సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!


సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!

సీనియర్

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ సెప్టంబర్ 23 న అమరులయ్యారు ఈ సందర్భంగా సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన‌

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ గారు ఈరోజు (23-9-2020) రాత్రి 7 గం. కు విశాఖలో అమరులయ్యారు. ఆమె గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కోవిడ్-19 కూడా సోకడంతో విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
కామ్రేడ్ చంద్రమ్మ శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో 16 వ ఏటనే పాల్గొన్నారు. దళ సభ్యురాలిగా వుంటూ విప్లవోద్యమ కృషి చేసారు. తనతోపాటు దళంలో పనిచేసిన కామ్రేడ్స్ పోలీసు ఎన్కౌంటర్లలో చనిపోయినా చంద్రమ్మ సంకల్పం చెక్కు చెదరలేదు. ఉక్కు మహిళగా ముందుకు సాగారు.
ఉద్యమ క్రమంలోనే కామ్రేడ్ చంద్రమ్మకి పైలా వాసుదేవరావు గారితో వివాహమైంది. పోరాటం తీవ్రమైన నిర్బందాన్ని ఎదుర్కొంటున్న స్థితిలో కామ్రేడ్ చంద్రమ్మ తనకు పుట్టిన బిడ్డను (నేడు ప్రముఖ జర్నలిస్ట్ అత్తలూరి అరుణ)పొత్తిళ్లలోనే పార్టీ నిర్ణయం మేరకు వేరే వాళ్లకు ఇచ్చివేసారు.
శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని రాజ్యం తీవ్ర నిర్బంధంతో ఎంకౌంటర్లు, అరెస్టులుతో అణిచివేయడానికి పూనుకుంది. ఆ స్థితిలో దెబ్బతిన్న ఉద్యమాన్ని పునర్నిర్మించడానికి చంద్రమ్మ ఇతర కామ్రేడ్స్ తోపాటు తన వంతు కృషి చేసారు. ఈ క్రమంలోనే అరెస్టయ్యి విశాఖ సెంట్రల్ జైలులో సుమారు 14 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.
జైలు నుండి విడుదలైన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఉద్ధానం ఏరియాలో రైతు-కూలీలు, ఆదివాసీల, మత్స్యకారుల సమస్యలపై ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు నడిపారు. జీడీ పిక్కలకు మద్దతు ధర కోసం పోరాడటమేగాక, జీడిపిక్కల పరిశ్రమలలోని కార్మికుల సమస్యలపై ఆందోళనలు చేశారు.
ప్రజాపంథా, జనశక్తి, న్యూడెమోక్రసీ పార్టీలలో శ్రీకాకుళం జిల్లా నాయకురాలు గానూ, అఖిల భారత రైతు-కూలీ సంఘం నాయకురాలుగాను బాధ్యతలు నిర్వహిస్తూ విప్లవోద్యమ నిర్మాణ కృషిచేశారు. ప్రస్తుతం సి.పి.ఐ (ఎం.ఎల్) రైజింగ్ న్యూడెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
72 సంవత్సరాల వయసులో 55 సంవత్సరాల జీవితాన్ని విప్లవోద్యమం కోసం వెచ్చించి చివరి వరకూ ఆశయ సాధనకై అంకితమైన ధన్యజీవి కామ్రేడ్ చంద్రమ్మ.
కామ్రేడ్ పైలా చంద్రమ్మకు అరుణారుణ జోహార్లు.
వై.సాంబశివరావు,
అధికార ప్రతినిధి
సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
23-9-2020

Keywords : paila chandramma, cpi ml new democracy, srikakulam, martyr
(2020-10-28 05:35:57)No. of visitors : 284

Suggested Posts


50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!

1969, మే 27న మొట్టమొదటి బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు.

శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమ

రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే

సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.

చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ

యాభై ఏళ్లుగా మడమ తిప్పని విప్లవాచరణకు ప్రతిరూపం కా. చంద్రమ్మ. విప్లవంలో ఆమె నిండు జీవితాన్ని గడపడం గర్వకారణం. కరోనా బారిన పడి అమరురాలు కావడం విషాదం. శ్రీకాకుళ పోరాట పంథాలో చంద్రమ్మ వెనుతిరిగి చూడలేదు.

Search Engine

సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
more..


సీనియర్