ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు


ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు

ʹగౌరీ

ప్రముఖ జర్నలిస్టు, రచయిత రానా అయూబ్ ను హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలోబెదిరింపులకు దిగారు కొందరు దుర్మార్గులు. ఈ విషయంపై ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.

కాశ్మీర్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి ఓ బాలుడు ఫోటో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోపోర్‌లోని మోడల్ టౌన్ వద్ద ఉన్న మసీదు నుంచి సిఆర్‌పిఎఫ్ ʹనాకాʹ పార్టీపై ఇద్దరు ఎల్‌ఇటి ఉగ్రవాదులు కాల్పులు జరిపాయని, ఇందులో సిఆర్‌పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్, పౌరులు మృతి చెందారని ఐజిపి కాశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనలో భద్రతా దళాలు ఒక్క షాట్ కూడా కాల్చలేదని ఆయన పేర్కొన్నారు. పౌరుడితో పాటు మైనర్ బాలుడిని రక్షించారని ఆయన చెప్పారు. ఈ సంఘటనలో ఓ వృద్దుడు మరణించాడు. అతనితోపాటు ఉన్న అతని మూడేళ్ళ మనవడిని సిఆర్‌పిఎఫ్ జవాను రక్షించారని చెబుతూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వృద్దుడు ఉగ్రవాదుల తూటాలకే చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. అయితే ఆ మూడేళ్ళ చిన్నారి, అతని బందువులు మాత్రం ఆ వృద్దుడు చనిపోయింది సీఆర్పీఎఫ్ తూటాలతోనే అని మీడియాకు చెప్పారు.

ఈ విషయంపై ఆమె వరస ట్వీట్లు షేర్ చేశారు. ఆ వృద్దుణ్ణి హత్య చేసింది పోలీసులే అని వృద్దుని బందువులను ఉటంకిస్తూ ఆమె ఆరోపించింది. ఆ సంఘటన జరిగినప్పుడు ఏ జర్నలిస్టు కూడా అక్కడ లేనప్పుడు. అన్ని ఫోటోలు, అన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించింది. అంతే కాక "భారతదేశంలోని ప్రముఖులకు ʹబ్లాక్ లైవ్స్ మేటర్ʹ కానీ కాశ్మీరీల‌ జీవితాలపై పట్టింపు లేదు." అని ఆమె ట్వీట్ చేసింది. "నిజం ఏమిటంటే, మనము కాశ్మీర్ భూమి గురించి మాత్రమే పట్టించుకుంటాము కానీ కాశ్మీరీ జీవితాలకు మన హృదయంలో చోటు లేదు, లోయ అంతటా చిందిన అమాయక రక్తం గురించి పశ్చాత్తాపం లేదు. భారతీయ పౌరురాలిగా నా క్షమాపణలుʹʹ అని ఆమె మరొక ట్వీట్‌లో పేర్కొంది.

ఈ విధంగా ఆమె ట్వీట్లు పోస్ట్ చేశాక‌ సోషల్ మీడియాలో దాడి మొదలయ్యింది. ఆమెను హత్య చేస్తామని, రేప్ చేస్తామని అసభ్య‌ పదజాలంతో దాడి మొదలుపెట్టారు. గౌరీ లంకేష్ ను గుర్తుంచుకో అని బెదిరించారు. ‌ఆ దాడి ఓ పథకం ప్రకారం జరిగిందన్నది అర్దమవుతున్నది. దాడి చేసిన వారి భాష చూస్తే ఓ ఉన్మాద గుంపు ఈ దాడికి నాయకత్వం వహించినట్టు అర్దమవుతుంది.
ఈ విషయంపై ఆమె నవీ ముంబై పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై ఆమె మరో ట్వీట్ చేశారు. అందులో అయూబ్ ఇలా వ్రాశారు "కోపర్‌ఖైరనే పోలీస్ స్టేషన్ అధికారులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. నేను రేపు నా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తాను. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నాపై బెదిరింపులతో సహా అన్ని ఆధారాలను అందజేస్తాను. వారు వేగంగా చర్య తీసుకుంటారని హామీ ఇచ్చారు.ʹʹ
రానా అయుబ్ సాహస జర్నలిస్టు. సాహస జర్నలిస్టులకు ఇచ్చే మెక్‌గిల్ పతకం 2020 సంవత్సరానికి ఆమె ఎంపికయ్యారు.
2002లో జరిగిన‌ గుజరాత్ అల్లర్లు, గుజరాత్ లో జరిగిన‌ పోలీసుల‌ ఎన్‌కౌంటర్ హత్యలపై ఆమె చేసిన రహస్య పరిశోధనల ఆధారంగా ʹగుజరాత్ ఫైల్స్: అనాటమీ ఆఫ్ ఎ కవర్ అప్ʹ అనే పుస్తకం ప్రచురించారు. ఆ రోజు నుండే బీజేపీ ఆమెపై వ్యతిరేకంగా ఉన్నది.
ఇదంతా చూస్తూ ఉంటే గతంలో బెంగుళూరులో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను హత్య చేసినట్టే రానా అయూబ్ ను కూడా హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కలగడం సహజం. గౌరీ లంకేష్ ను గుర్తు తెచ్చుకో అని ఆ దుర్మార్గులు బెదిరించారు కూడా.

Keywords : rana ayub, twitter, kashmir encounter, boy, old man death, bjp
(2020-08-09 16:25:00)No. of visitors : 286

Suggested Posts


జర్నలిస్టులకు ఆత్మహత్యలే గతా?

ఇక్కడ ఫంక్షన్ అవడం లేదు.. వీళ్ళంతా వారంరోజులుగా నిద్రాహారాలు మాని తమ బతుకు కోసం కొట్లాడుతున్నారు. ఇంట్లో ఆకలితో పడుకున్న భార్యాపిల్లలు.... ఆరునెలలుగా జీతాలు లేక ఇంటి కిరాయీలు కట్టక సామాన్లు బైటపడేస్తామంటూ ఓనర్ల బెధిరింపులు భరిస్తూ....

అరుణ్ సాగర్ అమర్ రహే !

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో వినూత్న ఒరవడులకు కారకుల్లో అగ్రగామిగా నిలిచిన అరుణ్ సాగర్ మృతి మీడియా రంగానికి తీరని లోటు. ప్రజా ఉద్యమాల పట్ల అరుణ్ సాగర్ సునిశిత పరిశీలనా వైఖరి, ప్రజా పక్షపాత దృక్పథం, అణగారిన వర్గాలపట్ల ఆయన కమిట్ మెంట్ అనిర్వచనీయమైంది....

ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !

మీడియా గురించి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు అమ్ముడైపోతున్న తీరును బట్టబయలు చేసిన వార్తలు, కొందరు విలేకరులు ధైర్యసాహసాలతో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వార్తల నేపథ్యంలో గణేష్ శంకర్ విద్యార్థి పేరు స్మరించుకోవడం

పత్రికా స్వేచ్ఛపై దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

పత్రికా స్వేచ్ఛపై, అసాంఘిక, సంఘ విద్రోహ చర్యలను వ్యతిరేకిస్తూ రచనలు చేసిన పాత్రికేయులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ దేశరాజధానిలో బుధవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


ʹగౌరీ