జనతన సర్కార్ లో ఉత్కంఠభరిత ప్రయాణం... చివరి రోజు

జనతన

పొద్దున్నే నిద్ర లేచేసరికి వర్షం లేదు. ఆకాశం ప్రశాంతంగా ఉంది. ఓ ఆదీవాసీ యువకుడు వచ్చి బయలుదేరుదాం అన్నాడు. కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరాం. ఈ సారి మేమొచ్చిన రెండు బైక్ లే కాక మరో బైక్ తీసుకొచ్చారు. మూడు బైక్ ల మీద బయలుదేరాం. ఓ ఆదివాసీ యువకుడు మా బైక్ నడుపుతున్నాడు. మళ్ళీ అదే బురద దారి... జానెడు పొలంగట్ల వెంబడి మా బైక్ లు పరుగులు తీస్తున్నాయి. వెళ్తుండగా దారిలో ఓ మావోయిస్టు దళం ఎదురైంది. వాళ్ళు దాదాపు ఓ పదిహేను మందుంటారు. అందరి భుజాలపై తుపాకులున్నాయి. వీపుకు కిట్ బ్యాగ్ లున్నాయి. వాళ్ళు నవ్వుకుంటూ మమ్ములను చూశారు. మమ్ములను తీసుకెళ్తున్న ఆదివాసీ యువకులకు పిడికిలెత్తి లాల్ సలామ్ చెప్పారు. మమ్ములను ఆపే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు మమ్ములను దాటి వెళ్ళి పోయారు. అలా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఓ పెద్దవాగొచ్చింది. అప్పటికే అక్కడ నాటు పడవ సిద్దంగా ఉంది. ఆ పడవ మీద ఓక్కో బైక్ ఎక్కించి అవతలి ఒడ్డుకు చేర్చడం మళ్ళీ ఇటు వచ్చి తీసుకెళ్ళడం... అలా నాలుగు ట్రిప్పుల్లో బైక్ లు మేము వాగు దాటాం. ఇక అక్కడినుండి మళ్ళీ వాగుల్లో ఒంకల్లో... అసలు దారే లేని దారుల్లో...బురదలొ పడుతూ లేస్తూ ...ప్రయాణం కొనసాగింది. మధ్యలో మాకు మామూలు డ్రస్సుల్లో ఉన్న ఓ ఎనిమిది మంది కనిపించారు. కొందరి భుజాలకు తుపాకులున్నాయి. మరికొందరి దగ్గర విల్లు,బాణాలున్నాయి. వాళ్ళు గ్రామ రక్షణ దళం అని మాతో వస్తున్న ఆదివాసీ యువకుడు చెప్పాడు. బైక్ లు దిగి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేసాం. అందరూ మమ్ములను అభిమానంగా చూస్తూ నవ్వుతున్నారు తప్ప మాభాష వాళ్ళకు రాదు. వాళ్ళ భాష మాకు రాదు. కానీ అందులో ఒక్కతనికి హిందీ రావడంతో కొద్దిసేపు మాట్లాడాం. వాళ్ళెక్కడికి పోతున్నారని ప్రశ్నించాం. వాళ్ళు చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలను కాపలా కాస్తారు. ఒక పక్క వ్యవసాయం పనులు చేస్తూనే పోలీసులు గ్రామాలమీద దాడి చేసినప్పుడు వారిని ఎదుర్కోవడం... గ్రామస్తులను రక్షించడం.... వాళ్ళ భాధ్యత. వాళ్ళలో ఓ ముగ్గురి దగ్గర మాత్రమే తుపాకులున్నాయి అవి కూడా అధునాతనమైనవి కావు. మరి వీళ్ళు పోలీసులను ఎదుర్కోవడం సాధ్యమా అనుమానం కలిగింది. అదే విషయాన్ని మాతో వస్తున్న ఆదివాసీ యువకుడిని అడిగాను. చాలా సార్లు వీళ్ళే పోలీసులను ముందుకు రాకుండా అడ్డుకుంటారని. వీరి దగ్గర ఉన్న ఆయుధాలతోనే వీళ్ళు వీరోచితంగా పోరాడుతారని అతను చెప్పాడు. అసలు పోలీసులను అడ్డుకోవడం ఎందుకని అడిగాను. పోలీసులు మా పంటలు నాశనం చేస్తరు, ఇళ్ళు కాలబెడతరు, మమ్ములను కొడ్తరు చంపుతరు అందుకే మా రక్షణ మేం చూసుకోవాలెకదా ! అన్నాడాయువకుడు. మరి పోలీసులు పెద్ద ఫోర్స్ వస్తే ఏం చేస్తరని అడిగితే గ్రామ రక్షణ దళాలు గ్రామానికి, దళాలకు సమాచారం ఇస్తాయి. గ్రామస్తులు గ్రామం విడిచి అడవిలోపలికి వెళ్ళి పోతారు. దళాలు పోలీసుల్;అను ఎదుర్కొంటాయని చెప్పాడు. మా సంభాషణంతా బైక్ మీద పోతుండగానే సాగింది. ఇంతలో మరో వాగొచ్చింది. నడుము లోతు నీళ్ళు ప్రవహిస్తున్నయ్. ఎక్కడ లోతుందో తెలియదు బైక్ లు ఎట్లా దాటించాలని ఆలోచిస్తుండగానే ఇందాకటి గ్రామ రక్షణ దళం వచ్చింది. ఆ వాగు ఎక్కడ లోతుందో ఎక్కడినుండి వెళ్తే సేఫ్ గా వెళ్తామో వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళ సహాయం తో బైక్ లతో సహా మేము వాగు దాటాం. మళ్ళీ ప్రయాణం. అలా ఓ రెండు గంటలు ప్రయాణించాక ఓ దగ్గర బైక్ ఆపిన మాతో వచ్చిన యువకుడు, ముందు పోలీసు స్టేషన్ ఉంది దాని ముందునుంచే పోవాలన్నాడు. మాకు షాక్... వచ్చేప్పుడు పోలీసు స్టేషన్ తగలలేదు కదా అని అడిగాను. ఇప్పుడు వేరే రూట్లో వస్తున్నామని చెప్పాడతను. మాకేమో అన్నీ ఒకే రూట్ల లాగున్నయ్. సరే చేసేదేముంది ముందుకు పోవాల్సిందే కదా ! బైక్ లు ముందుకు దూకాయి. కొద్ది సేపటికే ఓ గ్రామంలోకి ప్రవేశించాం. అది పెద్ద ఊరిలాగే ఉంది. ఊరి మధ్యలో నుండి అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్నాం. దూరంగా కొందరు వాలీ బాల్ ఆడుతూ కనిపించారు. వాళ్ళు పోలీసులని ఆ పక్కన కనపడుతున్న బిల్డింగ్ పోలీసు స్టేషన్ అని మా బైక్ డ్రైవర్ చెప్పాడు. రోడ్డుకు అడ్డంగా గేటులాగా ఓ కర్ర పెట్టి ఉంది. ఖచ్చితంగా అక్కడ దిగాల్సిందే. ఇక పోలీసులు రావడం మమ్ములను ఆపడం తప్పదనుకున్నా. మా డ్రైవర్ మాత్రం బైక్ ఆపకుండా వెళ్తూనే ఉన్నాడు. ఆ గేట్ లాంటి దాని పక్కనుండి సన్నని బాట ఉంది ఆ బాటలో బైక్ ఉరికించాడు. వాలీ బాల్ ఆడుతున్న పోలీసులు ఒక సారి మా వైపు చూసి మళ్ళీ వాళ్ళ ఆటలో నిమగ్నమైపోయారు. మేము దిగ్విజయంగా ముందుకు సాగాము. ఎప్పటి లాగానే వాగులు ఒంకలు దాటుకుంటూ... బురదలొ, పొలాల్లో మా ప్రయాణం సాగింది. ఇంకొద్ది దూరంలో రోడ్డు వస్తుందని మమ్ములను తీసుకొచ్చిన యువకుడు చెప్పాడు. అయితే తోవలో పోలీసులుండే అవకాశం ఉందని చెప్పాడు. ఇంతలో ఎదురుగా బైక్ మీద ఎవరో వస్తూ కనిపించారు. ఆ యువకుడు వాళ్ళను ఆపి పోలీసుల గురించి వాకబు చేశాడు. ముందు దాదాపు రెండు వందలమంది పోలీసులున్నారని, ఇటునుండి వెళ్ళే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. మేము మరికొంత ముందుకు వెళ్ళగానే ఒక ఊరు వచ్చింది. ముందు తోవ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అక్కడ ఆగాం. మాతో వచ్చిన ఆదివాసీ యువకులు మాకు వీడ్కోలు చెప్పి వెనక్కి వెళ్ళారు. ఇంతలో బోరున వాన మొదలైంది. మేం చెట్ల కిందికి పరిగెత్తాం. వాన పెరిగి అందరం తడిచి పోయాం. మరో వైపు సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుందేమో ప్రయత్నిస్తున్నాం. సిగ్నల్ దొరికితే తమ తమ ఆఫీస్ లకు ఫోన్ లు చేసి విషయం చెబుదామని అందరం ప్రయత్నం చేస్తున్నాం. ʹపోలీసులుంటే ఏమైతది డైరెక్ట్ వెళ్దాం. మావోయిస్టుల ఇంటర్వ్యూ కోసం పోయొస్తున్నం అని నిజం చెబుదాంʹ అని ఓ జర్నలిస్టు మితృడు అన్నాడు. ʹమనను ఏం చేయరు కానీ మనం ఇంటర్వ్యూ చేసిన వీడియోలు డిలీట్ చేస్తే ఎట్లా ʹ అని మరో జర్నలిస్టు మితృడు అనుమానం వెలిబుచ్చాడు. ఇలా మేం మాట్లాడుకుంటుండగానేఎత్తు ప్రాంతానికి వెళ్ళి సిగ్నల్ కోసం ప్రయత్నిస్తున్న మితృనికి సిగ్నల్ దొరికింది. ఆయన తన బాస్ కు విషయం చెప్పాడు. మిగతా వాళ్ళుకూడా అదే ఫోన్ తో వాళ్ళ వాళ్ళ ఆఫీస్ లకు ఫోన్లు చేసి చెప్పారు. ఓ జర్నలిస్టు మితృని ఆఫీస్ వాళ్ళు మేమున్న ప్రాంతానికి దగ్గర లో ఉన్న ఓ జర్నలిస్టును మా దగ్గరికి పంపిస్తామని చెప్పారు. ఇక వచ్చే జర్నలిస్టు మితృని కోసం ఎదిరిచూస్తూ పక్కనే ఉన్న ఓ పషువుల కొట్టం లో కూర్చున్నాం. నాకు కడుపులో ఆకలి మొదలైంది. టైం చూసాను పన్నెండయ్యింది. పొద్దటినుండి ఏం తిన లేదు. కనీసం ఛాయ్ కానీ డికాక్షన్ కానీ తాగలేదని అప్పుడు గుర్తొచ్చింది. ఆ ఊరు కొంచెం పెద్దదిగానే ఉంది బిస్కట్లు దొరుకుతాయేమో చూద్దామని ఓ మితృడు ఊర్లోకి పోయాడు. మేము ముచ్చట్లలో పడి పోయాం ఓ పావుగంటలో ఊర్లోకి పోయిన మితృడు బిస్కట్ ప్యాకట్లతో వచ్చాడు. అందరం బిస్కట్ల మీద దాడి చేసాం. కొద్దిగా ఆకలి తీరింది అలా ఓ గంటన్నర గడిచింది. ఇంతలో ఓ బైక్ శబ్ధం అయ్యింది. కొట్టంలోనుండి బైటికి వచ్చి నిలబడ్డాం. బై సరాసరి మాదగ్గరికి వచ్చి ఆగింది. అతను మాకోసం వచ్చిన స్థానిక జర్నలిస్టు అని అర్దమయ్యింది. అతను బైక్ దిగి మాతో పరిచయం చేసుకొని ʹ తోవలో రెండొందలమంది పోలీసులున్నారు. మనం వేరే తోవలో వెళ్దాంʹ అని బయలుదేర దీశాడు. అతను వేరే తోవలో వెళ్దాం అన్నాడు కానీ మేం వెళ్తుంటే తోవేమీ కన్పించలేదు. ఏ తోవలేని తోవలో అతను ముందు వెళ్తుంటే మేం అతన్ని అనుసరించాం. ఓ అర్దగంట ప్రయాణించగానే ఇప్పటి వరకు మేం వచ్చిన తోవకన్నా ఇప్పుడు వెళ్ళేది ఇంకా కష్టమైనదని అర్దమైంది కానీ స్థానిక జర్నలిస్టుకు అక్కడి వాళ్ళతో పరిచయం ఉండటం వల్ల కొంచెం ఈజీ అయ్యింది. కొంత దూరం వెళ్ళాక ఎలా వెళ్ళాలో అర్దం కాలేదు. మాతో వచ్చిన జర్నలిస్టు, దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్ళి స్థానిక ఆదివాసీ యువకులను ఇద్దరిని తీసుకొచ్చాడు. వాళ్ళు తోవ చూయిస్తుంటే దాదాపు గంట సేపు ప్రయాణించిన తర్వాత ఓ పెద్దవాగు వచ్చింది. అది చాలా ఉదృతంగా ప్రవహిస్తోంది. అందులోనుంచి వెళ్ళడం కష్టమనిపించింది. ఆదివాసుల సహాయంతో కష్టపడి మనుషులమైతే వాగు దాటొచ్చు కాని బైక్ లు వెళ్ళడం ఎట్లా ? ఆ ఆదివాసీ యువకులు, స్థానిక జర్నలిస్టు కలిసి దానికి పరిష్కారం కనిపెట్టారు. అడవిలో వెతికి ఓ ఆరడుగుల పొడవున్న లావాటి కర్రను పట్టుకొచ్చారు. సైలెన్సర్ లోకి నీళ్ళు వెళ్ళకుండా చెట్ల ఆకులను తెంపి బైక్ సైలెన్సర్ లో పెట్టారు. బైక్ మధ్యలో కర్రను దూర్చి ఇద్దరు ఆదివాసీ యువకులు తమ భుజాలపైకి ఎత్తుకున్నారు. మెల్లగా వాగులోకి దిగారు. వారికి తోడుగా మరో ఇద్దరు కూడా వాగులోకి దిగారు. వాగు చాలా వెడల్పు ఉంది. జోరుగా ప్రవహిస్తోంది. అంత బరువును మోస్తూ, అంతటి ప్రవాహంలో నడవడం నాకైతే చాలా ప్రమాదం అనిపించింది. కానీ ఆ ఆదివాసీ యువకులు మాత్రం చాలా నైపుణ్యంతో ఒక్కొక్క అడుగేసుకుంటూ నడుస్తున్నారు.... వాళ్ళకు తోడుగా పోతున్నజర్నలిస్టు మితృలు మధ్యమధ్యలో జారి పడుతున్నారు కానీ వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళదైన పద్దతిలో నడుస్తూ బైక్ ను అవతలి ఒడ్డుకు చేర్చారు. వాళ్ళు అవతలి ఒడ్డు చేరిందాక నేను గుండెలు బిగబట్టుకొని చూస్తున్నాను. ఇక రెండవ బైక్ ను కూడా అదే పద్దతిలో ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి రోడ్డు కొద్ది దూరంలోనే ఉంది అని చెప్పి ఎలా వెళ్ళాలో తోవ చూయించారు. వాళ్ళిద్దరు మాతో రాకుండా ఉంటే మేము రావడం ఎంత్ అకష్టమయ్యేదో తలుచుకుంటేనే.... వాళ్ళ సహాయం వల్ల ఒడ్డెక్కిన మేం ఇక హాపీగా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. కానీ ఓ బైక్ మొరాయించింది. ఎంతకూ స్టార్ట్ కాలేదు. దాదాపు అర్దగంట సేపు ప్రయత్నించాం. ఇక బైక్ ను అక్కడ్నే వదిలేసి వెళ్ళల్సొస్తుందనుకున్నాం. కొద్ది సేపు ఆగి మళ్ళీ ప్రయత్నించగా స్టార్ట్ అయ్యింది. హమ్మయ్య అనుకొని ఆ ఇద్దరు ఆదీవాసీ యువకుల చేతిలో కొద్దిగా డబ్బులు పెట్టి, వాళ్ళకు వీడ్కోలు చెప్పి బయలు దేరాం. అలా అడవి దారిలో ఓ అర్ద గంట ప్రయాణించాక ఓ మట్టి రోడ్డు మీదికి చేరుకున్నాం. అక్కడినుంచి మరో గంటలో మెయిన్ రోడ్డు చేరుకున్నాం. వచ్చే తోవలో పోలీసులు లేక పోతే మెయిన్ రోడ్డు మీదికి అర్దగంటలో వచ్చే వాళ్ళం. కాని చుట్టూ తిరిగి రావడం వల్ల మూడు గంటలు పట్టిందని మాతో వచ్చిన స్థానిక జర్నలిస్టు మితృడు చెప్పాడు. లేటైనా, కొద్దిగా కష్టపడ్డా మావోయిస్టులతో చేసిన ఇంటర్వ్యూ వీడియో భద్రంగా తెచ్చామని ఆనందపడ్డాం. ఆ రోడ్డు మీద ఆ జర్నలిస్టు మితృడికి కృతజ్ఝతలు చెప్పి వీడ్కోలు తీసుకున్నాం.
(అయిపోయింది)
- యం.వి.రమణ

Keywords : Maoists, Janathana Sarkar, Police, Tribal, Bike, Riding, Dandakaranya Forest
(2024-05-01 05:08:34)



No. of visitors : 3259

Suggested Posts


దండకారణ్యంలో ఐదు రోజులు...
ఉత్కంఠ భరిత అనుభవాలు...
మావోయిస్టు నేతతో ఇంటర్వ్యూ....

చుట్టూ దట్టమైన అడవి.... బోరున వర్షం...జర్రుమని జారుతున్న కాలి బాటలో... జానెడు వెడల్పు కూడా లేని పొలం గట్ల పైనుంచి.... నడుముకు పైదాక ఎత్తుతో ఉరకలెత్తే వాగులలోనుంచి....బైక్ మీద ముగ్గురు కూర్చొని ఆకాశంలో తీగ మీద నడిచినట్టు....

తెలంగాణ ను విఫలం చేయడానికి బాబు కుట్రలు చేస్తున్నాడు - మావోయిస్టు నేత హరిభూషణ్

ప్రజలు పోరాడి సాధించికున్న తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రయోగంగా నిరూపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి....

కేసీఆర్ ను చిన జీయర్, రామేశ్వర్ రావులు నడిపిస్తున్నారు...

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును నడిపిస్తున్నది చినజీయర్ స్వామి, పెట్టుబడిదారుడైన రామేశ్వర్ రావు లాంటి వాళ్ళేనని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి .....

జనతన సర్కార్ లో ప్రయాణం... మూడవ రోజు...

మహిళా గెరిల్లాలు మా అందరికి రక్షణగా తుపాకులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. పురుష గెరిల్లాలు వంట వండుతున్నారు.విప్లవంలో స్త్రీలు ఆకాశంలో సగమని మావో చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లాల్లో మహిళా గెరిల్లాలు ఆకాశంలో సగం కన్నా ఎక్కువ అని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను, గెరిల్లాల దైనందిన కార్యక్రమాలను చూసిన తర్వాత అర్థమైంది.....

జనతన సర్కార్ లో ప్రయాణం... నాల్గవ రోజు....

అచ్చంగా నట్టడివి నివాసులైన కోయ, చెంచు ఆదివాసీ తెగలకు చెందిన ఇద్దరు మావోయిస్టు పార్టీ నాయకత్వ స్థానంలోకి ఎదిగి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే.. ఇంతకన్నా విప్లవానికి హామీ ఏం కావాలని మాలో ఓ మిత్రుడు అంటే.. నిజమేననిపించింది....

జనతన సర్కార్ లో ప్రయాణం.... రెండవ రోజు

ఒక కర్రతో పామును ఒత్తి పట్టి మరో కర్రతో దానిని కొట్టి చంపాడు. ఆ తర్వత చెప్పాడతను అది తెల్ల కట్ల పామని అది కరిస్తే రెండు నిమిషాల్లో ప్రాణం పోతుందని. పామును చూసినప్పుడు దాన్ని చంపుతున్నప్పుడు వేయని భయం దాని గురించి విన్న తర్వాత అనిపించింది. కొద్ది సేపు నిద్ర పట్టలేదు.....

ʹజనతన సర్కార్ʹలో ప్రయాణం -
ఉత్కంఠ భరిత అనుభవాలు

మేం జనతన సర్కార్ పరిదిలోకి వచ్చామని. మా పై ఇక్కడి ప్రజలకు ఏమాత్రం అనుమానం కలిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారనే విషయం మాకర్దమైంది. కృష్ణకు కూడా ఏం చేయాలో అర్దం కావడం లేదు. వాళ్ళకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు.....

హరిభూషణ్ తో ఒకరోజు....

2015 ఆగస్టు నెలలో ఓ రోజు ఓ పిలుపు వచ్చింది మావోయిస్టు పార్టీ నాయకులతో ఇంటర్వ్యూ ఉంటుంది వస్తావా అని. వెంటనే రెడీ అయిపోయిన. పిలుపు వచ్చిన రెండో రోజనుకుంటా బయలు దేరాము. నాతో పాటు మరో రెండు పత్రికలు,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జనతన