పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్


పచ్చని వలారాం కొండలు ఎరుపెక్కాయి... లాల్ సలాం! కామ్రేడ్ వేల్మురుగన్

కామ్రేడ్ వేల్మురుగన్ పుట్టినరోజు, అమరుడైన రోజూ రెండూ నవంబర్ నెలలోనే. తమిళనాడుకు చెందిన కామ్రేడ్ ఎ. వేల్మురుగన్ 33 వ పుట్టినరోజు 27 నవంబర్ 2020. కేరళ ప్రభుత్వ రక్త పిపాసి థండర్ బోల్ట్ కమాండోలు చేసిన చట్ట వ్యతిరేక హత్యలో 2020 నవంబర్ 3న కామ్రేడ్ వేల్మురుగన్ అమరుడయ్యాడు.

2016నవంబర్ 24(నీలంబర్ బూటకపు ఎన్కౌంటర్), 2019 మార్చి 6 (వైతిరి బూటకపు ఎన్కౌంటర్), 2019అక్టోబర్ 28(మంజకండి బూటకపు ఎన్కౌంటర్) తరువాత రక్తంతో తడిచిన మరో రోజు నవంబర్ 3. సిపిఐ (ఎం) నేతృత్వంలోని కేరళలోని ఈ నకిలీ వామపక్ష ప్రభుత్వం హత్య చేసిన 8 వ మావోయిస్టు విప్లవకారుడు కామ్రేడ్ వేల్మురుగన్.

పోలీసులు చెబుతున్న‌ ప్రకారం, సిపిఐ (మావోయిస్ట్) పశ్చిమ ఘాట్ జోనల్ కమిటీకి చెందిన బనసుర దళం కమాండర్ గా ఉన్న కామ్రేడ్ వేల్మురుగన్ నవంబర్ 3 న వయనాడ్ జిల్లా పడింజరతరలోని బనసుర కొండ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు చెప్తున్న సమయం, తుపాకీ శబ్ధాలు వినిపించాయని స్థానికులు చెబుతున్న సమయానికి చాలా తేడా ఉంది. పోలీసులు చెబుతున్న కథపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. గత బూటకపు ఎన్‌కౌంటర్లను పరిశీలిస్తే, యిది కూడా బూటకపు ఎన్‌కౌంటర్ అయ్యే అవకాశం ఉంది. బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా ఎర్నాకుళం, మలప్పురం, కోజికోడ్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

(కామ్రేడ్ వేల్మురుగన్ తల్లి)

నవంబర్ 4 న ఎర్నాకుళంలోని హైకోర్టు జంక్షన్ వద్ద ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, థండర్ బోల్ట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమ్యూనిస్ట్ విప్లవకారుడిని చట్ట వ్యతిరేకంగా హత్య చేయడానికి వ్యతిరేకంగా నినదించారు. ఆ తోవలో వెళ్తున్నవారు, ప్రేక్షకులు కూడా ప్రజా సంఘాల నిరసనలో గొంతు కలిపారు.

తమిళనాడు తేని జిల్లాలో చాలా పేద కుటుంబానికి చెందిన కామ్రేడ్ వేల్మురుగన్ న్యాయశాస్త్ర విద్యను మధ్యలో వదిలేసి పూర్తి సమయం విప్లవ కార్యకర్తగా మారారు. న్యాయవాది వృత్తిని చేపట్టి ఉంటే సౌకర్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపగలిగే ఒక యువకుడు విప్లవం కోసం అన్నింటినీ ఎందుకు వదిలిపెట్టాడు? అతని రాజకీయాలు, మార్క్సిజం-లెనినిజం-మావోయిజం భావజాలం రేపటి నవ సమాజం కోసం అతను వర్గ పోరాటంలోకి ఉరికేట్టు చేశాయి.

(కామ్రేడ్ వేల్మురుగన్ తల్లి, అన్న ఉండే ఇల్లు)

వేల్ మురుగన్ తల్లిని, మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా వున్న కామ్రేడ్ వేల్మురుగన్ సోదరుడైన ఎ. మురుగన్ కుటుంబ సభ్యులను కోజికోడ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో వుంచిన వేల్ మురుగన్ మృతదేహాన్ని చూడటానికి అనుమతించలేదనీ, తీవ్ర నిరసన‌ తరువాత, అధికారులు మృతదేహాన్ని చూడనిచ్చారనీ చెప్పారు. శరీరంపై 10 కంటే ఎక్కువ బుల్లెట్ గాయాలు, చిత్రహింసకు గురిచేసినట్లుగా గాయాలు వున్నాయనీ, సజీవంగా పట్టుకొని కాల్చేసి ఎన్కౌంటర్లో చనిపోయాడ‌ని చెప్తున్నారనీ ఎ. మురుగన్ మీడియాతో అన్నారు.

కామ్రేడ్ వేల్ మురుగన్ శరీరంపైన కాలిన గాయాలు ఉన్నాయని, అవి అతి దగ్గర నుంచి తగిలిన బుల్లెట్ వల్ల అయివుండవచ్చనీ రిపోర్టులో పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా న్యాయపరంగా పోరాడతామని మురుగన్ చెప్పారు. ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్ పైన దర్యాప్తు చేస్తోంది. కామ్రేడ్ వేల్మురుగన్ దళానికి చెందిన మిగిలిన సభ్యులు గాయాలతో తప్పించుకున్నారని, యింకా ఎవరూ పట్టుబడలేదని పోలీసులు చెప్పారు.

మావోయిస్టులు ఆయుధాలు కలిగి వున్నారు కాబట్టి వారిని చంపడాన్ని సమర్థించే ఉదారవాదులు, ప్రభుత్వ అనుకూల ప్రజలను, మీ రాష్ట్ర పోలీసులు "నిరాయుధ" అమాయక పౌరులను పోలీసుల అదుపులో వుండగా హత్య చేసినప్పుడు మీ సంస్థలు, రాజకీయ నైతికతలు ఎక్కడకి పోతాయని నేను ప్రశ్నిస్తున్నాను. హత్యకు గురైన వారిలో ఎక్కువ మంది దళిత, ముస్లిం, ఆర్థికంగా పేద కుటుంబాలకు చెందినవారే వుంటారు. ఈ సంఘటనపై సిపిఐ (ఎం), దాని యువజన సంఘం రాష్ట్ర హోం శాఖ, హోంమంత్రి , రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిందా?

మావోయిస్టులు ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఎందుకు చేరకూడదు, ఎందుకు ప్రజాస్వామ్య కార్యకలాపాల్లో పాల్గొనకూడదు? అనేది యింకొక వాదన.

ఈ వాదన‌ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ‌ ప్రజాస్వామ్యం పరిమితమైనది, పాలకుల‌ అవకాశవాద ప్రయోజనాలను తీర్చడానికి అనుకూలంగా మార్చబడింది. బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసినందుకు, ఆ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేయమని డిమాండ్ చేసినందుకు కేరళ‌ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపిన చాలా మంది కామ్రేడ్లు కేరళలో ఉన్నారు. నిషేధించబడని తమ సంస్థల పేరిట ఈ పోస్టర్లను వారు పగటిపూట బహిరంగంగా అతికించారు. ఇప్పుడు, వారు ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు? మేము పాలకవర్గాన్ని, దాని ఆలోచనలను నాశనం చేయకపోతే, రాజకీయాధికారం కోసం ఎన్నికలలో పాల్గొనడంలో అర్థం లేదు.

పోలీసు అధికారులపై దాడి చేయడం గురించి చెప్పాలంటే, పోలీసు అధికారులను మావోయిస్టులు రాజ్యఅణచివేత సాధనంగా మాత్రమే చూస్తారు. మావోయిస్టుల సింపథైజర్స్ కానీ లేదా మావోయిస్టుల్లో చేరినవారు, పోలీసులు ఇద్దరూ కూడా రాజ్య దోపిడీకి గురవుతున్నారు. రాజ్యం వారి ప్రాథమిక మానవ హక్కులను కాలరాస్తోంది. వాళ్ళను దోపిడీ చేస్తుంది.

కొన్నేళ్ల క్రితమే థండర్‌బోల్ట్ కమాండోలు, వారి కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచివాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు. థండర్‌బోల్ట్ కమాండోలు స్వయంగా పేద కుటుంబాలకు చెందినవారు తాము శిక్షణ సమయంలో కులపర వివక్ష, మానసిక / శారీరక భయాందోళనలను అనుభవించామని తెలిపారు.

నేను, కన్నూర్ లో ఓ గిరిజన నాయకుడితో స్వయంగా మాట్లాడినప్పుడు, రైఫిల్స్‌ తో సాయుధమైన ఈ థండర్ బోల్ట్స్ కమాండోలు రాత్రి సమయంలో గ్రామాలపై దాడి చేసి, సెర్చి పేరుతో పాత్రలు, ఇతర వస్తువులను బయటికి విసిరేసి భయోత్పాతాన్ని సృష్టిస్తారని ఆయన చెప్పారు.

ఆదివాసీల దగ్గర మిగిలిపోయిన అన్నం లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు లభిస్తే, థండర్ బోల్ట్స్ కమాండోలు వినాశనాన్ని సృష్టిస్తారు. పురుషులు రాత్రి అడవిలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు, ఈ కమాండోలు సెర్చి కోసం వస్తారు. థండర్ బోల్ట్స్ కమాండోలు ఆదివాసీ మహిళలను వేధింపులకు గురి చేస్తారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రకాష్ బాబు కూడా చెప్పారు.

ప్రజాస్వామ్య పార్లమెంటరీ పార్టీ అని చెప్పుకునే సిపిఐ (ఎం) నాయకులు తమ వ్యక్తిగత అవసరాల కోసం పోలీసు అధికారులను చంపేస్తామని బహిరంగంగా బెదిరించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ సభ్యులు దిగువ సభ లోపల కూడా ప్రజా ఆస్తులను నాశనం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులను ఖతం చేయడానికి బెంగాల్‌లో హర్మద్ బాహిని అనే సాయుధ మిలిటెంట్ దళాలను కలిగిన పార్టీ వర్గపోరాటం చేసే మావోయిస్టులను విమర్శించడం కపటనాటకం కాదా?

తమ ప్రత్యర్థులను నిరాయుధులను చేయడానికి ప్రభుత్వ సాయుధ దళాలకు ఆయుధాలు ఇస్తారు, లేదా అనివార్యం అయితే, వారిని సజీవంగా పట్టుకోవడానికి కాల్పులు జరపవచ్చు కానీ చంపకూడదు. కమ్యూనిస్టులపై కేసులు ఉంటే, మీరు వారిని ఐపిసి, సిఆర్‌పిసి కింద సాక్ష్య చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) ప్రకారం అరెస్టు చేసి న్యాయ విచారణ కోసం కోర్టుకు తీసుకెళ్లవచ్చు.

సిపి జలీల్ హత్య ఫోరెన్సిక్ రిపోర్టు , సాక్షుల ప్రకటన పోలీసులను తీవ్ర విమర్శకు గురిచేసింది. ఎన్‌కౌంటర్ తరువాత, మావోయిస్టులు కాల్పులు జరపడంతో తాము తప్పనిసరై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. రిసార్ట్ సిబ్బంది మీడియా ముందు మాట్లాడుతూ పోలీసులు మొదట కాల్పులు జరిపారనీ, మావోయిస్టులు భయోత్పాత వాతావరణాన్ని సృష్టించలేదనీ చెప్పారు. జలీల్ దగ్గర వున్న ఆయుధం నుండి కాల్పులు జరగలేదని వున్న ఫోరెన్సిక్ రిపోర్టు తెలిపింది. అతని చేతిలో తుపాకిపై మందుగుండు ధూళి కనబడలేదు, ఘటనా స్థలంలో దొరికిన తూటాలు పోలీసులకు మాత్రమే చెందినవి. ఈ అంశాలు కాల్పులు ఒకవైపు నుంచి జరిగాయి అనీ, అది బూటకపు ఎన్కౌంటర్ అని సూచిస్తాయి. నీలంబూర్, మంజకాండిలలో కూడా ఇలాంటి పరిశీలనలు, చిత్రహింసకు సంబంధించిన ఆధారాలను చూడవచ్చు.

మరో అనుమానాస్పద విషయం ఏమిటంటే, పోలీసులు మీడియాను ఎన్‌కౌంటర్ స్థలంలోకి ఎందుకు అనుమతించలేదు? కామ్రేడ్ వేల్మురుగన్ పార్థివ శరీరాన్ని చూడటానికి పోలీసులు బంధువులను ఎందుకు అనుమతించలేదు? పోలీసుల ఈ చర్యలు మా సందేహాలకు మద్దతు ఇస్తున్నాయి.

ప్రభుత్వం అన్ని ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణకు ఆదేశించాలి. ఆదివాసీల జీవితాల్లో అలజడి సృష్టించే థండర్ బోల్ట్స్ కమాండో బలగాన్ని రద్దు చేయాలి.

యిదిలా వుండగా, సిపిఐ (ఎం) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు అనథాలవట్టం ఆనందన్ తమిళనాడు స్థానిక మావోయిస్టు కేడర్ కేరళకు ఎందుకు వచ్చారని అడిగి పరిహాసం పాలయ్యారు.

అర్జెంటీనాలో జన్మించి, మెక్సికోలో శిక్షణ పొంది, క్యూబాలో విప్లవానికి నాయకత్వం వహించిన, బొలీవియాలో అమరుడైన చెగువేరాను వారు నిరాకరించినట్లున్నారు. స్థానికులు మాత్రమే విప్లవాన్ని చేయాలని గెరిల్లా యుద్ధంలో ఏదైనా కొత్త ఒప్పందం లేదా నియమాలు ఉన్నాయా? అది మీ రాజకీయ అవగాహన అయితే, మిస్టర్ అనాథాలవట్టం ఆనందన్, కామ్రేడ్ సిపి జలీల్ కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన యువకుడు. బిజెపి కేంద్ర ప్రభుత్వం నుండి SRE ఫండ్, ఇతర వనరులను పొందిన తరువాత మీ ప్రభుత్వం హత్య చేసిన మూడవ కామ్రేడ్.

మావోయిస్టులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక, అమానవీయ ఆపరేషన్ సమాధన్, ఆపరేషన్ అనకొండలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి.

వ్యాస రచయిత: రెజాజ్ ఎమ్ సైదీక్

అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : kerala, maoists, velmurugan, vijayn police, fake encounter, cpm
(2020-12-03 13:59:00)



No. of visitors : 348

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Search Engine

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !
రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ‌
20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ఎమ్మెల్యే దాడి - బీజేపీ నాయకురాలికి గర్భస్రావం
రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC
ʹసెట్ బాక్స్ వస్తాయి, నిరాశ పడితే ఎట్లాʹ - వీవీతో ములాఖత్ 2
30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
వీవీతో ములాఖాత్ - ‍1
దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం
తూర్పు పశ్చిమాల వంతెన నిర్మాతలు | పాణి
నాన్న జ్ఞాప‌కాల అన్వేష‌ణ‌లో - స్వేచ్ఛ‌
పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు
మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
17 మంది ప్రాణాలు కోల్పోయిన చోట... 20 అడుగుల ʹకులం గోడʹ మళ్ళీ లేచింది
కాషాయదళం బెధిరింపులతో సిలబస్ నుండి ʹవాకింగ్ విత్ కామ్రేడ్స్ ʹ పుస్తకం తొలగించిన యూనివర్సిటీ
నా కుమారుడికి పట్టిన గతి మరే జర్నలిస్టుకూ పట్టకూడదు... ఆ తండ్రి రోదనను పట్టించుకుంటారా ?
భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
పిల్లలు పుట్టడమే హిందూ మతంతో పుట్టడం కోసం యూపీ ప్రభుత్వం కొత్త‌ పథకం
పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు
Dr. G.N. SAIBABA WENT ON HUNGER STRIKE FOR 10 DAYS - JAIL AUTHORITIES ASSURE IMPLEMENTATION OF HIS DEMANDS
మావోయిస్టు నాయకుడు వేల్ మురుగన్ బూటకపు ఎన్ కౌంటర్ పై కేరళలో నిరసనలు
నెత్తురు చిందిన వైనాడ్ అడవులు... మరో మావోయిస్టు నేతను చంపేసిన పినరయి సర్కార్
కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
సిరిసిల్ల:కులాంతర ప్రేమ నేరమయ్యింది... కులోన్మాదం ఓ అంధుడిని హింసించి...హింసించి చంపింది
ఎవరీ నలుగురు..... గుండెలు మండించే జ్ఞాపకాలు
more..


పచ్చని