పోలీసుల సాక్షిగా హత్రాస్ బాదితులను బెదిరిస్తున్న ఠాకూర్లు
యూపీలోని హత్రాస్ సంఘటన ప్రకంపనలు ఆగడం లేదు. అగ్ర కుల ఠాకూర్లు దళిత బాలికపై అత్యాచారం చేసి, వెన్నెముక విరిచి, నాలుక కోసి చివరకు హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కలగచేస్తుండగా యూపీ ప్రభుత్వం, అధికారులు ఈ కేసును బలహీనపర్చే చర్యలు చేపట్టగా అగ్రకుల ఠాకూర్లు, వారికి మద్దతుగా నిల్చిన మిగతా అగ్రకులాలు బాధిత కుటుంబాన్ని బెదిరించడం, దోషులకు మద్దతుగా ఊరేగింపులు తీయడం...ఏకంగా ఓ బీజేపీ నాయకుని ఇంట్లోనే సమావేశాలు పెట్టడం చేస్తున్నారు. అక్కడ పోలీసులు ఉండగానే వారి ఎదురుగానే ఠాకూర్లు బాధితులను బెదిరిస్తుంటే పోలీసులు మౌన ప్రేక్షకులయ్యారు.
నిన్న హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పట్ల కొందరు ఠాకూర్లు దుర్భాషలతో రెఛ్చిపోయారు. పోలీసుల ముందే వారు అసభ్యంగా మాట్లాడుతున్నా ఖాకీలు ప్రేక్షక పాత్ర వహించారు. హత్రాస్ ఘటనపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ బదులు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలన్న ఆజాద్ వ్యాఖ్యను వారు తప్పు పడుతూ నువ్వు ఇక్కడికి రాజకీయాలు చేయడానికి వచ్చావా..నీచేత సీబీఐ విచారణకు ఎలా ఒప్పించాలో మాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఎన్ని దెబ్బలైనా ఎదుర్కొనేందుకు ఠాకూర్లు రెడీగా ఉన్నారని, నీ ʹపెద్దన్నలుʹ ఇక్కడే ఉన్నారని ఛాలెంజ్ చేశారు. నలుగురు అనుమానితుల అరెస్టుకు హత్రాస్ కుటంబానిదే బాధ్యత అని ఆ ఫ్యామిలీని కూడా పరోక్షంగా హెచ్ఛరించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఠాకూరు గూండాలను ఆపే ప్రయత్నం చేయలేదు.
దీనిపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ʹనిందితులకు మద్దతుగా ఎలాంటి సమావేశాలు జరిపినా చర్యలు ఉండవు. బాధితురాలి కుటుంబం ప్రమాదంలో ఉంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించండిʹ అని డిమాండ్ చేశారు.
ఇక గ్రామంలోని ఉన్నత కులస్తులు రాష్ట్రీయ సావర్న్ పరిషత్ అధ్వర్యంలో సమావేశం అయ్యారు. బాధితురాలి కుటుంబం సదరు వ్యక్తుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పైగా బాధితుల ఇంటి ముందు చేరి హెచ్చరికలు జారీ చేయడం, రెచ్చగొట్టడం చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అయితే హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరమార్సించడానికి వెళ్ళిన భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పై, మరో 500 మందిపై మాత్రం కేసులు నమోదు చేశారు. ఈ రకమైన చర్యల వల్ల ప్రభుత్వ ఎవరివైపు ఉందో అర్దమవుతోందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Keywords : hathras, uttarapradesh, thakurs, dalit, chandrashekhar azad, police
(2021-04-11 02:47:35)
No. of visitors : 343
Suggested Posts
| హత్రాస్ వెళ్లాలనుకోవడమే అతడి నేరంహత్రాస్ వెళ్లేందుకు యత్నించిన మళయాళీ పాత్రికేయుడు సిద్ధికీ కప్పన్‌తో పాటు మరో ముగ్గురిని సోమవారం యూపీ పోలీసులు అరెస్టు చేసి Unlawful Activities (Prevention) Act (యూఏపీఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. |
| హత్రాస్ సంఘటన : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమకుందన్నజిల్లా మెజిస్ట్రేట్
అత్యాచారం, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని నిర్భందించి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడంపై హత్రాస్ దారుణంపై అలహాబాద్ హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిథల్ మరియు జస్టిస్ రాజన్ రాయ్ డివిజన్ బెంచ్ రెండు గంటల విచారణలో బాధితుడి కుటుంబం మరియు వివిధ ప్రభుత్వ అధికారులను వాదనల్ని విన్నది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది.
|
| దళితులపై అగ్రకుల మనువాద దాడులను ప్రతిఘటిద్దాం - కుల నిర్మూలనా పోరాట సమితి పిలుపుఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా బుల్ గడి గ్రామంలో 20 బ్రాహ్మణ,వంద భూస్వామ్య ఠాకూర్ కుటుంబాలు,కేవలం నాలుగు దళిత కుటుంబాలు వ్యవసాయ రైతుకూలీలుగా జీవిస్తున్నారు.19 ఏళ్ల దళిత యువతి మనీషాను ఠాకూర్ కులానికి చెందిన నలుగురు మృగాళ్ళు |
| వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మృతి |
| వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన నెటిజనులు |
| దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు... |
| ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు |
| కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు |
| ఏప్రిల్ 26 భారత్ బంద్ ను జయప్రదం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ పిలుపు |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు |
| Chattisghar Encounter: Maoist Party released a Letter |
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే - కే.కేశవరావు |
| అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ |
| లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి |
| సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత
|
| ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
|
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages |
| శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్ |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
|
| విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
|
| టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
|
| సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్ |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
|
| Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists |
more..