దళిత బాలికపై అత్యాచారం...వెన్నెముక విరిగిపోయింది...శ్వాస ఆగిపోయింది


దళిత బాలికపై అత్యాచారం...వెన్నెముక విరిగిపోయింది...శ్వాస ఆగిపోయింది

ఉత్తర ప్రదేశ్ లోని దళిత అణచివేతకు సంబంధించిన భయంకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇది. హాథ్ రస్‌లో లోని చందపా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికతో వ్యవహరించిన క్రూరత్వాన్ని గురించి చదివితే ఒళ్ళు జలదరిస్తుంది. మొదట ఆమె నాలుకను కోశారు, మెడ మీద గాయం చేశారు. వెన్నెముక విరిచేశారు. ఆపై సామూహిక అత్యాచారం చేశారు. ఇదంతా ఆ వూళ్ళోని అగ్ర కులానికి చెందిన నలుగురు దుర్మార్గులు చేశారు. వారిని సందీప్, రాము, లవ్ కుష్, రవిలుగా గుర్తించారు. బాధితురాలు అలీఘర్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు, ఒకడు ఇంకా పరారీలో ఉన్నాడు. సామూహిక అత్యాచారం, హత్యాయత్నం, ఎస్‌సి-ఎస్టీ చట్టం కింద కేసు పెట్టామని హాథ్ రస్‌లో సూపరింటెండెంట్ విక్రాంత్ వీర్ చెప్పారు.

ఈ సంఘటన సెప్టెంబర్ 14 నాడు జరిగింది. అమ్మాయి, ఆమె తల్లి తమ ఇంటికి కొంత దూరంలో పశువుల మేత కోసం వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. తల్లి దాదాపు వంద మీటర్ల దూరంలోనే వున్నప్పటికీ వినికిడి శక్తి లేకపోవడంవల్ల కూతురిని కాపాడలేకపోయాను అని వాపోతోంది.

ప్రధాన నిందితుడు 20 ఏళ్ల సందీప్, అతని కుటుంబం ఆమె ఇంటి సమీపంలోనే వుంటారు. వారు ఎప్పుడూ ఆ ప్రాంతంలోని దళితులను వేధిస్తుంటారు. రెండు దశాబ్దాల క్రితం సందీప్ తండ్రిని ఏదో చిన్న సమస్యపై బాధితురాలి తండ్రిని హింసించాడనే ఆరోపణతో ఎస్సీ-ఎస్టీ చట్టం క్రింద అరెస్టు అయి మూడు నెలల జైలు శిక్ష అనుభవించాడు.

సుమారు 600 కుటుంబాలున్న గ్రామంలో సగం ఠాకూర్ల కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాలు 100, వుండగా 150 కుటుంబాలు మాత్రమే దళితులవి.

" సెప్టెంబర్ 14, సోమవారం, ఉదయం పదిన్నర గంటలకు, ఆ అమ్మాయి తన తల్లి, సోదరుడితో కలిసి పశువుల గడ్డి తేవడం కోసం పొలాలకు వెళ్ళింది. కాస్సేపయ్యాక అమ్మాయి సోదరుడు, కోసిన గడ్డిని ఇంటికి తీసువెళ్ళాడు. దీని తరువాత, బాధితురాలి తల్లి కొంత దూరం వెళ్లి గడ్డి కోయడం ప్రారంభించింది. అదే సమయంలో, బాధితుడిని ఒంటరిగా చూసిన ఆ గ్రామానికి చెందిన నలుగురు యువకులు పక్క పొలంలోకి లాక్కెళ్ళారు.

ఉదయం సుమారు 9.45 సమయంలో తన కూతురు అక్కడ కనబడక పోతే ఇంటికి వెళ్లి ఉంటుందని అనుకున్నాను, కాని ఆమె గులాబీ రంగు చెప్పులు కనబడడంతో కాస్సేపు వెతికిన తరువాత ఒక చెట్టు క్రింద అమ్మాయి పడివుంది అని తల్లి చెబుతోంది. నోరు, మెడ, కళ్ళ నుండి రక్తం కార్తోంది. ఆమె కండువాను ఆమె చున్నీ మెడకు కట్టి వుంది. మొదట తీసుకెళ్లిన జిల్లా ఆసుపత్రికి తీసుకు వెళ్తే వారు అలీగఢ్ జెఎన్ మెడికల్ కాలేజీని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్నందున, అక్కడ నుంచి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

కూలీ పనిచేసే అమ్మాయి సోదరుడు సందీప్‌మీద ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్ సహాయంతో, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసారు19 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన రెండు కుటుంబాల మధ్య శత్రుత్వానికి బీజాలు వేసిందని, అయితే ఇంతవరకు ఏమీ జరగలేదని "వారు అగ్ర కులస్థులు, మమ్మల్ని ఎప్పుడూ మా పేరుతో పిలుస్తారు. మేము ఆ విషయం ఎప్పుడూ పట్టించుకోలేదు. సందీప్ మద్యం తాగి మహిళలను వేధిస్తూనే వుంటాడు. కానీ దీని గురించి ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. " అని బాధితురాలి సోదరుడు చెప్పాడు.

సందీప్, రవి తనను అంతకు ముందే బెదిరించారని ఈ సంఘటన జరిగిన తర్వాత బాలిక చెప్పిందని ఇంతకు ముందే తనతో ఈ విషయం చెబితే బాగుండేదని తల్లి బాధపడుతోంది. ʹవారు ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆమె పారిపోయింది ……. సందీప్ తనను వేధిస్తున్నాడనీ, ఇల్లు వదిలి వెళ్ళడానికి భయపడుతున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. ఇప్పుడు చాలా ఆలస్యం అయింది, ఆమె సజీవంగా ఉంటే చాలనుకుంటున్నాను. "

అతనికి చికిత్స చేస్తున్న ఒక వైద్యుడు " వెన్నెముక దెబ్బతినడంతో బాధితురాలి చేతులు, కాళ్ళు చచ్చుబడిపోయాయి, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంది" అని చెప్పారు.

సామూహిక అత్యాచార నిందితులు, ముఖ్యమంత్రి, జిల్లా మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసరు – అందరూ ఠాకూర్ లే. ఈ మొత్తం కేసులో పోలీసుల వైఖరి సందేహాస్పదంగా ఉంది. బాధితుల వర్గానికి చెందినవారు నిందితుల కులం, ఎస్‌హెచ్‌ఓ కులం పోల్చి చూస్తున్నారు. సామూహిక అత్యాచారం జరిగినప్పటికీ, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుండా వేధింపుల ఆరోపణలపై పోలీసులు . 20 ఏళ్ల సందీప్, అతని మామ రవి, అతని స్నేహితులు లవ్ కుష్, రాములనుఅరెస్టు చేసారు. నాల్గవ నిందితుడిని సెప్టెంబర్ 26 శనివారం అరెస్టు చేశారు కేసు విచారణ తరువాత, సామూహిక అత్యాచారం, సెక్షన్ 307 (హత్యాయత్నం) క్రింద నిందితులపై కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని కూడా లైన్‌కు తరలించారు.

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలిక ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మంగళవారం మరణించింది. కుమార్తెకు న్యాయం చేయాలని, నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు భీమ్ ఆర్మీ కార్యకర్తలతో కలిసి ఆసుపత్రి వెలుపల నిరాహార దీక్షలో కూర్చున్నారు. దీనితో పాటు, కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం సాయంత్రం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కొవ్వొత్తి మార్చ్‌ను చేపట్టింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని మరుగుపరచడానికి ప్రయత్నిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వేరే ప్రదేశానికి తరలించినట్లు చెబుతున్నారు, కాని ఆ యువతి తండ్రి, సోదరుడిని అక్కడే వదిలేశారు కాబట్టి వారు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ వెలుపల నిరాహార దీక్షలో కూర్చున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని తమకు ఇవ్వడం లేదని కుటుంబం ఆరోపించింది.

సామూహిక అత్యాచార బాధితుడి మరణ వార్త తెలిసిన తరువాత, ఢిల్లీ చేరుకున్నవందలాది మంది భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఆసుపత్రి వెలుపల ఆందోళన చేపట్టారు. కొంత సేపు రింగ్ రోడ్డు లో ట్రాఫిక్ అడ్డుకున్నారు.

నిరసనకారులకు నాయకత్వం వహించిన చంద్రశేఖర్ ఆజాద్ రావన్, పోస్టుమార్టం లో గందరగోళం చేస్తున్నారని ఆరోపిస్తూ పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రత్యేక వైద్యుల బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. బాలికపై అత్యాచారం జరిగింది కాబట్టి ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు తన ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ఢిల్లీ పోలీస్ ముర్దాబాద్, యోగి సర్కార్ ముర్దాబాద్ అని నినాదాలు చేశారు. నిరసనకారులను నియంత్రించడానికి సిఆర్‌పిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పిలిచారు. ప్రజల నిరసన ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వెలుపల భద్రతను పెంచారు. పరిస్థితిని నియంత్రించడానికి ఢిల్లీ పోలీసులతో పాటు, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని కూడా ఆసుపత్రిలో నియమించారు.
మరో వైపు పోలీసులు బాధితరాలి కుటుంభ్యులను ఇంట్లో పెట్టి వాళ్ళు బైటికి రాకుండా ఇంటికి తాళం వేసి తెల్లవారుజామున 2.30కి ఆమె మృతదేహాన్ని దహనం చేశారు.

Keywords : uttarapradesh, yogi adityanath, dalit girl, rape, police
(2020-10-26 10:28:29)No. of visitors : 403

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

Search Engine

సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
more..


దళిత