గణపతీ - మన మేధావులూ -పాణి

గణపతీ

రెండు వారాల కింద ఒక రసవత్తర నాటకం నడిచింది. మూడు రోజులపాటు అంచెలంచెలుగా సాగింది. దాని పేరు ʹగణపతి లొంగుబాటుʹ. ప్రభుత్వ ఇంటలిజెన్సీ విభాగం, తెలుగు పత్రికల సంయుక్త నిర్వహణలో దీన్ని ప్రదర్శించారు. ఇది భారత ప్రభుత్వం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆ రకంగా ఇందులో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఈ నాటకంపై మేధావుల ప్రతిస్పందనలే విశేషం. అందువల్లే దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.
మంద్రస్థాయి యుద్ధతంత్రంలో భావాలతో చెలగాటం ఒక ముఖ్యమైన అంశం. ప్రజల మనుసుల్ని గెలవడం అనే మాట కూడా అందులో వాడారు. వినడానికి ఈ మాట ఎంత బాగుందో చూడండి. ఎల్ఐసీలోని భావజాల యుద్ధ వ్యూహాన్ని ఉద్దేశించి ఈ మాట వాడారు. మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో సుమారు పదిహేనేళ్లుగా లక్షలాది(ఇప్పుడైతే 7 లక్షలు) సైన్యం చేస్తున్న యుద్ధంలో ఈ భావజాల యుద్ధం కూడా అంతర్భాగం. దీన్ని పట్టణ మైదాన ప్రాంతాల్లో, ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలపై కూడా చేస్తారు. ఈ యుద్ధానికి ప్రభుత్వం పత్రికలను, న్యాయస్థానాలను కూడా కైవసం చేసుకొని వాడుకుంటోంది. గణపతి లొంగుబాటు అనే ప్రచారం అందులో భాగమే.
దీని గురించి విప్లవోద్యమం పదేళ్లుగా ప్రచారం చేస్తోంది. అది కేవలం ఆయుధాల యుద్ధమే కాదని, మనుషుల మెదళ్లను టార్గెట్ చేసుకున్నదని వివరిస్తోంది. కానీ మన మేధావులకు ఎక్కలేదు. అందువల్లే చాలా మంది తెలుగు మేధావులు ఈ ప్రభుత్వ ప్రాయోజిత నాటకానికి సగటు ప్రేక్షకులయ్యారు. నాటక ఇతివృత్తమేమిటో, దాని వ్యూహాత్మక కుట్ర కథనం ఏమిటో తెలుసుకోకుండానే విశ్లేషణలకు దిగారు. ఆ రకంగా మన మేధో ప్రపంచం ఎలా ఉందో తెలుసుకొనే ఒక సందర్భంగా అది మారిపోయింది. మంద్ర స్థాయి యుద్ధ తంత్రం గురించి తెలిసిన వాళ్లకు పత్రికల కథనానికంటే మేధావుల ప్రతిస్పందనే ఆశ్చర్యకరం. కాబట్టి భావజాల యుద్ధంలో ప్రభుత్వ వ్యూహం గురించి మాట్లాడుకోవడం అంటే ఇదుగో.. ఇలాంటి మేధావుల తీరును చర్చించుకోవడమే.
గణపతి లొంగుబాటు అనే వార్త మీద మేధావుల ప్రతిస్పందనల్లో కొన్నింటిని తప్పక పట్టించుకోవాలి. వాటిలో ఒకటి విప్లవంలో అలిసిపోవడం, రిటైర్ కావడం. దీన్ని ఎక్కడి దాకా లాగారంటే వయో భారంతో, అనారోగ్యంతో లొంగిపోవడం కూడా రిటైర్ కావడమన్నారు. కాబట్టి విప్లవోద్యమంలో ʹరిటైర్మెంట్ʹ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ పరిశీలిస్తే సరిపోతుంది. ʹజనతన రాజ్యం - దండకారణ్యంలో మావోయిస్టుల ఆచరణʹ పుస్తకంలో రాసిన విషయాన్నే గుర్తు చేస్తాను.
విప్లవకారులు దండకారణ్యంలోకి వెళ్లిన తొలి రోజుల్లో ఓ ఆదివాసీ పరిచయం అయ్యాడు. మొదట్లో ఆయన విప్లవకారులకు అడవిలో దారులు చూపడం దగ్గరి నుంచి అనేక రకాలుగా సహకరించాడు. చాలా గ్రామాల్లో సంఘాలను ఏర్పాటులో భాగమయ్యాడు. వాటికి మార్గదర్శకత్వం వహించే పైస్థాయి బాధ్యతలు నిర్వహించాడు. సుదీర్ఘకాలం జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన కుటుంబంలోని రెండు మూడు తరాల వాళ్లంతా ఏదో ఒక రంగంలో విప్లవోద్యమంలో పని చేస్తున్నారు. కొందరు విప్లవోద్యమంలో అమరులయ్యారు. ఆయన వయసు పూర్తిగా పైబడింది. అనారోగ్యం. ఇక ఆయన అంతక ముందటి బాధ్యతలను శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చురుగ్గా, తార్కికంగా నిర్వహించలేని స్థితికి వచ్చాడు. దీన్ని ఉద్యమ నాయకత్వం గుర్తించింది. క్రాంతికారీ జనతన సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక రెసిడెన్షియల్ పాఠశాలకు ఆయన్ను మార్చారు.
ʹఇప్పుడు ఇక్కడ ఏం బాధ్యతలు నిర్వహిస్తున్నావʹని అడిగితే.. ʹహాస్టల్ పనులు చూస్తుంటా...ʹ అని ʹఈ పనులు చేయడానికి వాళ్లంతా ఉన్నారు..పిల్లలతో కలిసి ఉండటమే నేను చేసే పని..ʹ అని ఆయన అన్నాడు.
విప్లవోద్యమంలో ʹరిటైర్మెంట్ʹను అర్థం చేసుకోడానికి ఇది అత్యుత్తమ ఉదాహరణ అనుకుంటున్నా. ఈ మాట కలెక్టివ్-ఇండివిజువల్ రిలేషనను, శారీరక మానసిక దారుఢ్యానికి-వయోభారానికి అనారోగ్యానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. సమిష్టి నాయకత్వం, పని విధానం ఉన్న చోట ఒక వ్యక్తి ఒక పనిని చేయగలిగినంత కాలం ఒక బాధ్యతల్లో ఉండటం తప్పు కాదు. అయితే సమిష్టిగా పని నడుస్తోందనడానికి రుజువు ఏమిటి? అనే ప్రశ్న తలెత్తవచ్చు. దశాబ్దాల తరబడి అత్యంత విలువైన వ్యక్తులు ఎన్ కౌంటర్లలో చనిపోయినా, జైలుపాలయినా, కొందరు ఇండ్లకు వెళ్లిపోయినా సంక్షోభం తలెత్తకపోవడమే దీనికి ఉదాహరణ. అంటే అక్కడ ఒక కలెక్టివ్ ఉన్నది. అందులోని వ్యక్తుల వయసు, అనారోగ్యం మొదలైన వాటిని పరిగణలోకి తీసుకొని అదే కలెక్టివ్ లోని వేరే పనులు అప్పగించబడతాయి.
పైన చెప్పిన ఆదివాసీ కామ్రేడ్ దగ్గరి నంచి విప్లవోద్యమ నిర్మాణంలో కింది నుంచి అత్యున్నత స్థాయి వరకు ఇలాంటి విధానమే ఉంటుంది. గణపతి స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకొని వేరే వాళ్లకు అప్పగించాడని ఆ పార్టీ ప్రకటించింది. మనకు ఏ కొంచెం హేతుబుద్ది ఉన్నా దీన్నుంచి బోలెడు అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టు పార్టీలాంటి నిర్మాణాల్లో ఇలాంటి ఒక ప్రతిపాదన నిర్ణయం కావడానికి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కావడానికి ఎంత కాలం పడుతుందో ఊహించవచ్చు. కొన్ని స్థాయిల దాకా అయినా పదే పదే చర్చనీయాంశమైతే తప్ప నిర్ణయంగా మారదు. విధానపరంగానే ముందస్తు ఆలోచనలు లేకుండా చేసే పనులు కావివి. అదే క్రమంలో ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకున్న వాళ్లకు వేరే పనులు అప్పగిస్తారు. గణపతి ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆ పార్టీ ఇచ్చిన ప్రకటనను పత్రికల్లో చూసే ఉంటారు.
అంతేగాని ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకోవడమంటే రిటైర్ కావడమని, ఒక వేళ వయో భారంతో లొంగిపోయినా అది కూడా రిటైర్ మెంట్ అని మేధావులు అభిప్రాయపడ్డారు. వృద్ధాప్యం వాళ్లకు ఇలా అర్థమైంది. వయసు, అనారోగ్యంపట్ల కన్సర్న్ ఉండటం మంచిదే. కానీ వాళ్ల అభిప్రాయాలు సరైనవి కాదు. వృద్ధాప్యం పైబడగానే ఇంటికి వచ్చేసి వరండాలోని వాలు కుర్చీలో సేదతీరడం అనే పద్ధతి మాత్రమే తెలిసినందు వల్ల అలా అర్థం చేసుకున్నారు. అలా సేదతీరాలంటే ఇంటికి వచ్చేయాల్సిందే. వేరే దారి లేదు.
కానీ విప్లవోద్యమం మావన జీవితంలోని వృద్దాప్యమనే సహజ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకున్నదో తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణ సరిపోతుంది. ఈ ప్రస్తావన కూడా జనతన రాజ్యంలోనిదే. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పార్టీ శ్రేణులకు చాలా ఏళ్ల కిందే ఒక ఉత్తరం రాసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చూడండి.ʹసీనియర్ మహిళా కామ్రేడ్స్ లో విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ ఉద్యమ అభివృద్ధిలో వారి సేవల్ని వినియోగించుకుందాం.. అనే శీర్షికతో మూడున్నర పేజీలు ఉంది. పార్టీలోని సీనియర్ కామ్రేడ్స్ పట్ల, అందునా మహిళా కామ్రేడ్స్ పట్ల శ్రేణులన్నీ బాధ్యతాయుతంగా మెలగాలని సూచిస్తూ విడుదల చేసిన ఉత్తరం అది. అందులోని కొన్ని భాగాలు చాలా మానవీయంగా, అత్యంత విప్లవకర దృక్పథంతో ఉన్నాయి.
ఉదాహరణకు ʹవయస్సు రీత్యా అనివార్యంగా వచ్చే పరిమితులతోపాటు ఇక్కడి కఠినమైన గెరిల్లా జీవితం మూలంగా ఇలాంటి(సీనియర్)కామ్రేడ్స్ అనేక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా కామ్రేడ్స్ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటున్నది. మన దేశంలోని మహిళలందరిలో దాదాపు సహజంగానే ఉండే రక్తహీనత సమస్యతోపాటు వయస్సుతోపాటు వచ్చే అనారోగ్యాలు, శారీరక, మానసిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. గతంలో గెరిల్లాలుగా చురుగ్గా అన్ని రకాల కార్యకలాపాల్లో పాల్గొన్న సీనియర్ మహిళా కామ్రేడ్స్ నేడు వేర్వేరు రకాల, వేర్వేరు స్థాయిల పరిమితులకు గురయ్యి కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారు..ʹ అంటూ.. ʹపార్టీలో అనుభవజ్ఞులైన సీనియర్ కామ్రేడ్స్ ఒక గొప్ప సంపద. ముఖ్యంగా విప్లవోద్యమంలో వచ్చే కీలకమైన మలుపుల్లో, ఎగుడు దిగుడుల్లో ఈ కామ్రేడ్స్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందనేది మనందరం గుర్తించాలి. మహిళలుగా, వయస్సు పైబడిన కామ్రేడ్స్ గా, ఉద్యమంలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న కార్యకర్తలుగా ఇలాంటి కామ్రేడ్స్ అందరి పట్ల పార్టీపరమైన స్థాయి భేదాలతో నిమిత్తం లేకుండా మనం గౌరవంగా, వినయంగా ఉండాలి. వాళ్ల అవసరాల్ని, సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించడానికి ఓపికగా, శ్రద్ధగా ప్రయత్నించాలి. ఇలాంటి కామ్రేడ్స్ కు నిర్దిష్టంగా బాధ్యత వహించే ఏసీ, డీవీసీ, ఆర్ సీ కామ్రేడ్స్ తో పాటు అందుబాటులో ఉండే ఎజెడ్ సీ కామ్రేడ్స్ ఇలాంటి కామ్రేడ్స్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. తమ ప్రయాణాల్లో, పనుల్లో భాగంగా ఇలాంటి కామ్రేడ్స్ ఉంటున్న ప్రాంతానికి వెళ్లే నాయకత్వ కామ్రేడ్స్ వాళ్లను తప్పక కలిసేలా ప్లాన్ చేసుకోవాలి. వాళ్లు ఉండే చోట్లలో వీలైన మేరకు వాళ్ల అవసరాలు తీరేలా, వాళ్లు నిర్వహిస్తున్న పని స్వభావాన్ని బట్టి తగిన రక్షణ ఏర్పాట్లు ఉండేలా తప్పక శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో, వాళ్ల సామాన్లు పట్టుకోవడంలో అవసరమైన సహాయం మనం అందించాలి..ʹ అని రాశారు.
ఇంకా... ʹమన పార్టీలో నక్సల్బరీ తరానికి చెందిన అపార అనుభవం కలిగిన కామ్రేడ్స్ అతి కొద్ది మంది ఉన్నారు. ఆ తర్వాత తరాల కామ్రేడ్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అన్ని రకాల అనుభవాలు ఉన్న కామ్రేడ్స్, అన్ని వయస్సుల కామ్రేడ్స్ పార్టీలో ఉండటం అన్నది విప్లవోద్యమ అభివృద్ధికీ, దాని భవిష్యత్తుకూ ఎంతో తోడ్పడే అంశం. కాబట్టి సీనియర్ కామ్రేడ్స్ పట్ల, ప్రత్యేకించి సీనియర్ మహిళా కామ్రేడ్స్ పట్ల మనం సరైన వైఖరిని అవలంబిద్దాం. వారు ఎలాంటి అభద్రతా భావానికి గురికాకుండా తమ శక్తి మేరకు కృషి చేసేలా మద్దతునందిద్దాం..ʹ అని ముగించారుʹ
ఇవ్వాల్టి సమాజంలో బాల్యం వలె వృద్ధాప్యం కూడా అతి పెద్ద సామాజిక సమస్య. అనాథ బాలలు, వృద్ధులు నానాటికి పెరిగిపోవడం ఈ వ్యవస్థ అమానుషత్వానికి గుర్తు. సహజమైన బాల్యం, వృద్ధాప్యం సహితం సామాజిక సమస్యలుగా పరిణమించాయి. ఈ వ్యవస్థను రద్దు చేయడానికి నడుస్తున్న విప్లవోద్యమంలో ఇవి రెండూ ఎన్నడూ అలాంటి సమస్యలు కావు. అయితే వ్యక్తులుగా వృద్ధాప్యం, ఆనారోగ్యం తప్పేవి కావు. వీటిని ఎదుర్కొంటున్న సీనియర్ కామ్రేడ్స్ పట్ల పార్టీ తన శ్రేణులను అప్రమత్తం చేయడానికి ఈ లేఖ విడుదల చేసింది. విప్లవోద్యమం నిరంతరం తనను తాను సెన్సిటైజ్ చేసుకోడానికి ఎలా ప్రయత్నిస్తున్నదో ఈ లేఖ సూచస్తోంది.
వృద్ధాప్యం, అనారోగ్యం వంటి వాటిపల్ల విప్లవోద్యమానికి ఇలాంటి మానవీయ వైఖరి ఉంటుంది. ఇది చాలా మామూలు విషయం. కానీ మన మేధావుల్లో చాలా మందికి ఈ విషయాలు తెలియవు. వయసు పైబడితే ఏం చేయాలి? రిటైర్ కావాల్సిందే. వాళ్లకు ఇదొక్కటే తెలుసు. కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి, మరి కొన్ని దురుద్దేశాలు.. అన్నీ కలిసి చాలా పెద్ద ఎత్తున చర్చకు దిగారు. అయినా సరే వాళ్లు ప్రభుత్వం పన్నిన వలలో పడి అనేక అవాస్తవాల మీద ఆధారపడినా వృద్దాప్యం , అనారోగ్యంలాంటి మానవీయ విషయాలపై స్పందించారు. గణపతి విషయంలోనే కాదు, ఏ కార్యకర్త విషయంలో అయినా విప్లవోద్యమ వైఖరి తెలుసుకోడానికి పై రెండు ప్రస్తావనలు ఉపయోగపడతాయి.
-పాణి
(virasam1970.blogspot.com నుండి )

Keywords : ganapathi, maoists, police,intellectual
(2024-04-25 23:47:47)



No. of visitors : 1328

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


గణపతీ