పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు


పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు

పోలీసు

జూలై28 నుండి ఆగస్ట్ 4వ తేదీ వరకు అమరుల వారోత్సవాలను పురస్కరించుకొని సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో దేశంలో అనేక చోట్ల ప్రజలు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహ‌ద్దుల్లో అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఒకవైపు సభలు జరగకుండా వేలాది మంది పోలీసులు అడవిని జల్లెడపడుతున్నప్పటికీ, పోలీసుల బూట్ల శబ్ధాల నడుమనే ప్రజలు అమరులను స్మరించుకుంటున్నారు. ఏవోబీలోని కటాఫ్ ఏరియాలో ఈ రోజు(శుక్ర‌వారం31 జూలై) అమరులను స్మరించుకు‍ంటూ వందలాది మంది ఆదివాసీలు భారీ ర్యాలీ, బహిరంగ సభ‌ నిర్వహించారు. ఏడు పంచాయితీలకు చెందిన ప్రజలు ఎర్రజెండాలు చేబూని, అమరులకు జోహార్లు తెలిపే బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు. అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తూ...అమరుల త్యాగాలను ఎత్తిపడుతూ విప్లవ గీతాలు ఆలపించిన ప్రజలు... అమరుల ఆశయసిద్ది కోసం పోరుబాటలో నడుస్తామని ప్రతినబూనారు. పచ్చని చెట్ల నడుమ ఎగిరిన ఎర్రని జెండాలతో...‌ విప్లవ నినాదాలతో అడవి పులకరించింది.

కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదివాసుల‌పై చేస్తున్న దాడుల‌ను నిలిపివేయాల‌ని, ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసులను నిర్మూలించేందుకు పాలకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించిన ఆదివాసుల నాయకులు ఆదివాసులపై దాడుల‌ను ఇప్ప‌టికైనా నిలిపివేయాల‌ని, ఆదివాసుల‌ స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి కృషిచేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

Keywords : maoists, martyrs, AOB, Meeting, Rally, Police
(2020-09-27 09:19:27)



No. of visitors : 823

Suggested Posts


గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల‌ మృతదేహం కోసం పోరాటం

ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో జరిగినట్టు చెబుతున్న ఎన్కౌంటర్ నిజమా అబద్దమని మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీలను పట్టుకొని కాల్చి చంపారని. స్థానిక ఆదివాసులైన జయంతి , రాధిక గొల్లూరి,సుమలా , రాజశేఖర్‌ కర్మలను పోలీసులు అరెస్టు చేసి పట్టుకెళ్ళారని వారిని కూడా చంపేస్తారేమోననే ఆందోళన ఆద

అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులు

ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగినట్టు అందులో మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీల ఎలియాస్ మీనా ఎలియాస్‌ జిలానీ మృతి చెందిన ఘటనపై అనేక‌ సందేహాలు తలెత్తుతున్నాయి.

ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభ‌

పోలీసుల‌ కూంబింగ్ తీవ్రంగా జరుగుతుండగానే సీపీఐ మావోయిస్టు పార్టీ అదే ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న బలిమెల రిజర్వాయర్ కటాఫ్ ఏరియాలో ఈ సభ నిర్వహించారు.

మావోయిస్టు అరుణ ఎక్కడ ?

సీపిఐ మావోయిస్టు పార్టీ నాయకురాలు అరుణ ఎక్కడుంది? పోలీసుల అదుపులో ఉన్నదా ? ఏవోబీలోనే సేఫ్ గా ఉన్నదా ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉన్నది. ఈ నెల 22న‌ గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు దగ్గర జరిగిన‌ ఎన్‌కౌంటర్‌లో అరుణ చనిపోయిందని ప్రచారం కూడా సాగింది.

అక్టోబ‌రు దాడి త‌ర్వాత‌... AOBలో ఏం జ‌రుగుతోంది...?

ʹʹ వాళ్లు మా ప్ర‌భుత్వంపై దాడి చేశారు. అయితే శాశ్వ‌తంగా వారు న‌ష్టం క‌లిగించ‌లేరు. ఈ రోజు కను చూపు మేర‌లో కూడా పోలీసుల జాడ లేదు. మ‌ళ్లీ మా పార్టీ పూర్తిస్థాయిలో వ‌చ్చేసిందిʹʹ అని చెప్పాడు దోమ్రు....

కామ్రేడ్... నీ నెత్తిటి బాకీ తీర్చుకుంటాం... గర్జించిన వేల గొంతులు

వార్త తెలుసుకున్న వందలాది గ్రామాలనుండి వేలాది మంది ఆదివాసులు ఆదివారం రాత్రి నుండే కొండెముల గ్రామానికి రావడం మొదలుపెట్టారు. సోమవారం ఉదయానికే ఆ గ్రామం ఎర్రజెండాలు చేబూనిన వేలాదిమందితో నిండిపోయింది. తమ ప్రియతమ నాయకుడి భౌతిక కాయాన్ని చూసిన ప్రజలు బోరుమంటు విలపించారు....

పితృస్వామ్యంపై విల్లెత్తిన‌ విప్లవ మహిళ ‍- భారీ బహిరంగ సభ‌

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ముంచింగుపుట్టు ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా , మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ...

కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌

అదిగో ఆ ఎర్ర గోంగూర చెట్టుందే అదే విప్లవ యువ కిశోరం మున్నా శత్రు సేనలతో వీరోచితంగా పోరాడుతూ తన రక్తంతో ఎరుపెక్కించిన నేల. ఆ చోటంతా ఎర్ర గోంగూర మొక్కలతో అచ్చం ఎర్రపూల వనంలా విరబూసింది. ఆ జారుడు మట్టిదారి మన ప్రియతమ మహిళా నాయకురాలు భారతక్క తూటాల గాయాలతో పైకి ఎక్కలేక జారిపడ్డ బాట. ఆ కొండమలుపులోనే మిలిటరీ దిగ్గజం యాదన్న మరో తరాన్ని కాపాడడానికి శత్రు మోర్టార్

నిత్య‌ పోలీసు దాడుల నడుమ మావోయిస్టుల నాయకత్వంలో సాగుతున్న భూపోరాటాల జైత్ర యాత్ర‌

గ్రామాలపై పోలీసుల దాడులు... ఎన్ కౌంటర్ హత్యలు.... ఏవోబీలో ఒక వైపు పోలీసులు ప్రతి చెట్టును, పుట్టను తమ తుపాకులతో జల్లెడ పడుతూ భయోత్పాతం సృష్టిస్తుండగానే... మరో వైపు ప్రజలు భూపోరాటాలు, అమరుల సంస్మరణ సభలు జరుపుకుంటూ తమ...

ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ

ఈ నెల 22న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టులు ఎవరో తమకు తెలియదని తాము వారిని గుర్తించలేదని వారికోసం ఎవరైనా వస్తే ఇస్తామని చెబుతూ వస్తున్న పోలీసులు వారిని ఖననం చేసే ప్రయత్నం చేశారు. మరో వైపు మావోయిస్టుల పేర్లు, వారి గ్రామాల వివరాలు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసనగా 28న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ
సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!
విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 25న దేశవ్యాప్త ఆందోళనలను జయప్రదం చేద్దాం -TDF
ప్రజలపై పారామిలిటరీ, డిఆర్‌జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్
భారతదేశ జైళ్ళలో 50 శాతం ‌దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే ఎందుకున్నట్టు ?
మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
more..


పోలీసు