తెలంగాణ:అన్నలకు అన్నం పెట్టారంటూ గ్రామాల‌పై పోలీసుల దాడులు.. అరెస్టులు.. చిత్ర హింసలు


తెలంగాణ:అన్నలకు అన్నం పెట్టారంటూ గ్రామాల‌పై పోలీసుల దాడులు.. అరెస్టులు.. చిత్ర హింసలు

కొంరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం టొక్కిగూడా గ్రామస్తులైన ముగ్గురు ఆదివాసీలను అక్రమంగా తీసుకెళ్ళిన తెలంగాణ పోలీసులు వారిని తీవ్ర చిత్ర హింసలకు గురి చేస్తున్నట్టు పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఊరిలోకి వచ్చిన వందలాది మంది పోలీసులు తామిచ్చిన ఇంట్లోనే అన్నాలు వండుకొని తిని, ఊర్లో తుపాకులు పేల్చి అన్యాయంగా గ్రామస్తులను కొట్టారని, తమ గ్రామ పటేల్ కూడా దారుణంగా కొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తామెంత చెప్పినా వినకుండా అన్నలకు అన్నం పెడుతున్నారంటూ బెధిరిస్తూ గ్రామ పటేల్ ను, ఆయన కొడుకును, మరో యువకుడిని తీసుకెళ్ళారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు మాట్లాడిన వీడియో కోసం పైన క్లిక్ చేయండి... ఈ విషయంపై పౌరహక్కుల సంఘం విడుదల చేసిన ప్రకటన‌ పూర్తి పాఠం...

పోలీసుల అక్రమ నిర్బంధం లో ఉన్న టొక్కిగూడా ముగ్గురు ఆదివాసీ గ్రామస్తులను విడుదల చేయాలి.

కొంరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం టొక్కిగూడా గ్రామంలో నిన్న ఉదయం14జులై,2020,మంగళవారం తెలంగాణ సాయుదపోలీసులు మకాం వేసి ఆ ఆదివాసీ గూడెం పటేల్ ఇంటిలో అన్నం వండుకొని తిని ,మీ గ్రామంలోకి అన్నలు వస్తున్నారంటూ,వారి ఆచూకి చెప్పాలంటూ, పటేల్ ను,గ్రామస్తులను కొట్టి, గ్రామ పటేల్ ఇంటిముందు తుపాకులతో కాల్పులు జరిపి,ఆయనను ఆయన‌ కొడుకును మరో ఆదివాసీ యువకుణ్ణి పోలీసులు తమవెంట తీసుక పోయారు. నిన్నటి నుండి పోలీసుల నిర్బంధంలో ఉన్న ముగ్గురు ఆదివాసులను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆ ముగ్గురు ఆదివాసులని ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే పోలీసులు విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.

1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్
అధ్యక్షులు,పౌరహక్కుల సంఘం, తెలంగాణ.
2.N. నారాయణ రావు,
ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.

రాత్రి 8:30 గంటలు
బుధవారం,15,జులై,2020.

Keywords : telangana, adivasi, tribes, police, arrest, maoists
(2020-10-27 04:26:55)



No. of visitors : 1011

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
more..


తెలంగాణ:అన్నలకు