వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 25న దేశవ్యాప్త ఆందోళనలను జయప్రదం చేద్దాం -TDF

వ్యవసాయ

రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకవచ్చిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఈ నెల 25న జరిగే దేశవ్యాప్త ఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ ప్రజా స్వామిక వేదిక ప్రకటన‌

25న దేశవ్యాప్త ఆందోళనకు మద్దతు
-తెలంగాణ ప్రజా స్వామిక వేదిక
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ వ్యవసాయాన్ని, రైతులను నాశనం చేసి కార్పెరేట్ల కు దోచిపెట్టడమే!!
=============================
ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులరా!!
నరేంద్ర మోడీ ప్రభుత్వం మంద బలంతో దేశాన్ని ఫాసిజం లోకి తీసుకెళ్లడం లో భాగమే ఈ రైతు వ్యతిరేక బిల్లులు.
వీటిని ప్రజాస్వామిక వేదిక ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా స్వామిక వాదులందరు,అన్నీ వర్గాల ప్రజలు కేంద్రం మెడలు వంచేందుకు రోడ్డెక్కాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రజా స్వామిక వేదిక పిలుపునిస్తున్నది.
ʹʹకనీస మద్దతు ధర పేరు తో ప్రధాని మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ శాసనాలు చిన్న, మధ్యతరగతి రైతులను నాశనం చేస్తాయి. మోడీ తప్పుడు సమచారాన్ని ప్రచారం చేయడం వల్ల చిన్న, మధ్య తరగతి రైతుల ప్రయో జనాలు దెబ్బతిని రోడ్డున పడే ప్రమాదం ఉంది.
మోడీ ప్రభుత్వం చేపట్టే ʹʹఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరుతో ఆత్మ సమర్పన్‌ʹʹ ఆపడా నికి, రైతులు చేపట్టే ఈనెల 25న దేశవ్యాప్త ఆందోళనకు తెలంగాణ ప్రజా స్వామిక వేదిక మద్దతు ఇస్తున్నదీ.
ఈ దుర్మార్గ బిల్లు ద్వారా రైతుకు గిట్టుబాటు దర దొరకదు. బహుళజాతి రంగము రైతు పై ఆధిపత్యము చెలాయిన్చి,దేశములొ అహార కొరత సృష్టించబడుతుంది. పేదలకు పప్పు దినుసులు,ఆలుగడ్డ,ఉల్లిగడ్డ వంటి నిత్యావసర దినుసులు అందకుండా ఆకలి చావులే శరణ్యం అయ్యే పరిస్థితి నెలకొంటుంది.
ʹʹప్రజాస్వాము ను నిండు పార్లమెంట్‌లో మోడీ ప్రభుత్వం హత్య చేసిందనడానికి ఈ బిల్లుల ఆమోద ప్రక్రియనే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. పూర్తిగా నిరంకుశత్వంతో రాజ్యసభ లో మెజారిటీ లేకున్నా అప్రజాస్వామిక పద్దతిలో వ్యవహరించింది. ఇవాళ భారత ప్రజలు రాజ్యాంగ గణతంత్ర రాజ్యాన్ని బీజేపీ హిందూత్వ ఫాసిజం నుండి కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పార్లమెంట్‌ ముందుకు వచ్చే ప్రతి బిల్లుపై ఓటింగ్‌ డిమాం డ్‌ చేసే హక్కు ప్రతి ఎంపికీ ఉంటుంది. కానీ పార్లమెంట్ నిర్లక్ష్యంగా తిరస్కరించింది. ఇది రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేయడమేనని ప్రజా స్వామిక వేదిక అభిప్రాయపడుతుంది. అదానీ,అంబానీ & అమెజాన్ వంటి కార్పొరేట్‌లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి ప్రభుత్వ అసలు ఉద్దేశం.
కొత్త చట్టంలో కాంట్రాక్ట్ ధర,గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా ఉండాలని పేర్కొనలేదు. ఈ చట్టంతో రైతులకు సాధికారత లేదు రక్షణ లేదు & ధరల హామీ లేదని స్పష్టమైంది. ECA సవరణ చట్టం కార్పొరేషన్లచే ఆహార వస్తువుల అక్రమ నిల్వను ప్రోత్సహిస్తుంది.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు గిట్టుబాటు ధరతో సేకరణ మరియు మార్కెట్ యార్డ్ కొనుగోలు వ్యవస్థని నిర్వీర్యం చేయడమే.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా ఓటేసిన టిఆర్ఎస్ పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలని ఒత్తిడి చేయాలని ప్రజలకు టీడీఫ్ పిలుపుణిస్తున్నది. అదే సమయంలో తెలంగాణ లో కార్పొరేట్ వ్యవసాయము-MNC ల ఆహ్వానం పై తన స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.
కేంద్రం మెడలు వంచి రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకొనేలా కార్మిక వర్గ నాయకత్వం లో ,అసంఘటిత రంగ కార్మికుల ,రైతాంగ పోరాట ల ఐక్య ఉద్యమాలతో పోరాడుదామని ప్రజా స్వామిక వేదిక పిలుపునిస్తుంది.
కన్వీనర్స్ కమిటీ
తెలంగాణ ప్రజా స్వామిక వేదిక

Keywords : agriculture bill, narendra modi, bjp, TDF
(2024-04-25 23:48:03)



No. of visitors : 578

Suggested Posts


పోడు భూముల సమస్య శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు...టీడీఎఫ్

తాజాగా ఇవాళ సిర్పూర్ కాగజ్ నగర్ లో అటవీ అధికారులపై పోడు భూముల రైతుల విత్తనాలు నాటుకున్న భూముల మీదకు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులను, పోలీసులను ట్రాక్టర్లతో దున్నించడానికి పంపడము దానితో రైతులు తిరగబడటం స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప (టిఆర్ఎస్)సోదరుడు జడ్పీటీసీ, జెడ్పి వైస్ చైర్మైన్ కృష్ణ నేతృత్వంలో విత్తనాలు నాటిన దుక్కులను నాశనం చేస

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వ్యవసాయ