రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు


రెక్కవిప్పిన రెవల్యూషన్ వరవరరావు

రెక్కవిప్పిన

ʹʹ కంఠంలో నినాదంగా స్వీకరించిన పోరాటమే
ఊహలకు ఇంతగా కాంతినిస్తుంటే
ప్రజల రాజ్యాధికారం కత్తిని నిర్మించే కొలిమిలో
మనం రవ్వలమైతే ఎంత వెలుగు !ʹʹ

(వరవరరావు -1974)

ఒక సాహిత్య పత్రికగా ʹసృజనʹను అనధికార ప్రతిపక్ష గొంతుగా వినిపించిన వరవరరావు జీవితాంతం తాను రాసిన అక్షరాలకే నిబద్ధుడై బతుకుతున్నాడు. అదే ఆయన బలమైతే,అందుకే ప్రభుత్వాలకి ఆయనంటే అంత కన్నెర్ర అయ్యింది. 1966 లో ʹసృజనʹ ద్వారా, 1970 లో ʹవిరసంʹ ద్వారా వరవరరావు చెవి చూపు గొంతుగా నిలిచాడు. అందుకే గత అయిదున్నర దశాబ్దాలుగా ఆయన జీవితాన్ని నిషేధాలు నిర్బంధాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అయినా ఆయన కలం గళం మూగవోలేదు. ఆయన సహచరి హేమలత, పిల్లలు సహజ అనల పవనలు ఆయన వెన్నంటే ఉంటూ ఆ నిర్బంధాలను పరోక్షంగా అనుభవిస్తున్నారు. ఆయన, ఆ కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వివి ది ʹకమ్యూనిస్ట్ కుటుంబం.ʹఈ రోజుల్లో ఇది అతి అరుదైన విషయం.

విప్లవ రచయితల జీవితాల్లో ఎదురవుతోన్న నిర్బంధాలు వాళ్ళ కదిలికల మీద నియంత్రణ పెట్టగలవేమోగాని, వాళ్ళ సృజనాత్మకతను చంపలేవు. హొచిమిన్ నుంచి వరవరరావు దాకా కటకటాలనుంచి కూడా సమాజానికి విప్లవానికి నిబద్ధమయ్యే రచనలే చేశారు. ʹభూగోళమంతా ఒక విధ్వంస ప్రయోగంʹ (వివి) జరుగుతున్న వేళ మేధావి అలీనంగా ఉండలేడు. నక్సల్బరీ శ్రీకాకుళం ముషాహారీ నుంచి తెలంగాణ దాకా నాగేటి చాళ్ళలో రగిలిన రైతాంగ పోరాట జ్వాలలు 1970 ల తరం దశ – దిశ ని నిర్దేశించాయ . వివి లాంటి వాళ్ళు ఆ ʹరక్త చలన సంగీత శృతి ʹ ని నిరంతరాయంగా ఆలపిస్తూనే ఉన్నారు.

ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ పంథా, మొక్కవోని స్వేచ్ఛా కాంక్ష ఈ రాజకీయ విశ్వాసానికి పునాది అయ్యింది. రాజ్యం కుట్రలని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నందు వల్లే విప్లవకారులు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు; రచయితలు రాజద్రోహం కుట్రకేసుల్లో మగ్గుతున్నారు. ఈ ప్రశ్నించే గొంతులపై అమలయ్యే నిర్బంధంలో భాగమే నిన్నటి సాయిబాబా నుంచి నేటి కాసీం వరవరరావుల దాకా అమలవుతున్న రాజ్యహింస. సాయిబాబా ʹ శరీరం 90 శాతం అశక్తతకు గురైనా, మిగిలిన ఆ 10 శాతమే భయపెడుతోందిʹ అని తీర్పు ప్రకటించడమంటేనే, ఎటువంటి మధ్య యుగాలనాటి శిక్షా స్మృతి ఇప్పటికీ అమలవుతుందో అర్థమవుతోంది.

80 ఏళ్ళు పైబడిన వివి లో ʹ ఒక ప్రమాదకరమైన నక్సలైట్ʹ ఉన్నట్లు న్యాయస్థానం పదేపదే అంటోంది. జాతీయ అంతర్జాతీయ మేధావులు రచయితలు ప్రముఖ పాత్రికేయులు దాకా వీరి విడుదల లేదా బెయిల్ గురించి ఎన్ని విజ్ఞప్తులు చేసినా , అవేవీ పాలకుల చెవికెక్కటం లేదు. సాయిబాబా విషయంలో ఆయన సహచరి వసంత, వరవరరావు విషయంలో ఆయన సహచరి హేమలత, కాసీం విషయంలో ఆయన సహచరి స్నేహ పరోక్షంగా ఈ నిర్బంధపు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయినా ఎంతో మనో నిబ్బరంతో వారి సహచరుల విడుదలకోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

1974 లో అఖిల భారత రైల్వే సమ్మె జరిగినప్పుడు ఆ సమ్మెను బలపరుస్తూ తెచ్చిన ʹసృజన ʹ సంచిక ఎడిటర్ హేమలత. అదే పెద్ద రాజద్రోహ నేరంగా జడ్జి ఆమెకు జైలు శిక్ష విధిస్తూ ʹ ముగ్గురు ఆడపిల్లల తల్లియై కూడా ఆమెలో పశ్చాత్తాపం లేదు ʹ అంటాడు జడ్జి. ʹపశ్చిమాన సూర్యుడు ఉదయిస్తే, పశ్చాత్తాపం ప్రకటిస్తాను మైలార్డ్ ʹ అని ఆమె తరఫున వివి కవిత రాశారు. అప్పటినుంచే హేమలత వివి రాజకీయ విశ్వాసాల బాధ్యతను పంచుకోవడం మొదలయ్యింది. వివి ప్రతి అడుగులో అడుగై ఆమె సాగుతోంది. కుటుంబ సాహచర్యం కూడా ఒక ʹవిప్లవ విలువʹ గా ఉండబట్టే, ఈ నిర్బంధాలు వాళ్ళ గుండె నిబ్బరాన్ని దెబ్బతీయ లేకపోయాయి.

వరవరరావు వయస్సు 80ఏళ్ళు దాటుతోంది. ఆయన నడకకు, నడతకు రెండు ముఖాలు లేవు. ప్రభుత్వాలు గత 47 ఏళ్లుగా ఆయన్ని 25 కేసుల్లో ఇరికించి, విచారణ నెపంతో దీర్ఘకాలం వేధించాయి. ఈ అన్ని కేసుల్లోంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యాడు. 1973 అక్టోబర్ 10 న మొదలైన ఈ నిర్బంధాలు 2018 ఆగస్టు నెలలో బనాయించిన ʹ భీమా కోరేగావ్ ʹ కుట్రకేసు దాకా కొనసాగాయి. కనీస వసతులు కూడా కరువైన పూణేలోని యెరవాడ జైలులో 2018 నవంబర్ నుంచి వివిని మిగత సహా నిందితులతో పాటు నిర్బంధించారు. కోర్టులు బెయిల్ అప్పీళ్లను తిరస్కరిస్తున్నాయ. కనీసం జైలులో ములాఖత్ కూడా అనేక షరతుల మధ్య కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నారు. ఒక్కోసారి అదీ అనుమతించరు. 2020 ఫిబ్రవరిలో నవీ ముంబై లోని ʹతలోజʹ జైలుకి తరలించారు. న్యాయవాదులను కూడా జైలులో కలువనివ్వని దారుణ నిర్బంధం అమలవుతోంది.

1975 నుంచి 2017 దాకా వరవరరావు రాసిన సుమారు 400 కవితలు రెండు వాల్యూములుగా వచ్చాయి. వివి ʹతెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవల ʹ మీద ప్రామాణికమైన పరిశోధనా గ్రంధం వెలువరించారు. గూగీ నవలలో కొన్ని అనువదించారు. జైలులో ఉన్నా బైట ఉన్నా ఆయన కలానికి విరామం లేదు; ఆయనకు విశ్రాంతి లేదు. పర్ స్పెక్టివ్స్ 1989 జులైలో వివి జైలు నుంచి రాసిన ʹసహచరులుʹ ప్రచురించింది. ఇదే ఆ తర్వాత ఇంగ్లిష్ లో వెలువడింది. 1990 జనవరిలో ʹసృజన సంపాదకీయాలుʹ మా నాలుగవ ప్రచురణగా తెచ్చాం. ఆ క్రమంలోనే 2008 జనవరి నుంచి 2019 జులై వరకూ గడిచిన 11 సంవత్సరాల కాలంలో వెలువడిన అల్లం రాజయ్య 6 సాహిత్య సంపుటాలకు వివి సంపాదకత్వం వహించారు. వాటికి 240 పేజీల ముందుమాటలు రాశారు. అవి నిజానికి ఆ రచనా కాలానికి అద్దంపట్టిన తెలంగాణ లోని నక్సలైట్ ఉద్యమ సాంస్కృతిక రాజకీయాల చరిత్ర. ఆయన తప్ప మరొకరు రాయలేని పొలిటికల్ డాక్యుమెంట్.

రాజకీయ ఉద్యమాలు, పార్టీలు ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ, ఈ సమస్యలకు పరిష్కారం దొరకకుంటే చేజేతులా తిరిగి ఫాసిజం పడగ నీడన మగ్గిపోవాల్సి ఉంటుంది. సామాజిక సాంస్కృతిక రంగాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న వాళ్ళు తమ నిరసనని పదేపదే వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ʹఎవరూ చేయని నేరం / రచయితలే ఏం చేశారు?ʹ అన్న వరవరరావు ప్రశ్నకు జవాబు మరో ఉద్యమానికి సంసిద్ధం కావటమే. చివరిగా 1977 లో వరవరరావు అన్న మాటలని మరోసారి యాది చేసుకొందాం.

ʹనేరమే అధికారమై
ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే
ఊరక కూర్చున్న
నోరున్న ప్రతివాడు నేరస్తుడే!
--ఆర్ కె
P E R S P E C T I V E S

(సారంగ వెబ్ మేగజైన్ సౌజన్యంతో)

Keywords : varavararao, hemaltha, srujana, saibaba
(2020-08-09 06:13:15)No. of visitors : 405

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


రెక్కవిప్పిన