జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం


జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం

జ్యుడిషియల్

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సతంకుళం పోలీసు స్టేషన్ లో తండ్రి కొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ లను పోలీసులు చిత్ర హింసలకు గురి చేసి చంపిన సంఘటనపై మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సంతక్కులం పోలీసు స్టేషన్ ను స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులను నియమించమని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
దీనికి ముందు తండ్రీ కొడుకుల కస్టడీ మరణంపై మద్రాసు హైకోర్టు న్యాయ విచారణకు ఆదేశించి,అందుకు కోవిల్పట్టి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ భారతిదాసన్ ను నియమించింది. భారతి దాసన్ న్యా బృందంతో కలిసి సంతక్కులం పోలీసు స్టేషన్ కు వెళ్ళి విచారణ చేయడానికి ప్రయత్నించగా పోలీసులు సహకరించకపోగా న్యాయాధికారులనే బెదిరించడానికి ప్రయత్నించారు. దాంతో విచారణను ఆపేసి మధ్యలోనే వెళ్ళిపోయారు మేజిస్ట్రేట్ భారతిదాసన్, తదితరులు. ఈదే విషయం హైకోర్టుకు విన్న వించారు. దాంతో హైకోర్టు సంతక్కులం పోలీసు స్టేషన్ ను స్వాధీనపర్చుకోవాలని కలక్టర్ ను ఆదేశించారు. అంతే కాకుండా న్యాయ విచారణకు సహకరించ కుండా న్యాయమూర్తినే బెదిరించిన‌ ఏఎస్పీ డీ.కుమార్, డీఎపీ ప్రతాపన్, కానిస్టేబుల్ మహారాజన్ లపై కోర్టు ధిక్కరణ, క్రిమినల్ చర్యలకు ఆదేశించింది.

విచారణాధికారి మేజిస్ట్రేట్ భారతీదాసన్ హైకోర్టు కు ఇచ్చిన నివేదిక గురించి సోర్స్ ల ను ఉటంకిస్తూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వివరాలు రాసింది. ʹʹఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో న్యాయ బృందం సతంకుళం స్టేషన్‌కు చేరుకుంది. విచారణకు హాజరైన ఇద్దరు సీనియర్ అధికారులు ఎ.ఎస్.పి కుమార్ మరియు డి.ఎస్.పి ప్రతాపాన్ విచారణ అధికారులను అసలు పట్టించుకోలేదని మేజిస్ట్రేట్ భారతీదాసన్ తన ఫిర్యాదులో చెప్పారు. అంతేకాక ఎ.ఎస్.పి కుమార్ "తన కండరాలను ప్రదర్శించాడు " అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

న్యాయ బృందం రోజువారీ రిజిస్టర్ మరియు ఇతర పత్రాలను తనిఖీ కోసం అడిగినప్పుడు వాటిని ఇవ్వలేదు పైగా బెదిరింపు దోరణిలో మాట్లాడారని‌ మేజిస్ట్రేట్ చెప్పారు. సోర్సుల ప్రకారం తనిఖీని ఆలస్యం చేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. మెల్లిగా ఒక్కొక్క పత్రం బైటపెట్టారని భారతిదాసన్ చెప్పారు.
న్యాయ బృందంలో సిసిటివి ఫుటేజ్‌ను డౌన్‌లోడ్ చేసి తిరిగి పొందగల నిపుణులు కూడా ఉన్నారు, ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజీ కీలకమైన ఆధారం. అయితే ప్రతిరోజూ డేటా చెరిపేసే విధంగా సెట్టింగ్ చేసి పెట్టారు. జయరాజ్ , బెన్నిక్స్ సతన్కులం స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న‌ రాత్రి సీసీ టీవీ ఫుటేజ్ చెరిపివేయబడింది

స్టేషన్ ప్రాంగణంలోని ఫోటోలు, వీడియోలు పరిశీలించిన తర్వాత న్యాయ విచారణ బృందం కానిస్టేబుల్ మహారాజన్‌ను విచారణ కోసం పిలిచారని, అయితే అతను రావడానికి నిరాకరించాడని భారతీదాసన్ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో రాశారు. అనేక సార్లు అడగగా కానిస్టేబుల్ మహారాజన్ మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చి తమిళంలో "ఉన్నాల్ ఒన్నం పుదుంగముడియాడు (మీరు ఇక్కడ ఏమీ చేయలేరు)" అనాడని భారతీదాసన్ తెలిపారు.
జయరాజ్, బెన్నిక్స్ ల‌ను హింసించిన అధికారులలో మహారాజన్ కూడా ఉన్నారనే ఆరోపణలు ఉండటంతో విచారణ బృందం అతని లాఠీని తీసుక రమ్మని అడిగింది. దాంతో అతను తన లాఠీ ఇక్కడ లేదని ఒక సారి క్వార్టర్స్ లో ఉందని ఒక సారి చెప్పి ఆ లాఠీ ఇవ్వడానికి తిరస్కరించాడు. పదే పదే అడగడంతో విచారణ బృందంతో అసభ్యంగా మాట్లాడాడు. చివరకు తనకసలు లాఠీనే లేదని చెప్పాడు.

జయరాజ్, బెన్నిక్స్ ల‌ను హింసించిన జూన్ 19 రాత్రి స్టేషన్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రేవతితో కూడా ఈ బృందం మాట్లాడింది. సోర్స్ ప్రకారం, వారు రేవతితో చాలా సేపు మాట్లాడారు. ఆమె ఇబ్బంది పడకుండ జాగ్రత్తగా వ్యవహరించారు. కాని ఆమె నిజాలు చెబితే తర్వాత తన సీనియర్లు ఏం చేస్తారో అని భయపడింది. ఆమె రక్షణకు హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆమె సాక్షి ప్రకటనపై సంతకం చేయడానికి అంగీకరించిందని భారతిదాసన్ రాశారు.

ఇంతలో, బయట, పోలీసులు ఒక చెట్టు కింద గుమిగూడి, న్యాయ బృందాన్ని బహిరంగంగా వేధించారు, కొందరు తమ సెల్‌ఫోన్లలో జరుగుతున్నదంతా రికార్డ్ చేశారు. విట్నెస్ లను బెదిరించడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశమని మేజిస్ట్రేట్ భారతీదాసన్ తన నివేదికలో రాశారు

"ఇక అక్కడ పరిస్థితి మరింత దిగజారింది" అని భావించినప్పుడు విచారణ బృందం స్టేషన్ నుండి బయలుదేరాలని నిర్ణయించుకుంది అని మెజిస్ట్రేట్ పేర్కొన్నారు.

ఇక విచారణ అధికారులకు సహకరించకపోవడం, బెదిరింపులకు పాలడటం పై తమిళనాడు డిజిపి జె కె త్రిపాఠి సమాధానం ఇవ్వలేదు. బెదిరింపు ఆరోపణల గురించి తూత్తుకుడి జిల్లా ఎస్పీ అరుణ్ బాలగోపాల్ అడిగినప్పుడు "నేను తరువాత వ్యాఖ్యానిస్తాను" అని అన్నారు.

Keywords : tamilanadu, custodial deaths, High Court, Judicial team probing torture ʹharassedʹ, HC orders takeover of Tamil Nadu police station
(2020-07-14 08:57:06)No. of visitors : 333

Suggested Posts


ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !

చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు.

వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌

నిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం...

కరోనా కన్నా కులమే ప్రమాదకర‌ వైరస్...పా రంజిత్

కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు.

కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌

మొబైల్ షాపు న‌డుపుకునే ఇద్ద‌రు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు. త‌మిళ‌నాడు తూతుకూడి జిల్లా శ‌తాంకులంలో ఫెనిక్స్‌ (31) చిన్న మొబైల్ షాపు న‌డుపుతుంటాడు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట

కేంధ్ర ప్రభుత్వం ఎంత సమర్దించుకుందామని ప్రయత్నించినా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసన గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ రెండింటిపై తమ నిరసన గళ్ళాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు....

Search Engine

వరవరరావును విడుదల చేయాలి - NHRC కోవిడ్-19 నిపుణుల కమిటీ డిమాండ్
వీవీ కోసం...మహా రాష్ట్ర ప్రభుత్వానికి 30 మంది మరాఠీ రచయితలు,కవులు,మేదావుల లేఖ‌ !
వరవరరావు కోసం... అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాడభూషి శ్రీధర్ లేఖ‌
PUCL Demands immediate transfer of Varavara Rao to specialised Hospital!
Shift Vara Vara Rao to Hospital Urgently : CPI(M)
ʹNo Reason in Law or Conscience to Hold Varavara Raoʹ, Say Academics in Appeal
కామ్రేడ్ క్రాంతి కోసం మళ్ళీ ముంబై పోలీసులు
వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్
Donʹt Kill Varavara Rao in Jail!
మరి‍ంత క్షీణించిన వరవరరావు ఆరోగ్యం...కేసీఆర్ కు హరగోపాల్ లేఖ‌
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక‌ చంపేశారు
వివేక్ దుబేకు సహకరించిన రాజకీయ నాయకుల సంగతేంటి ? మరణించిన పోలీసు అధికారి బందువు ప్రశ్న‌
అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనా
చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు
CBSE సిలబస్ లో సెక్యులరిజం,ఫెడరలిజంతో సహా అనేక అధ్యాయాలు తొలగింపు
పాట ఉన్నంత కాలం నీవు బ్రతికే ఉంటావు... జోహర్ నిస్సార్ భాయ్
పోలీసుల దాడులు,హింసలను నిరసిస్తూ ఆదివాసీల ర్యాలీ
మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న
కరోనా సోకింది... ఉద్యోగం పోయింది...జర్నలిస్టు ఆత్మహత్య‌
రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు
కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
more..


జ్యుడిషియల్