ఛత్తీస్గడ్ లో నిజాలు రాస్తున్న‌ జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు, తప్పుడు కేసులు


ఛత్తీస్గడ్ లో నిజాలు రాస్తున్న‌ జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు, తప్పుడు కేసులు

ఛత్తీస్గడ్


ఛత్తీస్‌‌గఢ్‌లో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న జర్నలిస్టులపై నిరంతర వేధింపులు కొనసాగుతున్నాయి. తప్పుడు కేసులు పెట్టిజైలుకు పంపిస్తున్నారు. ఛత్తీస్‌‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా వార్తాపత్రికలలో రాసే, సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలనువ్యక్తీకరించే జర్నలిస్టులను రకరకాల వేధింపులకు గురిచేస్తున్నారు.

బస్తర్‌లో కరోనా కాలంలో గిరిజన సమస్యలపై నిరంతరం రాసిన జర్నలిస్ట్ మంగల్ కుంజమ్‌ను నిర్బంధించే కుట్ర రాజ్య ఆదేశం మేరకు జరుగుతోంది. దంతేవాడ జర్నలిస్ట్ ప్రభాత్ సింగ్ 2020 జూలై 25న రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖలో జర్నలిస్ట్ మంగల్ కుంజమ్‌, అతని కుటుంబసభ్యులపై అనుమానాస్పదులుగా పోలీసులు నిఘా పెడుతున్నారని, సమాచారం సేకరిస్తున్నారని పేర్కొన్నారు. పరిపాలనా అవినీతిని బహిర్గతం చేసినందుకు కాంకేర్‌లోని ʹబస్తర్ బంధుʹ పత్రిక జర్నలిస్ట్ సుశీల్ శర్మను మేనెలలో అరెస్టు చేశారు.
బస్తర్‌లో, జర్నలిస్టులు ప్రభాత్ సింగ్, మంగల్ కుంజమ్, సుశీల్ శర్మలపై అబద్ధపు ఆరోపణలు చేసి విచారణ చేపట్టడంలో, వారిని భయభ్రాంతులను చేసి, నిజాయితీగా, న్యాయమైన జర్నలిజాన్ని చేయడం మానేయాలని ఒత్తిడి తేవడమూ, ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులను విమర్శించడమూ, వారి అకృత్యాలను ప్రెస్‌లో బహిర్గతం చేయకూడదనే సందేశం యివ్వడమూ అనే ఉద్దేశ్యం యిమిడిఉంది.
న్యూస్ 24, ANI, PTI లలో మనీష్ కుమార్ సోనీ సీనియర్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. సర్గుజా పోలీసులు తన జర్నలిజం పట్ల సంతోషంగా లేరని మనీష్ సోని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తనపై దేశద్రోహం కేసుపెట్టి తప్పుడు కేసులో ఇరికిస్తారేమోనని అనుమానం వెలిబుచ్చారు.
అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది మార్చిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌పై "అభ్యంతరకరమైన" సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టాడని ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జర్నలిస్ట్ మనీష్ కుమార్ సోనిపై 2020 ఆగస్టు 16 న అంబికాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐదు నెలల పాత ఫేస్‌బుక్ పోస్ట్ ఆధారంగా సుర్గుజా పోలీసులు భారత శిక్షాస్మృతిలోని 153 (ఎ), 153 (బి), 505 (2) సెక్షన్ కింద నేరాన్ని నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కార్పొరేటర్ అలోక్ దుబే చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు.
"ఫిర్యాదుపై విచారణ జరిపి దర్యాప్తు సోని చేసిన పోస్ట్ ఒక ఆదివాసీ సముదాయాన్ని అవమానించిందనీ, అది వారిని రెచ్చగొట్టే ప్రయత్నమని నిర్థారించింది" అనీ, యింకా ఎవరినీ అరెస్టుచేయలేదని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సుర్గుజా రేంజ్) రతన్ లాల్ డాంగి చెప్పారు.
మార్చి 21 న, సుక్మా జిల్లాలోని మిన్పా గ్రామ సమీపంలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) కు చెందిన పదిహేడు మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఆ సందర్భంలో సోనీ 2020 మార్చి 25న మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్ లో మరణించిన భద్రతా సిబ్బంది ఫోటోలను పెట్టి సోని తన ఫేస్‌బుక్ ఖాతాలో హిందీలో ఈ వ్యాఖ్యతో పోస్ట్ చేసారు. ʹచనిపోయిన వాళ్ళ కులం చూడండి… అలాగే చంపిన వాళ్ళది కూడా చూస్తే అందరిదీ ఒకటే కులం అయి వుంటుంది. ఇప్పుడు చంపించినవాళ్ళ గురించి అర్థం చేసుకోండి.... సమాధానం దొరుకుతుంది..... యిప్పుడు వీరిని అమరులని, వారి అమరత్వానికి సలాం చేసి మళ్ళీ జరగబోయే ఘటన కోసం ఎదురుచూడండి... ఆదివాసీలను ఆదివాసీలతో కొట్లాడించడం ద్వారానే అడవిని స్వాధీనం చేసుకోవచ్చు.....ʹ
"గత ఒక సంవత్సరం నుండి పోలీసు కస్టడీలో జరిగిన ఆదివాసీ యువకుడు పంకజ్ బైక్ మరణం గురించి నేను నిరంతరం రిపోర్టు చేస్తున్నాను కాబట్టి, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. వారు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నాను, బాధితులకు న్యాయం జరగడానికి మద్దతు ఇస్తున్నాను. చిన్న, చిన్న సంఘటనల కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమస్య గురించి నేను చాలా సందర్భాలలో సీనియర్ పోలీసు అధికారులకు లేఖ రాశాను కాని ప్రయోజనం లేకపోయింది"అని సోని చెప్పారు.
2019 లో పంకజ్ బెక్ అనే ఆదివాసీ యువకుడు పోలీసుల అదుపులో వున్నప్పుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం, పంకజ్ బెక్ కస్టడీ నుండి పారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కాని పంకజ్ బెక్ పోలీసుల అదుపులో వున్నప్పుడే మరణించారని అతని కుటుంబం ఆరోపించింది. ఈ కేసులో పోలీసులపై విచారణ పెండింగ్‌లో ఉంది. పంకజ్ బెక్ ప్రకరణలో తన రిపోర్టింగ్ ద్వారా జర్నలిస్ట్ మనీష్ సోని పోలీసుల కథనం, పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. అదే క్రమంలో, పోలీసు అధికారులు జరిపిన విలేఖరుల సమావేశంలో పంకజ్ బెక్ కేసుకు సంబంధించి లేవనెత్తిన న్యాయమైన ప్రశ్నలు పోలీసు శాఖకు, పోలీసు అధికారులకు నచ్చలేదు. అప్పటి నుండి, అతన్ని దేశద్రోహం తదితర సెక్షన్ల క్రింద కేసు పెట్టవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ డైరెక్టర్ జనరల్, రాయ్పూర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుర్గుజా రేంజ్ లకు లేఖ ద్వారా తెలియచేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ విచారణ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
మునుపటి బిజెపి పాలనలో జర్నలిస్టులను వేధించడం గురించి వచ్చిన వరుస ఫిర్యాదుల వల్ల కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల రక్షణ కోసం ఒక చట్టాన్ని ప్రవేశపెపెడ్తానని యిచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక మరిచిపోయింది.
మీడియా సిబ్బంది రక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని కమిటీ ఒక బిల్లును రూపొందించింది. రాష్ట్రంలో వాక్స్వాతంత్ర్యాన్ని, మీడియా వ్యక్తీకరణను పరిరక్షించే బిల్లును రూపొందించడానికి ఈ కమిటీని ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం, ప్రజా సేవకుడిగా, జర్నలిస్టులను రక్షించడంలో తాను ఈ చట్టం ప్రకారం నిర్వర్తించాల్సిన విధులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్టే కనక నిర్ణయించిన మేరకు లేదా ఒక సంవత్సరం వరకు, జైలు శిక్ష విధించవచ్చు.
(janchowk.com, timesofindia.indiatimes.com, సౌజన్యంతో)

Keywords : chattis garh , journalists, police case, chhattisgarh journalists questioning government policies are being implicated in fake cases
(2020-11-25 13:39:53)



No. of visitors : 372

Suggested Posts


హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

ప్రజలపై పారామిలిటరీ, డిఆర్‌జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్

భద్రతా దళాల సిబ్బంది గ్రామస్తులను వేధిస్తున్నారని సిపిఐ-మావోయిస్టు కిష్టారామ్ ఏరియా కమిటీ ఆరోపించింది. ఏరియా కమిటీ తొలిసారిగా వీడియో, ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా అడవి ప్రాంతంలో, భద్రతా దళాల క్యాంపుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం బుర్కాపాల్. ఈ గ్రామానికి వెళ్తే తమ పనులలో నిమగ్నమై వున్న మహిళలు లేదా వడిసెలతో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. కొంతమంది పురుషులు కూడా కనపడవచ్చు కానీ వారు బయటి వారితో మాట్లాడడానికి భయపడతారు.

మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.

బాలికల గృహంలో పోలీసుల హింసాకాండ,న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టుపై PUCL ప్రకటన‌

ʹఅప్నా ఘర్ʹ (మా ఇల్లు) బాలికల గృహం సిబ్బంది మీద దౌర్జన్యం చేసి, అక్కడ నివసిస్తున్న హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలను బలవంతంగా అపహరించుకు పోయిన సంఘటనకు బాధ్యులెవరో తెలుసుకోడానికి ప్రయత్నం చేసిన మా సంస్థ సభ్యురాలు, న్యాయవాది ప్రియాంక శుక్లాను 17.08.2020 న బిలాస్‌పూర్ పోలీసులు దారుణంగా హింసించి అరెస్టు చేయడాన్ని పియుసిఎల్ తీవ్రం

పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో వందలాది మంది ఆదివాసీలు పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలియచేసారు. మూడు జిల్లాల ఆదివాసీలు సాంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించారు.

పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు

మా జీవితాలను నాశనం చేసే పోలీసులు క్యాంపులు అవసరం లేదు. మాకు పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలు కావాలిʹ అంటూ అక్కడ గుమి కూడిన వందలాది మంది ఆదివాసులు నినదిస్తున్నారు.

Search Engine

వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
more..


ఛత్తీస్గడ్