భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ


భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

భద్రాద్రి

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గం గుండాల మండలంలోని దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఓ మావోయిస్టు మృతిచెందినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. చనిపోయినది శంకర్ అని, అనారోగ్యంతో హాస్పటల్ కు వెళ్ళిన ఆ కామ్రేడ్ ను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారని మావోయిస్టు పార్టీ జయశంకర్, ములుగు, మహబూబాద్, వరంగల్ పెద్దపల్లి డివిజనల్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ ఆరోపించారు. కామ్రేడ్ శంకర్ బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా సెప్టెంబర్ 6వ తారీకున జయశంకర్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో బంద్ ను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఆయన విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

తేది: 4/9/2020
అనారోగ్యంతో హాస్పటల్ కు పోయిన ఆదివాసీ ముద్దు బిడ్డ కా|| శంకర్‌ను గుర్తు తెలియని మావోయిస్టు పేరుతో పట్టుకొని దేవర్లగూడెం గ్రామ సమీపంలో టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించండి!
ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా సెప్టెంబర్ 6వ తారీకున జయశంకర్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో బంద్ ను పాటించండి!

ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా!
కా॥ శంకర్ అసలు పేరు దూది దేవాల్, గ్రామం అర్లపల్లి, సుక్మా జిల్లా కుంట ఏరియా ఇతను 2013లో దళంలోకి రిక్రూట్ అయినాడు. ఆ తర్వాత వెనువెంటనే పార్టీ నిర్ణయం ప్రకారం తెలంగాణ దళానికి బదిలీ అయినాడు. అప్పటి నుండి తెలంగాణ దళంలో పని చేస్తూ వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఏసీఎంగా, కమాండర్‌గా ఎదిగినాడు. అనారోగ్యం కారణంగా ట్రీట్మెంట్ కోసం హాస్పటల్ కు పోయిన కా॥ శంకర్‌ను పోలీసులు పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి సెప్టెంబర్ 3వ తారీఖు తెల్లవారు జామున గుండాల మండలం దేవార్లగూడెం- దుబ్బగూడెం గ్రామాల సమీపాన బూటకపు ఎన్‌కౌంటర్ లో టిఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు కలిసి హత్య చేశారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో మా దళాలపై దాడులు కొనసాగిస్తున్నారు. ప్రజలను, సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పదుల సంఖ్యలో జైళ్ళలో బందించారు. ఆదివాసి సంఘాల, తెలంగాణ పరిరక్షణ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు కలిసి ʹʹమావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు" అంటూ పోస్టర్లు, కరపత్రాలు వేస్తూ దొంగే దొంగ దొంగ అన్న చందంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు మాపై ఎన్ని ప్రచారాలు చేసిన భూస్వాములు, దళారీ నిరంకుశ పెట్టుబడిదారులు, పాలకులైన మీరే, ఈ రాజ్యాగమే అభివృద్ధి నిరోధకులని ప్రజలకు భాగా తెలుసు.
అందుకే కౄరులైన టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు అనారోగ్యంతో ఉన్న ఆదివాసి ముద్దు బిడ్డను పట్టుకొని చిత్రహింసలు పెట్టి దొంగ ఎదురు కాల్పుల్లో కాల్చి హత్య చేశారు. ప్రజలారా! ప్రజాస్వామిక వాదులారా! అభివృద్ధి పేరుతో హత్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పండి. ఈ బూటకపు ఎన్‌కౌంటర్ హత్యకు నిరసనగా సెప్టెంబర్ 6వ తారీఖున అన్ని వర్గాల ప్రజలు జయశంకర్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో బంద్ ను పాటించాలని కోరుతున్నాం.
విప్లవాభినందనాలతో,
వెంకటేష్
కార్యదర్శి
సీపీఐ మావోయిస్టు
జయశంకర్, ములుగు, మహబూబాద్, వరంగల్ పెద్దపల్లి డివిజనల్ కమిటీ

Keywords : cpi maoists, fake encounter, bhadradri kottagudem
(2020-11-26 01:38:04)No. of visitors : 1944

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
more..


భద్రాద్రి