బాలికల గృహంలో పోలీసుల హింసాకాండ,న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టుపై PUCL ప్రకటన‌


బాలికల గృహంలో పోలీసుల హింసాకాండ,న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టుపై PUCL ప్రకటన‌

బాలికల

బిలాస్‌పూర్‌లో ఎన్‌జిఓ నడుపుతున్న బాలికల ఆశ్రయ గృహం ʹమా ఇల్లుʹ ఆశ్రమంపై పోలీసులు దాడి చేసి పిల్లలను హింసించి, న్యాయవాది ప్రియాంక శుక్లాను అరెస్టు చేయడాన్ని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ తీవ్రంగా ఖండించింది. పీయూసీఎల్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ – ఛత్తీస్‌ఘడ్ చాప్టర్
బాలికల గృహంలో పోలీసుల హింసాకాండను,
న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టును పియుసిఎల్ తీవ్రంగా ఖండిస్తూంది
ʹఅప్నా ఘర్ʹ (మా ఇల్లు) బాలికల గృహం సిబ్బంది మీద దౌర్జన్యం చేసి, అక్కడ నివసిస్తున్న హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలను బలవంతంగా అపహరించుకు పోయిన సంఘటనకు బాధ్యులెవరో తెలుసుకోడానికి ప్రయత్నం చేసిన మా సంస్థ సభ్యురాలు, న్యాయవాది ప్రియాంక శుక్లాను 17.08.2020 న బిలాస్‌పూర్ పోలీసులు దారుణంగా హింసించి అరెస్టు చేయడాన్ని పియుసిఎల్ తీవ్రంగా ఖండిస్తూంది.
హెచ్‌ఐవి పాజిటివ్ పిల్లల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి బిలాస్‌పూర్‌లో ఎన్‌జిఓ నడుపుతున్న బాలికల ఆశ్రయ గృహం ʹమా ఇల్లుʹ మాత్రమే ఉందనీ, ఆ ఆశ్రయ నిర్వహణ, సదుపాయాలు సంతృప్తికరంగా వున్నాయని అక్కడ నివసిస్తున్న బాలికలు, వారి కుటుంబాలు మీడియా ముందు పదేపదే చెప్పారు. "మా ఇల్లు" రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని నోటీసులు రావడంతో న్యాయ సహాయం కోసం న్యాయవాది ప్రియాంక శుక్లాను సంప్రదించారు. తమ సంస్థకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఇవ్వడానికి అధికారులు అడిగిన లంచం ఇవ్వడానికి ఇష్టపడకపోవటంతో ఈ వేధింపులు మొదలయ్యాయని వారు చెప్పారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, న్యాయవాది ప్రియాంక శుక్లా, ఆమె సహచరులు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్న అధికారుల ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. అయితే, అధికారులు మళ్లీ తమ ప్రయత్నాలను
17.08.2020 ఉదయం, ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా, శిశు సంక్షేమ కమిటీ సిబ్బంది, సర్కండ పోలీస్ స్టేషన్ పోలీసు బలగాలతో కలిసి వచ్చి , 14 మంది పిల్లలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మొదటగా వారు సిసిటివి కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి, అమ్మాయిలందరినీ ఒక గదిలోకి నెట్టి , వారిపై శారీరకంగా దాడి చేశారు అనడానికి రక్తపు మరకలు సాక్ష్యంగా వున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేస్తున్నప్పటికీ వారిని జుట్టు పట్టుకొని లాక్కెల్లి , వాహనంలోకి తోసేసి తీసుకెళ్లిపోయినట్లు మీడియా ఇంటర్వ్యూ చేసిన ఇరుగుపొరుగువారు చెప్పారు.
అడ్వకేట్ శుక్లా అక్కడికి చేరుకుని, బాలికలను తీసుకెళ్లడానికి తెచ్చిన ఉత్తర్వులను చూడాలని డిమాండ్ చేసినప్పుడు, ఆమె మీద కూడా దాడి చేసి, వేధింపులకు గురిచేసి, చివరకు అరెస్టు చేసి, ఐపిసి 353 సెక్షన్ కింద (ప్రభుత్వాధికారులను విధి నిర్వహణలో అడ్డగించడం)అభియోగం మోపారు. సిడబ్ల్యుసి అధికారి పార్వతి వర్మ చెప్పడంతో ఎఫ్‌ఐఆర్‌లో ʹమా ఇల్లుʹ డైరెక్టర్ సంజీవ్ ఠక్కర్, హాస్టల్ సూపరింటెండెంట్ దీపికా సింగ్‌ల పేరు కూడా చేర్చారు. పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా, వారి కుటుంబాల సమ్మతి లేకుండా, వారి నాజూకైన ఆరోగ్య స్థితిని దృష్ట్యా కావల్సిన భద్రత, సంరక్షణల గురించి ఏ మాత్రం సంవేదనాదృష్టి లేకుండా వారందరినీ వేర్వేరు బాల గృహాలలో వుంచారు.
బిల్హాలో మేజిస్ట్రేట్ అడ్వకేట్ ప్రియాంక శుక్లాను బెయిల్ పై విడుదల చేసినందుకు మాకు కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఈ ప్రకరణ మొత్తం చాలా ఆందోళనకరంగా ఉంది. తన క్లయింట్ పట్ల విధులను నిర్వర్తించే న్యాయవాదిపై దాడి చేసిన పోలీసుల దౌర్జన్యాన్ని చూసి మేము దిగ్భ్రాంతి చెందాం. తమను ప్రశ్నించిన వారందరిపైనా, అందులోనూ అనారోగ్యంతో ఉన్న బాలికలపై కూడా పోలీసులను క్రూర హింస ప్రయోగించారు. చివరగా, HIV పాజిటివ్ పిల్లలు, వారి కుటుంబాల ప్రత్యేక అవసరాల గురించి CWC విభాగానికి ఏ మాత్రం సంవేదనాశీల దృష్టి లేదు.
మా డిమాండ్స్:
1. "మా ఇల్లు" ఆశ్రయంలో హింసకు కారణమైన పోలీసులు, సిడబ్ల్యుసి అధికారులపై అభియోగాలు దాఖలు చేసి తగిన చర్యలు తీసుకోవాలి.
2. న్యాయవాది ప్రియాంక శుక్లా, మా ఇంటి కార్యనిర్వాహకులు సంజీవ్ ఠక్కర్, దీపికా సింగ్‌లపై పెట్టిన అన్ని ఆరోపణలను ఉపసంహరించుకోవాలి.
3. "మా ఇల్లు" లో వుండిన 14 మంది బాలికలకు, ప్రత్యేకించి కరోనా విపత్తు ఉధృతంగా ఉన్న సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వారి ప్రత్యేక అవసరాలను తీర్చడంతో పాటు సురక్షితమైన గృహవసతి కల్పించాలి. వారిలో పరస్పరం వున్న సన్నిహిత సంబంధాలను గుర్తించి వారందరినీ ఒకే దగ్గర ఉంచాలి కల్పించి, సరైన వైద్య సదుపాయాలు, వారు ఎదుర్కొన్నా మానసిక ఆందోళనను తగ్గించడానికి తగిన కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి.
డిగ్రీ చౌహాన్, అధ్యక్షులు
శాలిని గేరే, కార్యదర్శి.

Keywords : PUCL, Chattisgarh, priyanka shukla, police
(2020-09-20 18:03:32)No. of visitors : 309

Suggested Posts


హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.

ఛత్తీస్గడ్ లో నిజాలు రాస్తున్న‌ జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు, తప్పుడు కేసులు

బస్తర్‌లో, జర్నలిస్టులు ప్రభాత్ సింగ్, మంగల్ కుంజమ్, సుశీల్ శర్మలపై అబద్ధపు ఆరోపణలు చేసి విచారణ చేపట్టడంలో, వారిని భయభ్రాంతులను చేసి, నిజాయితీగా, న్యాయమైన జర్నలిజాన్ని చేయడం మానేయాలని ఒత్తిడి తేవడమూ, ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులను విమర్శించడమూ, వారి అకృత్యాలను ప్రెస్‌లో బహిర్గతం చేయకూడదనే సందేశం యివ్వడమూ అనే ఉద్దేశ్యం యిమిడిఉంది.

పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో వందలాది మంది ఆదివాసీలు పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలియచేసారు. మూడు జిల్లాల ఆదివాసీలు సాంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించారు.

ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !

ఆదివాసీ హక్కుల దినోత్సవం సెప్టెంబర్ 13న దంతేవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల గిరిజనులు తమ రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ దంతేవాడలో నిరసన తెలపడానికి శ్యామ్‌గిరిలో ర్యాలీ చేయడానికి వచ్చారు.

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
more..


బాలికల