హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.
ఈ రోజు (ఆగస్టు 17) న్యాయవాది ప్రియాంక జీవన సహచరుడు అనుజ్ శ్రీవాస్తవ ప్రియాంక ఫేస్బుక్ నుంచి చేసిన ప్రత్యక్ష ప్రసారంలో ఈ విషయాలు వివరించారు. సర్కండా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి (టి ఐ) శనిప్ రాత్రే, ఎస్‌పి నిమిషా ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా- శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఛత్తీస్‌ఘడ్‌లో వున్న ఏకైక హెచ్ఐవి సోకిన మైనర్ బాలికల ఆశ్రయం ʹఅప్నాఘర్ʹలో నివసిస్తున్న 14 మంది హెచ్ఐవి సోకిన మైనర్ బాలికలను, న్యాయవాది ప్రియాంక శుక్లాను తీవ్రంగా కొట్టి జుట్టు పట్టుకొని లాగుతూ అజ్ఞాత ప్రదేశానికి ఎత్తుకెళ్లి పోయారు అని చెప్పారు.
ఈ ఆశ్రయం చాలా సంవత్సరాల నుంచి నడుస్తోంది. అయితే క్రితం సంవత్సరం మాత్రమే ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. మహిళా –శిశు సంక్షేమాధికారి పార్వతి శర్మ, ప్రభుత్వం మంజూరు చేసే నిధులలో 30 శాతం కమీషన్ యివ్వాలని అడిగింది. ʹఅప్నాఘర్ʹ నిర్వాహకులు అందుకు నిరాకరించడంతో వారిని వేధించడం మొదలుపెట్టింది. ఆశ్రయం నడిపే ప్రమాణాలు సరిగా లేవు కాబట్టి ఆశ్రయాన్ని మూసివేసి బాలికలందరినీ వేరే ప్రాంతాలకు తరలించాల్సి వుంటుంది అని చెప్పింది. ఇటీవల ఎన్‌డిటివిలో రవిష్ కుమార్ షెల్టర్ హోమ్ ʹఅప్నాఘర్ʹ గురించి కథనాలను ప్రసారం చేసినప్పుడు లాయర్ ప్రియాంక ఈ విషయాల్ని ఎన్‌డిటివిలో బహిర్గతం చేశారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో, మహిళా- శిశు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు అధికారులు సర్కండా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ʹఅప్నా ఘర్ʹ షెల్టర్ హోమ్‌కు వచ్చి ముందస్తు హెచ్చరికలేమీ లేకుండా హెచ్‌ఐవి సోకిన మైనర్ బాలికలను తీవ్రంగా కొట్టారు. 14 మంది బాలికలను, ʹఅప్నాఘర్ʹ షెల్టర్ హోమ్ న్యాయ సలహాదారైన న్యాయవాది ప్రియాంక శుక్లా (ప్రియా శుక్లా) ను అజ్ఞాత ప్రదేశానికి ఎత్తుకెళ్లి పోయారు. తాను షెల్టర్ హోమ్‌కు వచ్చినప్పుడు, విరిగిన గాజుల ముక్కలు, రక్తం మరకలు కనపడినట్లు అనూజ్ ఆ వీడియోలో చెప్పారు. అనూజ్ జర్నలిస్టు. అదే హోదాలో ఆయన సర్కండా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, తనతో అమర్యాదకరమైన భాషను ఉపయోగించి, చట్ట ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నావనే ఆరోపణతో కేసు పెడతామని బెదిరించాడు స్టేషన్ ఇన్‌చార్జి. పైగా అనూజ్ ను వీడియో తీశారు. అతని దగ్గరినుండి మొబైల్ ఫోన్ గుంజుకున్నారు. బాలికలను, ప్రియాంకను ఎక్కడికి తీసుకెళ్లారనే దాని గురించి అనుజ్‌కి ఏమీ చెప్పలేదు.
HIV పాజిటివ్ వున్న పిల్లల్ని కొట్టడానికి వీరికి ఎవరు అధికారం ఇచ్చారు? లంచం అడిగిన సురేష్ సింగ్, పార్వతి శర్మల మీద విచారణ ఎందుకు జరపలేదు అని ప్రశ్నిస్తున్నారు అనుజ్.
ఛత్తీస్‌గఢ్ పోలీసుల గూండాయిజాన్ని ఖండించాలని, 14 మంది హెచ్ఐవి సోకిన మైనర్ బాలికలతో పాటు న్యాయవాది ప్రియాంక శుక్లాకు మద్దత్తుగా నిలబడాలని ప్రగతిశీల ప్రజాస్వామిక సహచరులందరికీ విజ్ఞప్తి చేసారు.
ప్రియా శుక్లా తన ఫేస్‌బుక్‌లో యిచ్చిన పరిచయాన్ని బట్టి ఛత్తిస్‌గఢ్ పియుసిఎల్‌లోనూ, జగదల్‌పూర్ లీగల్ ఎయిడ్‌లోనూ, ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గానూ పని చేస్తున్నారని తెలుస్తోంది.
కాగా ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక కథనం ప్రకారం... పోలీసులు ఈ ఆశ్రమం మీద దాడి చేస్తున్నప్పుడు స్థానికులు రహస్యంగా వీడియోలు తీశారు. తమ దగ్గర ఆ వీడియోలు ఉన్నాయని టమ్స్ పేర్కొంది ఆ వీడియోల్లో పోలీసులు బాలికలను జుట్టు పట్టుకొని లాగడం, బలవంతంగా తీసుకువెళ్ళడం ,వాహనాల్లోకి తరలించడం వంటివి స్పష్టంగా చూపించాయి. చెవి-ఉంగరాలు, హెయిర్ బ్యాండ్లు, మాస్క్ లు ఇతర వస్తువులు నేలపై చెల్లాచెదురుగా కనిపించాయి. ʹఅప్నా ఘర్ʹ సూపరింటెండెంట్ దీపికా సింగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, సిబ్బందిని, పిల్లలను బలవంతంగా లాక్కెళ్ళారు. పిల్లలను ఇక్కడి నుండి తీసుకెళ్ళేందుకు అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఇవ్వడానికి కూడా అధికారులు కూడా నిరాకరించారని చెప్పారు.
Keywords : chattisgarh, hiv, girls, police, attack, pucl, priyanka, anuj
(2023-05-31 17:52:07)
No. of visitors : 2383
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |
| పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్కరణ - భారీ బహిరంగ సభ ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది. |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
more..