ముగిసిన అమ్మ ఎదురు చూపులు


ముగిసిన అమ్మ ఎదురు చూపులు

ముగిసిన

జైల్లో యావజ్జీవ ఖైదీగా ఉన్న ప్రొ. జిఎన్ సాయిబాబా, అమరురాలు కా. భవానిల తల్లి సూర్యావతమ్మ ఈ (ఆగస్టు 01, 2020) మధ్యాన్నం 1.40 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది. ఎలాంటి కన్నపేగుల కడుపుకోత వేధన, దాన్ని రగిల్చిన దుర్మార్గ పాలనను ప్రశ్నించేలా చేశాయి. అమరుల కుటుంబలపై కొనసాగిన తీవ్రమైన హింస సూర్యవతమ్మను పిల్లల రాజకీయాలు అర్థం చేసుకునేలా చేసింది. పిల్లల స్పూర్తితో ఆ తర్వాత ఏర్పడ్డ అమరుల బంధు మిత్రుల సంఘం వ్యవస్థాపక సభ్యురాలయింది
సాయిబాబా అరెస్ట్ తర్వాత ఏండ్ల తరబడి కొడుకు విడుదల కోసం ఎన్నో ఎదురు చూపులు చూసింది. ప్రయత్నాలు చేసింది. అయినా కొడుకును దగ్గరిగా చూడలేకపోయింది. సంవత్సరాలపాటు పరితపించింది. ఎన్నో నిద్రలేని రాత్రులు ఆమె గుండెలో చీకటిని నింపాయి. రాజ్య స్వభావం తెలిసిన మనిషే అయినా న్యాయ వ్యవస్థ పట్ల కించిత్ ఆశ. చివరికి క్యాన్సర్ బారిన పడింది. గత కొంత కాలంగా చివరిసారిగా కొడుకును చూడాలని న్యాయస్థానం చుట్టూ తిరిగింది. చివరికి ఆ తల్లికి అన్యాయమే జరిగింది. జైలులో ఆ కొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉన్నా.. తల్లికి క్యాన్సర్ అని తెలిసి తల్లడిల్లిపోయాడు. ఒక్కసారైనా అమ్మను చూడాలని ఎంతో ఆరాటపడ్డాడు. అంతకు ముందు ఆమె ములాఖత్ కు వెళ్లినప్పుడు ఆ గాజు కిటికీలోంచి తల్లిని చూడలేకపోయానని ఎంతో బాధపడ్డాడు. ఆ దుఃఖమే కవిత మారింది. కొడుకు ముఖం స్పష్టంగా చూచే హక్కును కూడా చిదిమేసిన రాజ్య స్వభావాన్ని ఆ తల్లి ద్వేషిస్తూనే మరణించింది.

అమ్మకు అమరుల బంధుమిత్రుల సంఘం అరుణారుణ నివాళి
- పద్మకుమారి (అమరుల బంధు మిత్రుల సంఘం)

అమరుల బందు మిత్రుల సంఘం విడుదల చేసిన ప్రకటన‌

పత్రికా ప్రకటన తేదీ: 1-8-2020

సాయిబాబ తల్లి సూర్యావతమ్మకి జోహార్లు

గత నాలుగేళ్లుగా జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ తల్లి సూర్యావతమ్మ ఈ రోజు మధ్యాహ్నం క్యాన్సరుతో మరణించారు. తన తల్లిని చూడడటానికి బెయిల్ కోసం వేసిన దరఖాస్తును జులై 25న మహారాష్ట హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సాయిబాబ తల్లి తన కొడుకును చూడాలని ఎంతగానో పరితపించారు. ఆమె చివరి కోరిక మీద సాయిబాబకు బెయిల్ మంజూరు చేయాలనీ ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పట్టికి ఫలితం లేదు. చివరికి ఆమె కొడుకును చూడకుండానే కన్నుమూశారు.

సూర్యావతమ్మ కూతురు భవాని 2002 లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది. ఆ తరువాత మావోయిస్టు ఉద్యమంలో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకురావడానికి ఏర్పాటు అయిన బంధు మిత్రుల సంఘం వ్యవస్థాపక సభ్యురాలుగా ఉన్నారు. ఆమె అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఉన్న స్మశానవాటికలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నేతలు, మిత్రులు పాల్గొని ఆమెకు నివాళి అర్పించారు. వీరిలో కుటుంబ సభ్యులతో పాటు వీక్షణం వేణుగోపాల్, విరసం రాము, టీపీఎఫ్ రవిచంద్ర, మలుపు బాలిరెడ్డి, అమరుల బంధు మిత్రుల సంఘం నాయకులు సత్య, భవాని తదితర మిత్రులు పాల్గొన్నారు.
సాయిబాబ తమ్ముడు రాందేవ్ ఆమె చితికి నిప్పంటించారు. సూర్యావతమ్మ కోరిక అయినా సాయిబాబను విడుదల కావడానికి కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు.

Keywords : gn saibaba, mother, death, Martyrs, ABMS,
(2021-09-22 04:06:04)



No. of visitors : 1099

Suggested Posts


Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions

After the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving

Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju

I am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court.

బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO

నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు.

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి

తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం

రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన.

Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba

We in the US Coalition to Free Professor G.N. Saibaba heard about the Nagpur High Courtʹs outrageous decision to deny Saibaba bail on medical grounds. We are deeply disappointed, but not surprised. We have followed Saibabaʹs case closely and we know that his health continues to deteriorate.

Search Engine

300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
more..


ముగిసిన