భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌


భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్‌ఐఏ చార్జిషీట్‌

భీమా

10,000 పేజీలకు పైగా వున్న ఈ చార్జిషీట్ లో మొత్తం ఎనిమిది మంది కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) భావజాలాన్ని మరింత వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

2018లో భీమా కోరెగావ్‌లో హింసను ప్రేరేపించారనే ఆరోపణతో గౌతమ్ నవలఖా, ఆనంద్ తేల్తుంబ్డే, 83 ఏళ్ల స్టాన్ స్వామి, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హనీ బాబుతో సహా ఎనిమిది మంది కార్యకర్తలపై జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది.

జనవరిలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ దాఖలు చేసిన తొలి చార్జిషీట్ ఇది. ఎల్గర్ పరిషత్ కేసుకు సంబంధించి కార్యకర్తలపై పూణే పోలీసులు ఇంతకుముందు రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. చార్జీషీట్‌ను ముంబైలోన నియమించబడిన కోర్టు ముందు సమర్పించినట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సోనియా నారంగ్ తెలిపారు.

చార్జిషీట్లో పేర్కొన్న ఇతరులు, కబీర్ కళా మంచ్ ముగ్గురు కళాకారులు, సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్, అతని భార్య జ్యోతి జగ్తాప్, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే. మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్, మేధావి ఆనంద్ టెల్టుంబే సోదరుడు మిలింద్ తేల్తుంబ్డే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.

ఈ కేసులో మిగతా వారిని ఇంతకు ముందే అరెస్టు చేయగా, వారెంట్ లేకుండానే రాంచీలో గురువారం రాత్రి ఫాదర్ స్టాన్ స్వామిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీ నుంచి స్వామిని ముంబైకి తీసుకువచ్చి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కోర్టుకు హాజరుపరిచారు. అక్టోబర్ 23 వరకు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలనే కోర్టు ఆదేశంతో తలోజా సెంట్రల్ జైలుకి పంపించారు.

భారతదేశంలో వినాశకర ప్రభావాన్ని చూపిన కరోనావైరస్ విపత్తు కాలంలో జనవరి నుంచి ఎన్‌ఐఏ అరెస్టులు చేసింది. గోర్ఖే, గైచోర్, జగ్తాప్‌లను సెప్టెంబర్ 8న, ఆనంద్ తేల్తుంబ్డే, నవలఖాలను ఏప్రిల్ 14న, జూలైలో హనీ బాబును అరెస్టు చేశారు. మొత్తం మీద, 16 మంది వ్యక్తులు - కార్యకర్తలు, న్యాయవాదులు, మేధావులు - జైలులో ఉన్నారు.

NIA దాఖలు చేసిన చార్జిషీట్ 10,000 పేజీలకు పైగా వుంది. మొత్తం ఎనిమిది మంది కార్యకర్తలు " మావోయిస్ట్ పార్టీ భావజాలాన్ని మరింతగా వ్యాప్తి చేయడానికి ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నారని" ఆరోపించారు. నేరపూరిత కుట్ర, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నివారణ) చట్టంలోని సెక్షన్ల కింద భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు.

తమ దర్యాప్తులో ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా కోసం పనిచేస్తున్న మావోయిస్టుల ʹక్రమబద్ధమైన నెట్‌వర్క్ʹ బయటపడిందని NIA పేర్కొంది. ఈ నెట్‌వర్క్, మావోయిస్టు క్యాడర్, భారతదేశం లోపల, బయటా ఉన్న ఇతర నిషేధిత సంస్థలతో "సంబంధాలు" కలిగి ఉందని ఏజెన్సీ పేర్కొంది.

మావోయిస్టులు తమ ప్రజాసంఘాల‌ ద్వారా "పట్టణ ప్రాంతాల్లో విప్లవం" చేయడానికి అనుసరించిన వ్యూహం, ఎత్తుగడలు కూడా బహిర్గతమయ్యాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని మావోయిస్టు కేడర్, వారి సానుభూతిపరులలో మావోయిస్టు కార్యకలాపాలను నిర్వహించడానికి నిధుల సేకరణ కార్యకలాపాలు బయటికి వచ్చాయి" అని ఎన్ఐఏ తెలిపింది.

ఆరోపణలు

ʹʹభీమా కోరేగావ్ శౌర్య దిన్ ప్రేరానా అభియాన్ʹʹ బ్యానర్ క్రింద , 2017 డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ జరిపిన కార్యక్రమ ప్రధాన కన్వీనర్లలో ఆనంద్ తేల్తుంబ్డే ఒకరని ఎన్ఐఏ తెలిపింది. కార్యక్రమం జరిగిన రోజున శనివార్ వాడా వద్ద ఆయన ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు, నవలాఖాకు, "భారత ప్రభుత్వ బలగాలను శారీరకంగానూ, ఇతరత్రా కూడా ఓడించడానికి మేధావులను ఏకం చేసే కర్తవ్యం", నిషేధించబడిన మావోయిస్టు పార్టీలోకి సభ్యులను చేర్చే పని కూడా ఇవ్వబడిందని ఏజెన్సీ చార్జిషీట్ పేర్కొంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌ తో నవ్‌లాఖా సంప్రదింపులు జరుపుతున్నారని కూడా ఎన్‌ఐఏ ఆరోపించింది.

ఎన్ఐఏ ప్రకారం హనీ బాబు, మావోయిస్టు ప్రాంతాలకు విదేశీ జర్నలిస్టుల సందర్శనలను ఏర్పాటు చేసే పనిని నిర్వహిస్తున్నారు. ఈశాన్య ప్రాంతంలో నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు ఏజెన్సీ తెలిపింది. మావోయిస్టు సంబంధాల ఆరోపణలపై 2014 నుండి జైలులో ఉన్న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విడుదల కోసం బాబు "చురుకుగా ప్రయత్నిస్తున్నాడు" అని ఎన్ఐఏ ఆరోపించింది.

గోర్ఖే, గైచోర్, జగ్తాప్ "మావోయిస్టు కుట్రను మహారాష్ట్ర అంతటా చురుకుగా ప్రచారమూ, కుట్ర చేశారని" ఆరోపించారు. కబీర్ కళా మంచ్ సిపిఐ-మావోయిస్టుల ప్రజా సంఘం అని కూడా ఎన్ఐఏ ఆరోపించింది

ఇంతవరకు చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నివారణ) చట్టం ప్రకారం అభియోగాలు మోపబడిన వారిలో అందరి కంటే వృద్ధుడైన స్వామిపై, సిపిఐ (మావోయిస్ట్) కార్యకలాపాలలో "చురుకుగా పాల్గొన్నాడు" అని దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ తెలిపింది. సిపిఐ (మావోయిస్టు) సాహిత్యం, ప్రచార సామగ్రి, పత్రాలు అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

ఆ పార్టీ ఎజెండా అమలును సులభం చేయడానికి స్వామి అసోసియేట్ ద్వారా నిధులు కూడా అందుకున్నారని ఏజెన్సీ ఆరోపించింది. అంతేకాకుండా, అతను కన్వీనర్ గా వున్న పీడిత ఖైదీల సంఘీభావ కమిటీ (పిపిఎస్సి), సిపిఐ (మావోయిస్ట్) యొక్క ఫ్రంటల్ సంస్థ అని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు.

తన అరెస్టును స్వామి ముందుగానే ఊహించారు. రెండు రోజుల క్రితం, విపత్తు సమయంలో విచారణ కోసం ఎన్‌ఐఏ అధికారులు తనను ముంబైకి రమ్మని బలవంతం చేస్తున్నట్లు చెప్పిన వీడియోను రికార్డ్ చేశారు. అరెస్టుకు కొన్ని గంటల ముందు విడుదల చేసిన మరో లిఖిత సందేశంలో, జూలై 27 నుండి జూలై 30 వరకు, ఆపై ఆగస్టు 6 న ఐదు రోజుల వ్యవధిలో తనను 15 గంటలు కేంద్ర ఏజెన్సీ విచారించిందని చెప్పారు.

కేసు

2018 జనవరి 1 నాడు పూణే సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, మరాఠాల మధ్య జరిగిన హింసాకాండ జరిగిన మర్నాడు జనవరి 2 న దళిత సంఘాలు పిలిచిన బంద్ సందర్భంగా ఒకరు మరణించారు. 1818లో జరిగిన భీమా కోరెగావ్ యుద్ధ జ్ఞాపకార్థం పూణేలో ఎల్గర్ పరిషత్ కార్యక్రమం నిర్వహించిన ఒక రోజు తరువాత ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం కోసం పోరాడుతున్న దళిత మహర్ సైనికులు మరాఠా సామ్రాజ్యంలోని బ్రాహ్మణ పేష్వా పాలకులను ఓడించారు. హింసలో.

పూణే పోలీసులు 2018 ఏప్రిల్‌లో పలువురు కార్యకర్తల యిళ్లపై దాడి చేశారు, తరువాత 10 మంది కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని, రెండు దఫాలుగా అరెస్టులు చేశారు.

మొదటి చార్జిషీట్‌ను పూణే పోలీసులు 2018 నవంబర్‌లో దాఖలు చేశారు, ఇది 5,000 పేజీలకు పైగా ఉంది. ఇందులో 2018 జూన్‌లో అరెస్టు చేసిన కార్యకర్తలు సుధీర్ ధవాలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, మహేష్ రౌత్ ల పేరు పెట్టారు. అరెస్టు చేసినవారికి నిషేధిత మావోయిస్ట్ పార్టీ తో "క్రియాశీల సంబంధాలు" ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడిని చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

మానవ హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, అరుణ్ ఫెర్రెరా, వర్నాన్ గోన్సాల్వ్స్, మావోయిస్ట్ పార్టీ నాయకుడు గణపతిపై 2019 ఫిబ్రవరిలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులపై "దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం" సిపిఐ (మావోయిస్ట్) భావజాలాన్ని వ్యాప్తి చేయడం, సమాజంలో కుల సంఘర్షణలు, ద్వేషాలను సృష్టించడం వంటి అభియోగాలు మోపారు.

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఓడిపోయిన తరువాత జనవరిలో కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేసింది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం 2019 నవంబర్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

Keywords : bhimakoregoun, stan swamy, anand teltumde, gaoutham navalakha
(2020-10-28 02:44:46)No. of visitors : 200

Suggested Posts


భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్

భీమాకోరేగావ్ (ఎల్గర్ పరిషద్) కేసులో ఈ రోజు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హానీ బాబును ఎన్నైఏ పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC

భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీ బాబును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముంబయిలో అరెస్టు చేయడాన్నిరాజ్య అణచివేత వ్యతిరేక కేంపెయిన్ (సిఎఎస్ఆర్) ఖండిస్తూంది. ఢిల్లీ, ముంబైలలో COVID-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, NIA ఢిల్లీ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ బాబును సాక్షిగా రమ్మని పిలవడంతో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడే

ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్

భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేయబడ్డ జార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామితో సహా మొత్తం 16 మంది సామాజిక, హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ

భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న‌‌ శరద్ పవార్

జనవరి 1, 2018 న భీమా కోరెగావ్‌లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అవకాశంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తోంది. ఈ విషయం చర్చించడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ సెప్టెంబర్ 10 న ముంబైలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Search Engine

సాంప్రదాయక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ ను ముట్టడించి గ్రామస్తుణ్ణి విడిపించుకున్న‌ ఆదివాసీలు
శిక్ష పడకుండానే... ప‌న్నెండేండ్లుగా జైలులోనే మ‌గ్గుతున్న 78 మంది
బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం... అమాయకులను జైళ్ళపాలు చేస్తున్నారన్న హైకోర్టు
జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం
ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన
సాయుధ గాన గంగాధరుడే ప్రభాకరుడు - వరవరరావు
డాక్టర్ సాయిబాబా డిమాండ్లకు అధికారుల అంగీకారం...నిరహార దీక్ష నిర్ణయం విరమణ‌
NAGPUR CENTRAL JAIL AUTHORITIES ACCEPT DR. G. N. SAIBABA DEMANDS
ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్
ప్రొఫెస‌ర్ సాయిబాబా నిరాహార దీక్ష‌ను ఆపండి - జైలు సూపరింటెండెంట్ కు హ‌ర‌గోపాల్ లేఖ‌
అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?
నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల వివరాలు ప్రకటించిన పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC
పోలీసు క్యాంపులు వద్దు..బడులు,ఆస్పత్రులు కావాలంటూ రహదారులు తవ్వేస్తున్న ఆదివాసులు
కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌
ఎన్ ఐ ఎ (NIA) సిబ్బందికి ఒక సామాజిక కార్యకర్త బహిరంగలేఖ!
హత్రాస్ సంఘటన‌ : అర్ధరాత్రి అంత్యక్రియలు చేసే అధికారం తమ‌కుందన్నజిల్లా మెజిస్ట్రేట్
పౌరహక్కుల సంఘం నాయకుడు, మార్క్సిస్టు మేధావి ప్రొ. శేషయ్యకు నివాళి -విరసం
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
టీఆర్‌పీ స్కాంలో రిప‌బ్లిక్ టీవీ
హ‌త్రాస్ వెళ్లాల‌నుకోవ‌డ‌మే అత‌డి నేరం
మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
more..


భీమా