కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.
కానీ బహుశా రాజ్యానికి ఈ పని కూడా నచ్చలేదు. నీరు-అటవీ-భూమి సమస్యపై ఆమె తీసుకున్న చొరవ కారణంగా కార్పొరేట్ కి కంటగింపైంది. దాని ఫలితంగా ఎటువంటి ఆధారాలు లేదా సాక్ష్యంకానీ లేకుండా, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే సెక్షన్ల క్రింద జైలు పాలయ్యింది.
సుధాకు బెయిల్ మంజూరు చేయకపోవడం లేదా ఆమె కేసులను క్రమం తప్పకుండా విచారించకపోవడాన్ని చూస్తే ప్రభుత్వం ఈ మేరకు కక్ష తీర్చుకుంటోందో అంచనా వేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, బెయిల్, విచారణలు లేకుండా మూడేళ్ళకు పైగా జైలులో ఉన్నది.
మాయ్ షా మెహ్రా, సుధా భరద్వాజ్ కూతురు
ఈ రోజు మా అమ్మ 60వ పుట్టినరోజు, మేము కలిసి లేకపోవడం ఇది మూడవసారి. ఇంతకు ముందు 2 పుట్టినరోజులు, 2 దీపావళి పండగలు, 2 నూతన సంవత్సర దినోత్సవాలు గడిచిపోయాయి.. 2017 లో మేమిద్దరం కలిసి ఉన్న రోజు నాకు గుర్తోస్తోంది. తనతో కలిసి ఉండటం ఎంత బాగుండింది. లేకపోవడం ఎంత వెలితిగా వుంది? ఇప్పుడు ఏ విషయమూ సంతోషంగా అనిపించదు. కాలం గడుస్తున్న కొద్దీ గాయాలు మరింతగా బాధపెడుతున్నాయి.
ఈ రోజు, అమ్మకు ఎంతమంది శుభాకాంక్షలు తెలిపారు! ఇది చూసి నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఆ వ్యక్తి మీతో లేనప్పుడు జ్ఞాపకాలు మరింత విషపూరితం అవుతాయి. అయితే వారు లేనప్పటికీ, వాళ్ళు వున్నారనే భావన మనస్సులో ఉండిపోతుంది… .. కార్మిక, రైతాంగం కోసం ఇంత చేసిన అమ్మ ఇలాంటి శిక్షకు గురి కావడం అనేది ఏ మాత్రం మంచిగా అన్పించడం లేదు.
అమ్మ లేకపోవడం అనే గాయం ప్రత్యేకమైనది. ఆ ఆటుపోట్లు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆమె లేకుండా ఒక రోజూ గడవడం కూడా ఒక పోరాటమే… ఆమె ఉన్నప్పుడు విషయాలు వేరుగా ఉండేవి. ఆ ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయడం కష్టం. ఇంతకు ముందు నేను పూణేలో ఆమెను కలవడానికి వెళ్ళాను, ఆ భావన భిన్నంగా ఉండింది, ఒకసారి కష్టంగా అనిపించింది. ముంబైలో కలవడానికి అనుమతి లేదు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా, బోలెడంత ప్రేమతో.....
ఇంతవరకు దొరకలేదు కాబట్టి ,న్యాయం దొరుకుతుందనే ఆశ యిప్పుడైతే నాకు అంతగా లేదు,. ఇలా మనం యింకా ఎన్ని సంవత్సరాలు బతకాల్సి వుంటుందో నాకు తెలియదు…అమ్మ ఆరోగ్యాన్ని, ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా అమ్మను విడుదల చేయండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ……
కళాదాస్ దహ్రియా, కార్యకర్త, ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా
సుధా భరద్వాజ్ చదువు పూర్తి చేశాక 1982-83లో ఢిల్లి నుంచి రాజ్ హరాకు వచ్చి నియోగి నేతృత్వంలోని ఉద్యమంలో చేరారు. ఛత్తీస్‌గఢ్ ముక్తిమోర్చా నడుపుతున్న పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది.
దాంతోపాటు మహిళా ముక్తి మోర్చా కార్యకలాపాలలో చొరవగా పాల్గోనేది. నియోగితో సైద్ధాంతిక చర్చ కూడా చేసేది. గనుల కార్మిక సంఘ పోరాటాలలో కూడా పాల్గొనేది. 1990లో నియోగి నాయకత్వంలో భిలాయ్ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో, మహిళలను సంఘటితపరచడం, కార్మిక ఉద్యమానికి కరపత్రాలు రాయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. 1991లో నియోగి హత్య తరువాత, భిలాయ్ ఉద్యమంలో పెరిగిన బాధ్యతలను చాలా చక్కగా నిర్వహించింది.
1992లో, భిలాయ్ ఉద్యమ కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 16 మంది కార్మికులు అమరులయ్యారు. ఆ సమయంలో సుధా భరద్వాజ్ తన శాయశక్తులా కార్మికులతో కలిసి పనిచేయడంతో పాటు సంఘానికి వున్న న్యాయవాదుల అవసరాన్ని చూసి, దుర్గ్ లో న్యాయశాస్త్ర అధ్యయనం చేసి న్యాయవాదిగా మారింది. కార్మికుల న్యాయం కోసం వీధుల్లో, న్యాయస్థానాల్లో కూడా పోరాడింది. ప్రతి పనిని నిజాయితీతో, పూర్తి బాధ్యతతో చేసేది కాబట్టి చూస్తుండగానే పని పరిధి విస్తృతమైపోయింది.
రైతుల భూమిని కాపాడడానికి బిలాస్‌పూర్ హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది. ఆదివాసీల నీరు, అటవీ, భూమిని లాక్కోవడానికి వ్యతిరేకంగా, విస్థాపన సమస్యలకు వ్యతిరేకంగా గొంతెత్తింది. ఈ కారణంగా కార్పొరేట్ సంస్థలు, పాలక ప్రభుత్వాల కంటిలో నలకగా మారింది. అందుకనే కుట్ర చేసి భీమా కోరేగావ్ కేసులో ఇరికించారు, యుఎపిఎ కింద జైలులో పెట్టారు. ఈ నాటి వరకు ముంబై జైలులో ఉంచారు. బెయిల్ కూడా ఇవ్వడం లేదు. ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా కార్మికులు ఆమె విడుదల కోసం నిరంతరం పోరాడుతున్నారు.
ప్రియాంక శుక్లా, న్యాయవాది, సుధా సహచర కార్యకర్త
నేను సుధాజితో గడిపిన సమయం, కలిసి పని చేసిన అనుభవంతో ఆమె ఒక చీమను కూడా చంపాలని అనుకుంటుందని నేను నమ్మను, నేను ఈరోజు ఏ పని చేయగలిగినా అందుకు సుధాజినే కారణం. ఆమె మా స్ఫూర్తి, మా సంరక్షకురాలు, ఆమె లేకపోవడం పిల్లలు తల్లి నుండి విడిపోయినట్లుగా ఉంది.మాలాంటి వారు యింకా చాలా మంది ఉన్నారు, వారందరికీ ఆమె తల్లి లాంటిది.
(janchowk.com సౌజన్యంతో)
(తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)
Keywords : sudha bharadvaj, mayesha, bhima koregaon, bk16,
(2021-01-17 14:13:34)
No. of visitors : 384
Suggested Posts
| మృత్యు శయ్యపై ఉన్న వరవర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టువరవరరావు మృత్యుముఖంలో చావుబతుకుల్లో మంచంపై పడిఉన్నాడు. అతనికి తగు చికిత్స అత్యవసరం. |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movementActivists-Intellectuals detained in the Elgar Parishad-Bhima Koregaon case, to join farmers in their struggle by observing day long symbolic hunger
strike. |
| రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్షవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అమరులైన రైతులకు మా నివాళి. వాళ్ల అమరత్వం ఉద్యమాన్ని మరింత దృడంగా మలుస్తుందన్న విశ్వాసముంది. |