వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్


వరవరరావును చంపకండి.. కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్

విరసం రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం మహరాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వరవరరావు సహచరి హేమలత, ఇతర కుటుంబ సభ్యులు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జూమ్ లైవ్ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వారు మాట్లాడారు. వరవరరావును జైళ్లో చికిత్స అందించకుండా చంపవద్దని.. దయచేసి ఆయనను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని వీవీ సహచరి హేమలత విజ్ఞప్తి చేశారు.

గత ఆరు వారాలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, మే 28న ఆయన తలోజా జైలు నుంచి జేజే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత జూన్ 1న వెంటనే తలోజా జైలుకు పంపించారు. మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని ఆమె అన్నారు. ఇటీవల జూన్ 24న, జులై 2న ఫోన్ చేసినప్పుడు ఆయన మమ్మల్ని గుర్తు పట్టే స్థితిలో కూడా లేరని.. జులై 11న అయితే ఆయన తన 8 ఏళ్ల వయసులో కోల్పోయిన తండ్రి, 35 ఏళ్ల క్రితం మరణించిన తల్లి అంత్యక్రియల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని.. అందరూ వచ్చారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారా అని అడుగుతున్నారని హేమలత చెప్పారు. ఇలా ఏవేవో మాటలు ఆయన చెబుతున్నారంటే మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగా లేనట్లు అర్థమవుతున్నదని ఆమె అన్నారు.

వరవరరావుకు బెయిల్ పొందే హక్కు ఉన్నదని, కానీ ఆయనకు బెయిల్ వస్తుందనే ఆశ లేదని ఆయన కుమార్తెలు సహజ, అనల, పవన అన్నారు. ʹʹఇప్పుడు మేం బెయిల్ కోరడం లేదు. కానీ ముందు ఆయన్ను బతికించుకోవాలి. ఆయన శరీరంలో సోడియం, పొటాషియ స్థాయిలు దారుణంగా పడిపోయాయిʹʹ అని పవన అన్నారు. ʹʹవరవరరావు ఆరోగ్య పరిస్థితి మీద ఒక్క మహారాష్ట్ర గవర్నర్ మినహా ఎవరూ స్పందించ లేదు. ఆయన్ను జైలు నుంచి తక్షణం ఆసుపత్రికి తరలించాలి. లేదంటే మాకు అప్పజెప్పండి. మేము, కుటుంబ సభ్యులు కలిసి ఆయన్ను బతికించుకుంటాం" అని సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ అన్నారు.

Keywords : Varavara Rao, Poet, Taloja Jail, UAPA Case, Maharashtra Government, Health Condition, Tratment
(2020-10-20 17:52:35)No. of visitors : 604

Suggested Posts


0 results

Search Engine

ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
దళితులపై అగ్రకుల మనువాద దాడులను ప్రతిఘటిద్దాం - కుల నిర్మూలనా పోరాట సమితి పిలుపు
కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం
పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లు
కమ్ముకొస్తున్న ఫాసిజం ప్రమాదం -ఎన్. వేణు గోపాల్
గ్రామాల్లో మళ్ళీ దొరల రాజ్యం...టీఆరెస్ పాలనపై మావోయిస్టుల మండిపాటు
కేరళ: మావోయిస్టు జలీల్ ది హత్యే అని రుజువు చేస్తున్న ఫోరెన్సిక్ రిపోర్టు
హత్రాస్ బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్న జిల్లా మెజిస్ట్రేట్ -వీడియో వైరల్
రేప్ జరగలేదు, వెన్నెముక విరగలేదు, నాలుక కోయలేదు... పోలీసుల దుర్మార్గపు ప్రకటనలు
దళిత బాలికపై అత్యాచారం...వెన్నెముక విరిగిపోయింది...శ్వాస ఆగిపోయింది
బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
more..


వరవరరావును