కామ్రేడ్ శేష‌య్య మరణం ప్రజా ఉద్యమాలకు తీవ్ర నష్టం- మావోయిస్టు పార్టీ ప్రకటన‌

కామ్రేడ్

పౌరహక్కుల సంఘ నాయకుడు, రెండు తెలుగు రాష్ట్రాల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కామ్రేడ్ శేషయ్య అమరత్వం సందర్భంగా సంతాపం తెలిఅయజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), కేంద్ర రీజినల్ బ్యూరో విదుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
కేంద్ర రీజినల్ బ్యూరో పత్రికా ప్రకటన
అక్టోబర్ 15, 2020

విప్లవ మేధావి, ప్రజాస్వామిక వాది, పార‌హక్కుల ఉద్యమనేత, ప్రజల శ్రేయోభిలాషి, కామ్రేడ్ శేషయ్య‌ మరణానికి మా ప్రగాఢ‌ సంతాపాన్ని తెలియచేస్తున్నాం. ఆయనకు మా విప్లవ‌ జోహార్లు
కామ్రేడ్ శేషయ్యసార్ మరణంపట్ల ఆయన కుటుంబానికి మిత్రులకు మా పార్టీ కేంద్ర రీజనల్ బ్యూరో ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది.
ఆయన కొద్ది రోజులుగా అస్వస్థతో ఉంటూ అక్టోబర్10న తన 64వ ఏట తుది శ్వాస విడిచారు. ఆయన మరణం దేశంలో విప్లవ, ప్రజాస్వామిక, పౌరహక్కుల, ప్రగతిశీల, పీడిత‌ జాతుల ఉద్యమాలకు, ప్రజాహితం కోసం జరుగుతున్న ఉద్యమాలకు తీవ్ర‌మైన నష్టం. ఈ నష్టం వెంటనే పూర్చుకోలేనిది కూడా.
శేషయ్య‌ విద్వార్థి దశ‌లోనే విప్లవ‌ రాజకీయాలకు ఆకర్షితులైనారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనంలా ఉవ్వెత్తున ఎగ‌సిపడుతున్న విప్లవ‌ విద్యార్థి ఉద్యమానికి నేతృత్వం వహించిన రాడికల్ విద్యార్జీ సంఘంలో చేరి, అనతికాలంలోనే దాని తొలి. ఉపాధ్యక్షుడయ్యారు. ఆర్.ఎస్.యుకు నేతృత్వ భాధ్యత చేపట్టిన శేషయ్య‌ ఆనాటి విద్యార్థి ఉద్యమాన్ని కేవలం విద్యార్థి సమస్యలకు పరిమితం చేయకుండా, మొత్తం సమాజంలో మౌలిక మార్పుకోసం జరిగి ఉద్యమంగా మలచడంలో కూడా ముఖ్యమైన భూమికను పోషించారు.
శేషయ్య తన చదువు పూర్తి అయిన తర్వాత, తన సొంత జిల్లా కర్నూల్ ను వదిలి, అనంతపూర్ లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సీలలో డీన్ గా కొలువులో చేరాడు. ఆయన ఆచార్య (ప్రోఫెనర్) వృత్తిని చేపట్టిన తర్వాత కూడా తన సామాజిక బాధ్యతను ఒక్క క్షణం కూడా మరచిపోలేదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉద్యమంగా కొనసాగుతున్న పౌరహక్కుల ఉద్యమంలో చేరి అందులో చురుకైన పాత్రను నిర్వహించాడు. క్రమంగా ఆంధ్ర ప్రదేశ్ సారహక్కుల సంఘానికి కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కీలకమైన బాధ్యతలు చేపట్టారు.
1990 దశకంలో రాష్ట్ర పౌరహక్కుల ఉద్యమంలో, ముఖ్యంగా హక్కుల దృక్పథంలో తలెత్తిన మితవాద‌ వైఖరులను ఎదుర్కోవడంలో నాయకత్వ పాత్రను పోషించాడు. అంతేకాదు, హక్కుల ధృక్పథాన్ని సమాజంలోని ఆధిపత్య వ్యవస్థలుగా ఉన్న భూస్వామ్యం, వక్రీక‌రించిన పెట్టుబడిదారీ విధానం. కుల వ్యవస్థ, పితృస్వామ్యం వంటి వాటితోపాటు, వీటికి సేవ చేస్తూ, మద్దతుగా ఉన్న రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా నిలబెట్టి అభివృద్ధి పరిచాడు. సమాజంలోని అధిప‌త్వ వ్యవస్థలతోపాటు, రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాస్వామిక, విప్లవ పోరాటాలకు మద్దతుగా, వాటితో విడ‌దీయరాని ఉద్యమంగా పౌరహక్కుల ఉద్యమాన్ని మలిచాడు. దోపిడీ పునాదులపై ఏర్పడిన మనదేశ అర్ధవలస‌, అర్థభూస్వామ్య సమాజాన్ని దాని రాజ్యాంగ యంత్రాన్ని సామరస్య ధోరణిలో ప్రజాస్వామికరించవచ్చనే లిబరల్ ప్రజాస్వామిక దృక్పథం నుంచి స్పష్టమైన విభజన రేఖ గీసి సౌరహక్కుల ఉద్యమానికి పోరాట దృక్పదాన్ని ఏర్పరిచాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కామ్రేడ్ శేషయ్య నేతృత్వంలో పౌరహక్కుల ఉద్యమం స్పృశించని సమస్య లేదంటే ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ సమస్య మొదలు, నీరు, దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళా, రాజ్యహింస‌ వరకు అనేక సమస్యలపై పౌరహక్కుల సంఘం పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలిచింది. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజా సమస్యలపై రాజ్య నిర్భంధం పై ఏర్పడిన అనేక ఐక్య‌ వేదికలకు ప్రారహక్కుల సంఘం నేతృత్వం వహించింది. అంతేకాదు దేశ వ్యాపితంగా ఏర్పడిన హక్కుల సంఘాల ఐక్య‌వేదిక (సీ డి.ఆర్.ఒ.)లో కీలకమైన పాత్ర పోషించింది. ప్రస్తుతం అదే భూమికను పోషిస్తున్నది. సంస్థ నిర్వహిస్తున్న ఈ మొత్తం ప్రగతిశీల‌, ప్రజాస్వామిక కార్యకలాపాలలో సంస్థ‌ నాయకుడుగా శేషయ్య నిర్వహించిన పాత్ర అత్యంత కీలకమైనది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శేషయ్య రెండు రాష్ట్రాల కో-ఆర్డినేషన్ కమిటీని జాతీయ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టి, పౌరహక్కులు ఉద్యమాన్ని మరింతగా పటిష్టం చేసేందుకు కృషి చేసాడు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని తుదిశ్వాస విడిచారు.
దేశంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం రోజు రోజుకు పెచ్చరిల్లుతూ, ప్రజల ప్రజాస్వామిక, పౌరహక్కులకు మరింత విఘాతం కలిగిస్తున్న పరిస్థితుల్లో కామ్రేడ్ శేష‌య్య మరణం దేశంలోని ప్రజాస్వామిక పారహక్కుల ఉద్యమాలతో పాటు అన్ని ప్రజా ఉద్యమాలకు తీవ్రమైన నష్టమే. అటువంటి పరిస్థితులలోనే కామ్రేడ్ శేషయ్య‌ స్ఫూర్తితో... నేడు దేశంలో తీవ్రతరమవుతున్న మోదీ నేతృత్వంలోని బ్రాహ్మణవాద హిందూ ఫాసిజానికి, అది సేవ చేస్తున్న‌ సామ్రాజ్యవాద నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో భాగం కావాల్సిందిగా మా కేంద్ర రీజనల్ బ్యూరో ప్రజాస్వామిక వాదులకూ, ప్రగతిశీల కాముకులకూ, ప్రజల శ్రేయోభిలాషులకు విఙప్తి చేస్తున్నది.
భారత కమ్యూనిస్టు పార్టీ )మావోయిస్టు)

కేంద్ర రీజినల్ బ్యూరో

నోట్ - ప్రియమైన ఛీఫ్ ఎడిటర్ గారికి,
కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు మా పార్టీ పైనా, విప్లవోద్యమంమైన అమలు చేస్తున్న ఫాసిస్టు, చుట్టుముట్టి అణిచివేత దాడిలో, కొన్ని ముఖ్యమైన పరిణామాలను కొన్ని సందర్భాలలో సకాలంలో తెలుసుకోలేకపోతున్నాము. ఈ పరిమితివల్ల కామ్రేడ్ శేషయ్య‌ మరణ వార్తను సకాలంలో తెలుసుకోలేకపోయాము. దీంతో ఆయన మరణానికి సకాలంలో సంతాపం తెలియజేయక పోయాము. అందుకు చింతిస్తున్నాము. మాకుండే ఈ అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం మేము పంపుతున్న ఈ ప్రకటన పూర్తి పాఠాన్ని మీ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా విడుదల చేయగలరని ఆశిస్తున్నాం.

Keywords : మావోయిస్టు పార్టీ, కామ్రేడ్ శేషయ్య, అమరత్వం, ప్రొఫెసర్ శేషయ్య, పత్రికా ప్రకటన, పౌర హక్కుల ఉద్యమం, Com Seshaiah, Professor Seshaiah, Maoist Party, Press Release
(2024-04-25 03:16:51)



No. of visitors : 1137

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కామ్రేడ్