టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ


టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ

టీఆర్‌పీ

రిప‌బ్లిక్ టీవీ నెంబ‌ర్ వ‌న్ ఛానెల్ కాద‌ట‌. అడ్వ‌ర్‌టైజ్‌మెంట్‌ల కోసం టీఆర్‌పీల‌ను తారుమారు చేస్తోంద‌ట‌. ఈ మాట చెప్పిందెవ‌రో కాదు. స్వ‌యంగా ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ వెల్ల‌డించిన విష‌యం. టీఆర్‌పీల‌ను తారుమారు చేసి ఆధాయం గ‌డిస్తున్న మూడు టీవీ ఛానెళ్ల గుట్టును ముంబై పోలీసులు ర‌ట్టు చేశారు. టిఆర్‌పిల తారుమారులో రిపబ్లిక్ టీవీ సహా మ‌రో రెండు టీవీ ఛానెల్స్ ప్ర‌మేయ‌మున్న‌ట్లు ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌రంబీర్ సింగ్ తెలిపారు. కుంభ‌కోణానికి పాల్ప‌డిన రిప‌బ్లిక్ టీవీతో పాటు మ‌రో రెండు మ‌రాఠీ ఛాన‌ళ్ల‌ బ్యాంక్ ఖాతాలను పరిశీలించి స్వాధీనం చేసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే ఫ‌క్త్ మ‌రాఠీ, బాక్స్ సినిమా ఛానెల్స్ య‌జ‌మానుల‌ను అరెస్టు చేసిన పోలీసులు రిప‌బ్లిక్ టీవీ అధినేత అర్ణ‌బ్ గోస్వామిని సైతం అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. టీఆర్‌పీ రాకెట్‌లో రిప‌బ్లిక్ టీవీ డైరెక్ట‌ర్లు, సిబ్బంది పాత్ర‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతుతోంద‌ని సింగ్ వెల్ల‌డించారు.

హిందీ న్యూస్ ఛానెల్ టీఆర్‌పీలో ఆజ్ త‌క్‌ను వెన‌క్కినెట్టి నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్న‌ట్లు రిప‌బ్లిక్ ద‌ర్శ‌న్ ఇటీవ‌లే ప్ర‌క‌టించుకుంది. టీవీ ఛానెళ్ల అడ్వ‌టైజ్‌మెంట్‌ల ఆధాయం వేల కోట్ల‌లోఉంటుంద‌ని, టీఆర్‌పీల‌ను త‌ప్పుగా సృష్టించ‌డం ద్వారా పొందిన ఆధాయాన్ని నేరాల ద్వారా వ‌చ్చిన ఆధాయంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని సింగ్ తెలిపారు.

టీఆర్పీ తారుమారు ద్వారా డబ్బును పొందిన ప్రకటనదారులందరినీ విచార‌ణ కోసం పిలుస్తామ‌ని తెలిపారు. టీఆర్‌పీల తారుమారు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న రిపబ్లిక్ టీవీతో సహా మూడు టీవీ ఛానెళ్ల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. టీవీ ఛానెల్స్ వారి టీ ఆర్పిలను పెంచడానికి టీఆర్‌పీ టూల్ బాక్స్ (బ్యారో మీట‌ర్‌)ల‌ను ఉంచిన‌ ఇంటి య‌జ‌మానుల‌కు డ‌బ్బులు చెల్లించిన‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. ప్రతి ఇంటికి ప్రతి నెలా రూ .400-500 వరకు చెల్లించార‌ని, ఈ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు ఇప్పటికే విచారించార‌ని తెలిపారు. కాగా... ముంబై పోలీసు కమిషనర్‌పై పరువు నష్టం కేసు పెడతామని బెదిరిస్తూ గోస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు.

Keywords : Republic tv, aaj tak, TRP, Mumbai, Police, Arnab Goswami, Arrest
(2020-11-30 02:48:00)No. of visitors : 281

Suggested Posts


0 results

Search Engine

రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
యుపి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు: వాకిట్లో గెస్టపో
సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
more..


టీఆర్‌పీ