ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !


ఆదివాసీ హక్కుల దినోత్సవం నాడు లాఠీలు,తుపాకీ బట్ లతో ఆదివాసీలపై దాడి !

ఆదివాసీ

ఆదివాసీ హక్కుల దినోత్సవం సెప్టెంబర్ 13న దంతేవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల గిరిజనులు తమ రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ దంతేవాడలో నిరసన తెలపడానికి శ్యామ్‌గిరిలో ర్యాలీ చేయడానికి వచ్చారు.
ఛత్తీస్‌గఢ్ లోని భూపేష్ బాగెల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసేందుకు వచ్చిన ఆదివాసీలపై దంతేవాడ పోలీసులు దౌర్జన్యం చేశారు. DRG తో సహా దంతేవాడ పోలీసు సిబ్బంది వందలాది మంది ఆదివాసీలను లాఠీలు, తుపాకీ బట్ లతో కొట్టారు. అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన సాక్ష్యాలు సంఘటనా స్థలంలో స్పష్టంగా కనబడుతున్నాయి. సుదూర గ్రామాల నుంచి కాలినడకన వచ్చినన వారు తమతో పాటు తెచ్చుకున్న ఆహారం, పాత్రలు, చెప్పులు, బ్యాగ్, గొడుగు మొదలైన వాటినన్నింటినీ ధ్వంసం చేశారు.

ఆదివాసీలు శాంతియుతంగా జరుపుతున్న ర్యాలీని అడ్డుకోవటానికి, పాల్ నార్, నకుల్నార్, శ్యామ్‌గిరి, పొట్లి, అరన్‌పూర్ తదితర అడవుల్లోకి పంపిన పదివేల మందికి పైగా సైనికులు, వారిపై లాఠీలు తుపాకీ మొనలతో క్రూరంగా కొట్టారు. తమ సమస్యలపై ఉద్యమిస్తున్న ఆదివాసీలను భూపేశ్ ప్రభుత్వం దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ్ ద్వారా దాడికి ఆదేశమిచ్చింది.చిన్న పిల్లలు, బాలికలు, వృద్ధ మహిళలకు ఎంత తీవ్రంగా దెబ్బలు తగిలాయంటే వారు తిరిగి యిళ్లకు వెళ్లడానికి నడవలేని స్థితిలో ఉన్నారు.

ర్యాలీకి వచ్చిన వారిలో పదహారు మంది యువతీ, యువకులను మావోయిస్టులని చెప్పి పోలీసులు తమ వెంబడి తీసుకెళ్ళారు. ఇటువంటి ఉద్యమాల సమయంలో, పాత బూటకపు కేసులో నిందితులుగా పేర్కొన్న వారిని లక్ష్యంగా చేసుకునే సంప్రదాయం బస్తర్‌ పోలీసులకు వున్నది. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరవింద్ నేతాం నాయకత్వం వహించడం ఆశ్చర్యకరమైన విషయమే. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, లేకపోతే వేలాది మంది జైళ్లు భరో ఉద్యమానికి సిద్ధంగా వున్నామన్నారు. తమ పిల్లల్ని తీసుకు వచ్చి అప్పచెప్పేదాకా అక్కడనుంచి కదిలమన్నారు.

ఆదివాసీల పట్టుదల చూసిన భూపేశ్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అరెస్టు చేసినవారందరినీ విడిచిపెట్టాలని ఆదేశమివ్వడంతో దంతేవాడ పోలీసులు అరెస్టు చేసిన 16 మందిని వారి కుటుంబాలకు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో, పిలిచినప్పుడు హాజరు పరుస్తామనే అంగీకార పత్రం (సుపుర్ద్ నామా) మీద సంతకాలు తీసుకొని అప్పగించారు.

ఛత్తీస్‌గఢ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అరవింద్ నేతం, సామాజిక కార్యకర్త సోని సోరి ఈ ఉద్యమానికి తన మద్దతుగా నిల్చారు.

Keywords : chattis garh, adivasi, police, congress, attack,
(2020-09-20 18:26:43)No. of visitors : 118

Suggested Posts


హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.

బాలికల గృహంలో పోలీసుల హింసాకాండ,న్యాయవాది ప్రియాంక శుక్లా అరెస్టుపై PUCL ప్రకటన‌

ʹఅప్నా ఘర్ʹ (మా ఇల్లు) బాలికల గృహం సిబ్బంది మీద దౌర్జన్యం చేసి, అక్కడ నివసిస్తున్న హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలను బలవంతంగా అపహరించుకు పోయిన సంఘటనకు బాధ్యులెవరో తెలుసుకోడానికి ప్రయత్నం చేసిన మా సంస్థ సభ్యురాలు, న్యాయవాది ప్రియాంక శుక్లాను 17.08.2020 న బిలాస్‌పూర్ పోలీసులు దారుణంగా హింసించి అరెస్టు చేయడాన్ని పియుసిఎల్ తీవ్రం

ఛత్తీస్గడ్ లో నిజాలు రాస్తున్న‌ జర్నలిస్టులపై పోలీసుల వేధింపులు, తప్పుడు కేసులు

బస్తర్‌లో, జర్నలిస్టులు ప్రభాత్ సింగ్, మంగల్ కుంజమ్, సుశీల్ శర్మలపై అబద్ధపు ఆరోపణలు చేసి విచారణ చేపట్టడంలో, వారిని భయభ్రాంతులను చేసి, నిజాయితీగా, న్యాయమైన జర్నలిజాన్ని చేయడం మానేయాలని ఒత్తిడి తేవడమూ, ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులను విమర్శించడమూ, వారి అకృత్యాలను ప్రెస్‌లో బహిర్గతం చేయకూడదనే సందేశం యివ్వడమూ అనే ఉద్దేశ్యం యిమిడిఉంది.

పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో వందలాది మంది ఆదివాసీలు పోలీసు క్యాంపు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలియచేసారు. మూడు జిల్లాల ఆదివాసీలు సాంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శన నిర్వహించారు.

Search Engine

మావోయిస్టు పార్టీ 16వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి -జగన్ పిలుపు
ఏచూరి సీతారాంకు జైల్లో ఉన్న మావోయిస్టు నాయకుడి లేఖ‌ !
ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ బూటకం...మావోయిస్టు నేత భాస్కర్ ప్రకటన‌
కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి
జార్ఖండ్‌లోని మెదినినగర్ సెంట్రల్ జైలు ఖైదీల నిరాహార దీక్ష - మద్దతుగా రాష్ట్రవ్యాప్త‌ నిరసనలు
పట్టణమంతా మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు - షాకయిన పోలీసులు
ఈ నెల 21 నుండి 27 వరకు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గణపతీ - మన మేధావులూ -పాణి
ఉమర్ ఖలీద్ అరెస్ట్ అక్రమం - పోరాడే స్వరాలకు సంఘీభావం తెలుపుతున్నాం!
ప్రజాస్వామిక విలువల ప్రతిరూపం స్వామి అగ్నివేశ్ -విరసం
భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్
ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్‌ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
జైలు నుండి విడుదలైన మావోయిస్టు నాయకుడిని గేటు వద్దే మళ్ళీ అరెస్టు చేసిన కేరళ‌ పోలీసులు
పోలీసు క్యాంపు ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ప్రదర్శన, బహిరంగ సభ‌
ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹ
భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...
కూర్మనాథ్, సత్యనారాయణలను భీమా కోరేగావ్ కేసులో ఇరికించే కుట్ర -విరసం
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భద్రాద్రి ఎన్ కౌంటర్ బూటకం - ఆరు జిల్లాల బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
itʹs a Conspiracy: Terms Maoist party
గణపతి సరెండరవుతారన్నది ఓ కట్టు కథ...మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌
పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల భారీ ర్యాలీ
ఎల్గార్ పరిషత్ కేసు డిఫెన్స్ న్యాయవాదులకు ఎన్ఐఏ సమన్లు
నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు ధన్యవాదాలు: డాక్టర్ కఫీల్ ఖాన్
more..


ఆదివాసీ