సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది


సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది

సిరిసిల్ల:కులాంతర

(రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలం స్తంభం పల్లి గ్రామంలో ముదిరాజు అన్నదమ్ములు ఇద్దరు గౌడ యువతులు ప్రేమించుకున్న నేరానికి ఆ యువతుల కుటుంబాలు అంధుడైన ఆ యువకుల తండ్రిపై దుర్మార్గంగా దాడి చేసి... హింసించి... హింసించి చంపారు. ఆ దుర్మార్గ ఘటనపై కుల నిర్మూలనా పోరాట సమితి(KNPS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ రాసిన వ్యాసం....)
(ఈ వ్యాసం, ఇమేజ్ లు అభినవ్ బూరం ఫేస్ బుక్ టైమ్ లైన్ నుండి తీసుకున్నాము)

ఇద్దరు కొడుకుల కులాంతర ప్రేమ వివాహాన్ని అంగీకరించి , ఆదరించిన గొప్ప తండ్రి తునికి లక్ష్మీ నారాయణ గారు.ముదిరాజు కులానికి చెందిన తునికి లక్ష్మినారాయణగారు 100 % చూపులేని అంధుడు. ఎంతో సౌమ్యుడు.ఎవరి సహాయం లేకుండా తన పనులు తాను చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకుంటున్నాడు.

కొడుకుల ప్రేమకు తోడుగా..

పెద్ద కొడుకు గౌడ కులానికి చెందిన యువతిని ప్రేమించాడు.అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు.కానీ లక్ష్మీనారాయణ గారు అంగీకరించి తండ్రిగా ఆదరించారు.వాళ్ల ఎదురింట్లో ఉండే గొంగని పరశురాం , గౌడ కుటుంబం మాత్రం వీరి పెళ్లిని వ్యతిరేకించి అవతలి కుటుంబానికి మద్దతుగా నిలబడ్డారు.ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా లక్ష్మీనారాయణ చిన్న కొడుకును ప్రేమిస్తోంది. ఇద్దరు కొడుకులు కులాంతర వివాహాలు చేసుకుంటే గొడవలు ఎక్కువవుతాయి అని భావించిన లక్ష్మినారాయణగారు వాళ్ళతో ముందే మాట్లాడారు.మీ అమ్మాయికి సర్ది చెప్పి వేరే పెళ్ళి చేసుకోండని చెప్పారు. వాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు చూసినట్టున్నారు.

తన ప్రేమ కోసం తల్లిదండ్రులతో పోరాడిన గౌడ యువతి abc

ముదిరాజు కులం అనే కారణంతో కూతురు ప్రేమను వ్యతిరేకించిన గొంగాని పరశురాం కుటుంబం తమ కొడుకు ప్రేమించిన యాదవ కుల యువతితో పెళ్లిని అంగీకరించారు. కూతురు పెళ్లికి మాత్రం అంగీకరించలేదు.బలవంతంగా పెళ్లి చెయ్యాలనుకున్నారో ఏమో? ఆ యువతి తాను ప్రేమించిన యువకునితో కలిసి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అంతే !!.. ఇద్దరు అన్నదమ్ములు తమ కులం అమ్మాయిలనే చేసుకున్నారనే కోపంతో గౌడకులస్తులు రగిలిపోయారు. ముదిరాజ్ యువకుల ఇంటిమీద దాడిచేసి క్రూరంగా కొట్టారు. ఇంట్లో కొడుకు లేని సమయంలో తల్లిదండ్రుల మీద దాడిచేసికొట్టారు.

నన్ను కాపాడు కొడకా..!! అంటూ..
కొట్టుకుని కొట్టుకుని ప్రాణం విడిచిన తండ్రి..

100% చూపులేని లక్ష్మీనారాయణ గారిని ఇంట్లోంచి రోడ్డుమీదికి లాక్కొచ్చి కొట్టారు.శరీరంలోని అవయవాలన్నీ ఛిద్రమైపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది.చూపు కూడా లేని వ్యక్తి బాధతో చేసిన అక్రందనలు వారిని కదిలించలేదు.అతని బాధను చూసి అందరూ దుఃఖించడం తప్ప ఏమీ చేయలేని స్థితి.ఆ నొప్పిని భరించలేక హాస్పిటల్ లో కూడా విలవిలలాడారు. " నన్ను కాపాడు బిడ్డా.... "అంటూ నాలుగు రోజులు గిలగిలా కొట్టుకుని కొట్టుకుని ..😢😢 మరణించారు.ఏన్ని కోట్లు పోసినా.. డాక్టర్లు , వెంటిలేటర్లు కూడా కాపాడలేనంతగా ఆయన ఒంటి మీద హింస జరిగింది.ఆయన బాధను చూసి ఊరు ఊరంతా చలించింది తప్ప హంతకులు మాత్రం చలించలేదు.

నన్ను క్షమించు నాన్నా.. గుండెలు పగిలిన ప్రేమ జంట

పెద్ద కొడుకు పెళ్లై రెండు నెలలు కూడా గడవక ముందే ఆ ఇంట్లో పెనువిషాదం నిండింది.తమ ప్రేమ వల్లనే దాడికి గురైన తండ్రి నొప్పులతో అల్లాడుతుంటే .. చూసిన పెద్దకొడుకు కోడళ్లు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మావల్లే నువ్ చనిపోయావ్ అంటూ తల్లడిల్లుతున్నారు." నేనుంటే .. నీ దెబ్బలు నేను తిని నిన్ను కాపాడుకునే వాణ్ణి నానా .." అంటూ నిలువెల్లా దుఃఖంతో వణికిపోతున్న పెద్ద కొడుకు రంజిత్ ను అవడం ఎవరివల్లా కావడం లేదు.. మనం కూడా అతనితో కలిసి దుఃఖించడం తప్ప.😢

పోలీసుల సంరక్షణలో కొత్త ప్రేమ జంట

ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. చనిపోయిన తండ్రిని కొడుక్కి చూపించి ప్రేమ జంటను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ వారిని అబ్బాయి కుటుంబానికి అప్పగించి తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది.దాడి చేసిన వెంటనే దోషుల మీద కేసు నమోదు చెయ్యకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులు కనీసం ఈ ప్రేమ జంటకీ రక్షణ కల్పించి తమ నిబద్ధతను చాటుకోవాలి.

ప్రేమిస్తే .. ప్రాణాల్ని బలి తీసుకుంటున్న .. అగ్రకుల మనువాదం

తమకు ఇష్టమైన వారిని కులాలకు , మతాలకు ,వర్గాలకు అతీతంగా ప్రేమించిన వారిని కుటుంబమే దారుణంగా కొట్టి చంపుతున్న ఘటనలు తెలంగాణలో ఎక్కువవుతున్నాయి. అబ్బాయిలు తక్కువ కులం వాళ్ళు , పేద వాళ్ళు అయితే వారి తలలు తెగిపడుతున్నాయి. కన్నవారిని ధిక్కరించి కులం తక్కువ వాళ్ళతో పెళ్లికి సిద్ధపడ్డ యువతులను మంటల్లో మాడ్చుతున్నారు. గొంతులకు ఉరితాళ్ళు బిగించి చంపుతున్నారు.కొడుకులు ఎన్ని వెధవ్వేశాలు ఏసినా భరించే కుటుంబం కూతురు ప్రేమిస్తే మాత్రం కన్న ప్రేమను మరచి యువతులపై తీవ్రమైన అణచివేతను ప్రయోగిస్తున్నారు. బెదిరింపులు , బ్లాక్ మెయిలింగ్ చేస్తూ లొంగదీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి కాపురాలు చేసినా , బిడ్డలు పుట్టిన వారిని విడగొట్టే కుట్రలు మాత్రం ఆపడం లేదు.గుణవంతుడు , బుద్ధిమంతుడు , అందగాడు , సంపాదనాపరుడు అయినప్పటికీ .. కులం తక్కువనీ , తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారనే సాకులతో వారి పెళ్లిని నిరాకరించి ఆదరించడం లేదు.

కుటుంబాన్ని వేధిస్తున్న కుల సమాజం

కన్న బిడ్డలను దూరం చేసుకోలేక , తమకు ఇష్టం లేని పెళ్లిని కూడా అంగీకరించి ఆదరిస్తున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రేమ వివాహాలు చేసుకున్న కుటుంబాలను కుల కట్టుబాట్ల పేర వేధిస్తున్న అగ్రకుల మనువాద సమాజానికి భయపడి కన్నా బిడ్డలను దూరం చేసుకుంటున్నారు. దళిత , పీడిత కులాల శ్రమను దోచుకుంటూ బ్రతికే అగ్రకుల పీడక వర్గాలు కులాంతర వివాహాలను అంగీకరించడం లేదు. అలాంటి వారిపై దాడులు , హత్యలను ప్రేరేపిస్తున్నారు.బీసీ కులాల్లో కూడా ఇలాంటి కుల వైషమ్యాలను ప్రేరేపించడంలో అగ్రకుల మనువాద శక్తులు సఫలం అయ్యాయి. దళితులు , దళితేతరులకే ఎక్కువగా పరిమితమైన కుల దురహంకార హత్యలు నేడు బీసీ ల మధ్య కూడా పెచ్చరిల్లుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర పరిణామం.ఈ ప్రమాదాన్ని పసిగట్టి బీసీ ల మధ్య కుల వైషమ్యాలను తగ్గించి , కుల నిర్మూలన అవగాహనను పెంపొందించే బాధ్యత బీసీ నాయకుల మీద ఉంది. అప్పుడే ఇలాంటి కుల దురహంకార హత్యలను అపగలం. కుల నిర్మూలన ,సమసమాజ స్థాపన కోసం మహనీయులు జ్యోతిబాఫుల్ , బాబాసాహెబ్ అంబెడ్కర్ , ఇంకా ఎందరో ఉద్యమకారుల ఆశయాలు సిద్ధిస్తాయి. మనువాదుల అమ్ములపొదిలో ఆయుధాలుగా మారి మనపైనే దాడులకు తెగబడుతున్న దళిత , పీడిత కులాల , వర్గాల ప్రజలను మన దారిలోకి తెచ్చే గొప్ప బాధ్యత దళిత, బహుజన , ప్రగతిశీల ఉద్యమకారుల మీద ఉంది.ఆ వైపుగా అందరూ ఆలోచించాలని ఆశిస్తూ..
మీ
బూరం అభినవ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కుల నిర్మూలనా పోరాట సమితి(KNPS )

Keywords : rajanna siricilla, telangana, mudiraj cast, goud cast, inter cast marriage,
(2021-01-14 17:55:04)No. of visitors : 274

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్
బీహార్ లో వేలాది మంది రైతుల‌ ర్యాలీ - పోలీసుల దాడి
తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ‌ పొలంపనుల్లో...
more..


సిరిసిల్ల:కులాంతర