హత్రాస్ బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్న జిల్లా మెజిస్ట్రేట్ -వీడియో వైరల్


హత్రాస్ బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్న జిల్లా మెజిస్ట్రేట్ -వీడియో వైరల్

ఉత్తరప్రదెశ్ లోని హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య‌ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అసలు అత్యాచారం జరగలేదని, వెన్నెముక విరగలేదని, నాలుక కోసేయలేదని అధికారులు, బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది అంటూ యూపీ పోలీసు ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వైపు బాధితురాలు కుటుంబంపై బెదిరింపులకు దిగుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే కాదు సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్ బెదిరిస్తున్నాడు. బాధితురాలి కుటుంబాన్నిజిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ లష్కర్ బెదిరింపులకు గురి చేస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్‌ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం చూడవచ్చు. జిల్లా మేజిస్ట్రేట్ ʹʹ ఈ మీడియా వాళ్లు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్తారు. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. స్టేట్‌మెంట్‌ను మార్చడం.. మార్చకపోవడం మీ ఇష్టం. కానీ మేం మార్చగలంʹʹ అన్నారు. ఇంతలో బాధితురాలి బంధువు ఒకరు కెమరా వైపు చూసి ఏడుస్తూ.. ʹʹవారు మాపై ఒత్తిడి తెస్తున్నారు. మీ కుమార్తె కరోనాతో చనిపోయి ఉంటే కనీసం పరిహారం అయినా దక్కేది అంటున్నారు. మా తండ్రిని, మమ్మల్ని బెదిరిస్తున్నారుʹʹ అంటూ వాపోయింది.

ʹʹఅంతేకాక వారు మా తల్లి వీడియోలు తయారు చేశారు. వీటిని చూపిస్తే.. కేసు క్లోజ్‌ అవుతుంది అంటున్నారు. వారు మమ్మల్ని ఇక్కడ బతకనివ్వరు. డీఎం మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తెస్తున్నారు.. బలవంతం చేస్తున్నారుʹʹఅంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్‌డీటీవీ, ఇండియా టుడేల్లో ప్రసారం చేశారు.

Keywords : uttarapradesh, hatras, rape, district magistrate, Hathras DM Praveen Lashkar Threatens Victimʹs Family
(2020-10-26 19:56:39)No. of visitors : 585

Suggested Posts


0 results

Search Engine

సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
more..


హత్రాస్