బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
పశ్చిమ బెంగాల్ భీర్భూమ్ జిల్లాలోని ఓ కుగ్రామం బరోమాసియాకు చెందిన సునీతా హన్స్ధా ఇప్పుడు గుండె పగిలి ఏడుస్తున్నది. తరతరాలుగా ఆ భూమిపై వ్యవసాయం చేస్తూ తుకున్న తమను భూమిని వదిలి వెళ్లిపోవాలని అంటున్నారని కన్నీరు పెట్టుకుంటున్నది. కారణం.. ఆమె సాగుచేసుకుంటున్న పొలం కింద బొగ్గు గనులు ఉన్నాయట. ఆ బొగ్గు నిల్వల పైనే ఆమె ఇల్లూ, పొలమూ ఉన్నాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బొగ్గు గని వున్న భూమి పైన ఆమె ఇల్లూ, పొలమూ వున్నాయి. భూమి పొరల్లో ఉండే నల్ల బంగారమే ఇప్పుడు ఆమె పాలిట శాపమైంది. బొగ్గు గనుల తవ్వకం కోసం వారిని మమతా బెనర్జీ ప్రభుత్వం భూమిని ఖాలీ చేసే వెళ్లిపోవాలని అంటున్నది. దీంతో సునీతా హన్స్ధా కుమిలి కుమిలి ఏడుస్తున్నది. పాలకులపై ఆగ్రహంతో రగులుకంటున్న రాక్షసి బొగ్గులా మారిపోయింది...
హన్స్దాకు 45 ఏండ్లు. ఆమె, ఆమె భర్త రాష్ట్ర రాజధాని కోల్‌కతా నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ రెండు ఎకరాల పొలంలో వరి పండిస్తారు. "మా ఐదుగురు కుటుంబం ఈ చిన్న భూమిపై ఆధారపడి ఉంటుంది. తరతరాలుగా రైతాంగ కుటుంబం మాది. ఇంకో పని చేయడం మాకు తెలియదు. ఈ భూమి వదిలి వెళ్ళడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇటీవల, మా ప్రాంతంలో బొగ్గు తవ్వకం జరుగుతుందని విన్నాము. ఈ భూమి ఒక్కటే మా జీవనాధారం. అది పోతే ఎలా అని రాత్రులు నిద్రపట్టడం లేదు. ఏదేమైనా మేం మాత్రం మా భూమిని వదలడానికి సిద్ధంగా లేం. మేము యిక్కడ చాలా సంతోషంగా బతుకుతున్నాం. ఇక్కడ బొగ్గు గని ఎందుకసలుʹఅని కన్నీరు పెట్టుకుంటున్నారు.
హన్స్డాకు తన పొలం కింద వున్న బొగ్గు నిల్వల వివరాలు తెలియదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంచనా ప్రకారం, డియోచా-పచమి-హరిన్సింగ్-దేవాగంజ్ బ్లాక్‌లో 2,102 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వ ఉందనీ, ఇది 12,000 కోట్ల రూపాయల (1.63 బిలియన్ డాలర్లు) పెట్టుబడిని తీసుకురాగలదని, సుమారు లక్ష మంది స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతాయనీ అంటోంది.
భూసేకరణను వ్యతిరేకిస్తున్న స్థానికులు
రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనులు తవ్వాలంటే.. తమ భూమికి బదులుగా ఎటువంటి పరిహారం లేదా పునరావాస ప్యాకేజీని అంగీకరించడానికి నిరాకరిస్తున్న స్థానిక ప్రజలను ఎదుర్కోవాలి. ప్రతిపాదిత గని 11,200 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. అందులో 9,100 ఎకరాల్లో ప్రజలు నివసిస్తున్నారు. వారంతా ఏండ్లకు ఏండ్లుగా ఆ భూమిపైనే ఆధారపడి బతుకున్న స్థానికులు.
ప్రతిపాదిత బొగ్గు గని ప్రాంతంలో ఉన్న 53 గ్రామాలలో ఒకటైన సాగర్ బండిలో నివసించే స్థానిక హక్కుల కార్యకర్త 40 ఏండ్ల ఖోకాన్ మార్డి.. గనితవ్వకం వల్ల సుమారు 70వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందంటున్నారు. కాగా సర్కార్ మాత్రం "కేవలం 784 కుటుంబాలు నిరాశ్రయులవుతాయని వాదిస్తోంది, కాని నీటి వనరులు, అటవీ, వ్యవసాయ భూమి, ఇళ్లను మింగేసిన పెద్ద ప్రాంతంలో మైనింగ్ చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ ఒక అబద్ధం. మేము ఎక్కడికి వెళ్తాము? వేరే ప్రదేశంలో పునరావాసం కోసం వెళ్ళమని మమ్మల్ని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. కాని మా జీవనోపాధి ఏమిటి? అని అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. "
ఎక్కువభాగం చట్టవిరుద్ధంగా జరుగుతున్న రాతి క్వారీలు, క్రషర్ల వల్ల వచ్చే దుమ్ము నుంచి ఇప్పటికే పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. బొగ్గు తవ్వకం వారి కష్టాలను మరింతగా పెంచుతుంది. ʹగ్రామాలలో పుట్టగొడుగుల్లా ఉన్న అక్రమ రాతి క్వారీలు, క్రషర్ల వల్ల ఇప్పటికే తీవ్రమైన నీటి కొరత, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. వేసవికాలంలో 600 అడుగుల లోతులో కూడా నీరు దొరకదు. నీళ్ళ కోసం ఇతర గ్రామాలకు నడచి వెళ్ళాలి. కుళాయిల వద్ద పొడవైన క్యూలు ఉండటంతో కొట్లాటలు జరుగుతాయి. బొగ్గు తవ్వకం ఈ సమస్యలన్నింటినీ మరింత తీవ్రతరం చేస్తుంది. మా మనుగడను దాదాపు అసాధ్యం చేస్తుందిʹ అని హన్స్డా పొరుగున వుండే 25 ఏళ్ల సరస్వతి మార్ది అంటున్నారు.
ఈ ప్రాంతంలో చాలా కాలంగా నివసిస్తున్నవారు తరచుగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. "గాలిలో దుమ్ము వుండటం వల్ల రాత్రి పూట కూడా కిటికీలు తెరిచి ఉంచడం కష్టమవుతుంది" అని అదే గ్రామంలో నివసిస్తున్న 65 ఏళ్ల బిల్టి మార్డి అన్నారు. "మేము శ్వాస తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాం. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నాం, కాని ఎవరూ పట్టించుకోరు. నీటి నాణ్యత సరిగా లేకపోవడం వల్ల పిల్లలు కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా దారుణమైన పరిస్థితి గురించి ఆరా తీయడానికి ప్రభుత్వం నుండి ఎవ్వరూ రాలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం బొగ్గు గనిని అభివృద్ధి చేయాలనుకుంటోందట. కొత్త ప్రాజెక్టు రాకముందే వారు మమ్మల్ని చంపేయాలి, ఎందుకంటే మనం ఇకపై మమ్మల్ని బతికివున్న వాళ్ళుగా లెక్కించలేరు. ʹ
జీవనశైలి, సంస్కృతిని కోల్పోవడం
"మేము మా జీవనోపాధి కోసం భూమి, అడవిపై ఆధారపడతాం. బొగ్గు త్రవ్వకం మా ఇళ్లను లాక్కోవడమే కాకుండా మమ్మల్ని దివాళా చేస్తుంది. మాకు, కట్టెలు, ఆకులు, ఔషధ మూలికలకు అడవి ప్రధాన వనరు. మైనింగ్ అన్నింటినీ నాశనం చేస్తుంది. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదా పరిహారం అవసరం లేదు. అడవిని మా దేవతగా భావించి ఆరాధిస్తాం. దాన్ని నాశనం చేయడానికి మేము ఎవరినీ అనుమతించం. ʹ . అని కార్యకర్త ఖోకాన్ మార్డి అంటున్నారు. గనుల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని కంటి తుడుపు చర్యగా కొట్టిపారేస్తున్నారు.
తమను దూరంగా ఉండాలని ప్రభుత్వం బెదిరిస్తోందని బొగ్గు గనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పర్యావరణ కార్యకర్తలు ఆరోపించారు. "ప్రభుత్వం ఓపెన్-కాస్ట్ మైనింగ్ ప్లాన్ చేస్తోంది, దీంతో ప్రతిదీ తుడిచిపెట్టుకుపోతుంది" అని పర్యావరణ పరిరక్షణ సంస్థ ʹప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్స్ అసోసియేషన్ʹ ప్రధాన కార్యదర్శి స్వరాజ్ దాస్ అన్నారు. "ప్రాజెక్ట్ గురించి అవగాహన కల్పించడానికి ఇళ్ళు, గ్రామంలో వున్న గోడల పైన చిత్రాలు గీసి గత సంవత్సరం మా ప్రచారాన్ని ప్రారంభించాం, కాని ప్రభుత్వం నిరంతరం అలాంటివి మానుకోవాలనీ లేకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిఉంటుందని బెదిరిస్తోంది. ప్రచారాన్ని ఆపడానికి గోడలకు సున్నాలు వేయించింది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గుపై ఆధారపడకుండా యితర పునరుత్పాదక ఇంధన వనరులను ప్రభుత్వం చూడాలి. ʹ
ప్రతిపాదిత గనిపై స్థానిక నివాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 9 న సుమారు వెయ్యి మంది స్థానిక పోలీస్ స్టేషన్ ముందు మూడు గంటలపాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
గత డిసెంబర్‌లో, బొగ్గు గనితవ్వకాల కోసం ప్రజల్ని తొలగించడం సమస్య అని ముఖ్యమంత్రి బెనర్జీ అంగీకరిస్తూ, ʹమేము తొలగింపు సమస్య లేని చోట మైనింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. మేము బొగ్గును తీయడం ప్రారంభించే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మేము త్వరలోనే పనిని ప్రారంభిస్తే, కేంద్రం నుండి క్లియరెన్స్ పొందిన దేవాగంజ్, హరిన్సింగ్లలో 24 నెలల్లో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుంది. సమీప భవిష్యత్తులో, మన రాష్ట్రంలో రాబోయే 100 సంవత్సరాల విద్యుత్ ఉత్పత్తిని బొగ్గు నిర్ధారిస్తుంది. ʹ
రాజకీయ సమతుల్యత
సెప్టెంబర్ 2018 లో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పశ్చిమ బెంగాల్ విద్యుత్ అభివృద్ధి సంస్థ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఆ సంతకాల ద్వారా ఆ భూమిని కార్పొరేషన్‌కు కేటాయించారు.
రెండేళ్లుగా, పనులు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. బలవంతాన ప్రజల నుంచి భూమిని లాక్కోడమే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలో అంతకుముందు అధికారంలో వున్న రాష్ట్ర ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణమని ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్‌కు తెలుసు. పరిశ్రమల కోసం భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బెనర్జీ అప్పుడు నిరసన చేపట్టారు.
స్థానికులను ఆకర్షించడానికి పాలనా యంత్రాంగం ప్రయత్నిస్తూంది
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని అధికారులు నివాసితుల భయాలను తొలగించడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. వారు ఇప్పటివరకు పెద్దగా విజయం సాధించలేదు. ఈ ఏడాది జూలై 9 న అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా నివాసితులతో సమావేశం నిర్వహించి, ఈ ప్రాజెక్టు వారి సమగ్ర అభివృద్ధికి, రాష్ట్రానికి కూడా దారితీస్తుందని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం నివాసితులను దౌర్జన్యంతో బలవంతంగా తొలగించారనే ఆరోపణలను ఖండించిన సిన్హా, ప్రభుత్వం పునరావాస ప్రణాళికపై పనిచేస్తోందనీ, భూమి నుండి ఎవరినీ తొలగించడం లేదని చెప్పుకొచ్చారు. పునరావాసంపై దృష్టి కేంద్రీకరించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాము ʹఅని అంటున్నారు.
అదే రోజు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశం అంతటా వున్న పెద్ద ప్రాజెక్టులకు ఇది ఒక "నమూనా" అని ట్వీట్ చేశారు. పరిహారం లేదా పునరావాస ప్యాకేజీ గురించి ʹసముచితంʹగా ఉంటుంది అని తప్ప రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏమీ చెప్పలేదు.
బొగ్గు - ఆర్ధికశాస్త్రం
విస్థాపన, పర్యావరణానికి నష్టం వంటి సమస్యలను పక్కన పెడితే, బొగ్గు తవ్వకాలలో పెట్టుబడులు పెట్టడం లో వున్న ఆర్థిక వివేకాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భారతదేశం ఆన్‌లైన్ విద్యుత్ మార్కెట్‌లో, బొగ్గు ఆధారిత ప్లాంట్ల కంటే సౌర, పవన శక్తి సరఫరాదారుల నుండి దొరికే విద్యుత్తు చౌకగా ఉంటుంది.
క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్ సౌత్ ఆసియా డైరెక్టర్ సంజయ్ వశిస్ట్ మాట్లాడుతూ ʹబొగ్గును కాల్చడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం కంటే పునరుత్పాదక శక్తి ఇప్పుడు మరింత నమ్మదగినది, తక్కువ ధరకు దొరుకుతుంది, శుభ్రంగా ఉంటుంది. ప్రత్యేకించి ఎవరైనా బొగ్గును ఉపయోగించినప్పుడు ప్రజలు చెల్లించాల్సిన ఆరోగ్యం, పర్యావరణానికి అయ్యే ఖర్చులను చూసినప్పుడు బొగ్గును ఉపయోగించడంలో అర్ధమే లేదు. బొగ్గును భూమిలో వదిలివేయాలి. రసాయన, జీవ, అణ్వాయుధాల కోసం శిలాజ ఇంధనాలను వుపయోగించకుండా ఒప్పందం ఉండాలి. ʹ
Keywords : west bengal, coal mining, bherbhum, mamatha benarjee
(2023-09-28 09:45:26)
No. of visitors : 826
Suggested Posts
| కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీజాదవ్ పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సహకారంతో ఏబీవీ సృష్టించిన హింసాకాండను వ్యతిరెకిస్తూ... ప్రజాస్వామ్యంపై కాషాయ మూక చేస్తున్న దాడులను నిరసిస్తూ....విద్యార్థిలోకం గర్జించింది. వాళ్ళకు మద్దతుగా ప్రజలు కదం తొక్కారు. |
| అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటనసిద్దాంతపరంగా శత్రువులమని చెప్పుకునే సీపీఎం, బీజేపీ లు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి సిద్దాంతాలు అవసరం లేదని భావిస్తున్నట్టున్నాయి ఆ రెండు పార్టీలు. పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో త్రుణమూళ్ కాంగ్రెస్ ను ఓడించడం కోసం |
| జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ లో ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. |
| కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గిఅమరుడు కిషన్ జీ నాయకత్వంలో పీడితులు మహత్తర పోరాటాలు చేసిన పశ్చిమ బెంగాల్ జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ అగ్గి రాజుకుంటోంది. జంగల్ మహల్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ లు తీవ్రతరం చేశారు. |
| జైల్లో రాజకీయ ఖైదీ సుశాంత్ శీల్ మృతి.... ప్రభుత్వానిదే బాధ్యత అని CRPP ప్రకటనజైలు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సుషాంత్ షీల్ అనే రాజకీయ ఖైదీ డమ్ డమ్ కేంద్ర కారాగారంలో ఈ మధ్యాహ్నం ( 16 - 6 - 2020 ) మరణించారు. అతని మరణవార్తను అధికారికంగా ధృవీకరించనప్పటికీ సుషాంత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి లోనవుతున్నాం. |
| భిన్నాభిప్రాయాలపై దాడికి తీవ్ర ప్రతిఘటన ఉంటుంది.. ప్రాణాలకు తెగించే ప్రజలున్నారు - అమర్త్యసేన్ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని |
| విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్య - ఇది రాజ్య ఉగ్రవాదమే అని ప్రజా సంఘాల ఆరోపణప్రజా ఉద్యమ కార్యకర్త, విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. |
| కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాల యంలో గురువారంనాడు ఏబీవీపీ నిర్వహించిన సెమినార్ కు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో హాజరయ్యి మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని, మూక దాడులను ప్రతిసారీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రోహోదగ్రులై నిరసన వ్యక్త |
| Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘంసిపిఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మహిళా విభాగం ఆల్ ఇండియా రివల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (ఎయిర్‌వో) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ షర్మిస్ట ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందుతూ ప్రగతిశీల మహిళా సంఘం |
| UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోందిఅక్టోబర్ 12వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో, రాజకీయ కార్యకర్త టిప్పు సుల్తాన్‌ను శాంతినికేతన్‌లోని గురుపల్లిలో వున్న అతని ఇంటి నుండి పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు. |