బలోపేతం చేయాలి, వాటి పరిధిని విస్తృతం చేయాలి. లాక్డౌన్ సమయంలో మూసివేసిన OPD ఆరోగ్య సేవలను పున:ప్రారంభించాలి, మరింత విస్తృత పరచాలి. ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను జాతీయం చేయాలి. ఆరోగ్య సేవలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి జిడిపిలో కనీసం 12% కేటాయించాలి.
10 ఆరోగ్య సంబంధిత సమస్యలను ఆరోగ్య నిపుణులు పర్యవేక్షించాలి. శాంతిభద్రతల సమస్యగా మార్చి పోలీసులకు అప్పగించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. పోలీసుల దురాగతాల నుంచి ప్రజలను రక్షించాలి, లాక్డౌన్ సమయంలో వారిపై నమోదైన కేసులు ఉపసంహరించాలి.


Keywords : AFDR, Punjab, bhima koregaon, varavararao, JNU, Jamia milia university, UAPA
(2020-07-14 10:11:49)No. of visitors : 246

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


రాజకీయ