అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?


అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?

అర్దరాత్రి


రెండు రోజుల క్రితం ములుగు జిల్లా నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్, అంతకు ముందు ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్ కౌంటర్ల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ ఎన్ కౌంటర్ల తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు...తదితర వివరాలతో అమరుల బంధుమిత్రుల సంఘం విడుదల చేసిన ప్రకటన....

ములుగు జిల్లా నరసింహసాగర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 18న బూటకపు ఎన్‌కౌంటర్ పేర పోలీసులు ఇద్దరు మావోయిస్టులను కాల్చేశారు. వారిలో ఒకరు ములుగు ఏరియా కమిటీ కార్యదర్శి కా. సుధీర్, మరొకరు దళ సభ్యుడు కా. లక్మా. పోలీసులు వీరిపై ఏక పక్షంగా కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్ గా ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల పేర్లు ప్రకటించడంలో కూడా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. పేర్లు, వారి స్వగ్రామాలు తదితర వివరాలు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయలేదు. సోమవారం ములుగు మార్చురీ దగ్గరికి వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులకు మృతదేహాలను చూసే అవకాశం ఇవ్వలేదు. కనీసంగా మృతుల వివరాలు కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు జరిగిపోయేలా కుటుంబసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.
తెలంగాణలో బూటకపు ఎన్‌కౌంటర్ హత్యాకాండలో భాగమే ములుగు ఘటన. లాక్ డౌన్ మొదలయ్యాక తెలంగాణలో విప్లవోద్యమం మీద నిర్బంధం తీవ్రమైంది. కొవిడ్ పేరుతో ప్రజా జీవితం స్థంభించి పోయిన తరుణంలో కూడా వేలాది సంఖ్యలో కూంబింగులు కొనసాగుతున్నాయి. ఆదివాసీ గ్రామాల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. డీజీపీ స్థాయి అధికారి జిల్లా కేంద్రాల్లో మకాం వేసి ఎన్ కౌంటర్ హత్యలకు పథకం రూపొందించి అమలు చేస్తున్నారు. ఇది గోప్యంగా జరగడం లేదు. పదే పదే మీడియాలో ఈ విషయాలు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 7, 8, 19, 23 తేదీల్లో తెలంగాణలో ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిలో 10 మంది విప్లవకారులను కాల్చేశారు. వీటిలో ఒక్కటి కూడా ఎదురు కాల్పుల ఘటన కాదు. అన్ని ఘటనలూ విప్లవకారులను, ప్రజలను పట్టుకొని కాల్చేసినవే. ఎన్ కౌంటర్ మృతదేహాల స్వాధీనానికి, అంత్యక్రియలకు అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యులు వెళ్లనివ్వడం లేదు. ఈ సంవత్సరం మార్చి నెలలో అమరుడైన జాడ వీరాస్వామి అంత్యక్రియలకు వెళుతున్న బంధుమిత్రుల సంఘం సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి అంత్యక్రియలు చేయించారు. జులై మొదటివారంలో అమరుడైన అభిలాష్ అంత్యక్రియలకు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు, చుట్టుపక్కల అమరుల కుటుంబ సభ్యులు వెళ్లినప్పుడు వాళ్లు ఊరి నుంచి వెళ్లిపోతేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఊరి బయటే అపేశారు. ఆ రాత్రంతా ఊళ్లోని ప్రతి ఇల్లూ గాలించారు. మృతుల కుటుంబ సభ్యుల మీద ఇట్లా ఒత్తిడి తెచ్చే పద్ధతిని కూడా ఇటీవల అనుసరిస్తున్నారు. ఈ రెండు నెలల్లో ఎన్ కౌంటర్లలో చంపేసిన వాళ్ల పేర్లు, ఫొటోలు పత్రికలకు ఇవ్వకపోవడమేగాక కుటుంబాల మీద ఒత్తిడి తెచ్చి హడావిడిగా అంత్యక్రియలు జరిపించాక మృతుల వివరాలు బహిర్గతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్‌కౌంటర్ ఘటన దగ్గరికి పాత్రికేయులను కూడా వెళ్లనివ్వడం లేదు. దీంతో అసలు ఏం జరిగిందో బైటికి తెలియడం లేదు.
రాజ్యహింస ఎన్‌కౌంటర్ల రూపంలోనే కాదు, హత్యాకాండ తర్వాత ఇన్ని రూపాల్లో పెరిగిపోతున్నది. విప్లవకారుల శవాల స్వాధీనంలో అమరుల బంధుమిత్రుల సంఘం పాత్ర ఉంటే, అంత్యక్రియల్లో పాల్గొంటే విప్లవకారుల త్యాగ నిరతి ప్రజలకు అర్థమవుతుందని, పోలీసుల చిత్రహింసల హత్యాకాండ కూడా ప్రజలు గ్రహిస్తారని ప్రభుత్వం అందోళన పడుతోంది. దీన్ని అడ్డుకోడానికే ఇలాంటి పద్ధతులకు పోలీసులు పాల్పడుతున్నారు. ఈ ఎన్ కౌంటర్లలో అమరులవుతున్నది ఆదివాసులు కావడం వల్ల ఈ హత్యాకాండతోపాటు ఆ తర్వాత ఆ కుటుంబాలపై అమలువున్న నిర్బంధం కూడా బైటికి తెలియడం లేదు.
అంత మాత్రాన ప్రభుత్వ దుర్మార్గం మరుగునపడిపోదు. అమరుల త్యాగాలు ప్రజలకు తెలియకుండా పోవు. ములుగు ఎన్ కౌంటర్ లో ప్రాణత్యాగం చేసిన సుధీర్, లక్మాల అమరత్వం శాశ్వతమైనది. వారికి అమరుల బంధుమిత్రుల సంఘం అరుణారుణ జోహార్లు చెబుతోంది. వాళ్ల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తోంది.
అంజమ్మ(అధ్యక్షురాలు)
శాంత(ఉపాధ్యక్షురాలు)
పద్మకుమారి(కార్యదర్శి)

Keywords : telangana, fake encounters, ABMS, Mulugu, maoists, police, kcr
(2020-12-03 18:04:20)No. of visitors : 898

Suggested Posts


మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్న

దశాబ్ద కాలంగా అమరుల బంధుమిత్రుల సంఘంలో క్రియాశీలకంగా, బాధ్యునిగా ఉంటూ ఈతరం వారికి అమరుల బంధుమిత్రుల సంఘం నేతగా సుపరిచితుడైనవాడు నర్సన్న. తుదిశ్వాస వరకూ నమ్మిన విలువల కోసం పోరాడుతూ ఆ విప్లవ కమ్యూనిస్టు సాంస్కృతిక విలువల ప్రతినిధిగా నిలిచినవాడు నర్సన్న.

Search Engine

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !
రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌
20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం
రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
more..


అర్దరాత్రి