భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?


భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లాలో పీడిత ఆదివాసీ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పాటుపడుతున్న 33 ఏళ్ల మహేష్ రౌత్ రెండు సంవత్సరాల నుంచి జైల్లో వున్నారు.

1818లో అగ్ర కుల పీష్వాలపై దళిత సముదాయానికి చెందిన మహర్లు సాధించిన విజయం జ్ఞాపకార్థం 2018, జనవరి 1నాడు భీమా కోరెగావ్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సందర్భంలో జరిగిన హింసాకాండకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. మహేష్ ఆ హింసాకాండను ప్రేరేపించాడని, అతనికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన 16 మంది కార్యకర్తలందరిలోకీ అతను చిన్నవాడు. ఈ కేసు గురించి మనం ఎందుకని పట్టించుకోవాలంటే, మహేష్ మన వాక్ స్వాతంత్య్రం, అసమ్మతిని ప్రజాస్వామికంగా వ్యక్తీకరించగలిగే హక్కు కోసం పోరాడుతున్నారు. తనకే కాదు మనందరికీ కూడా, చూసిన అన్యాయాలను వ్యతిరేకించే అభిప్రాయాలను కలిగిఉండే హక్కు కోసం పోరాడుతున్నారు. అందులో తప్పు ఏమీ లేదని మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరికీ అలాంటి భద్రత ఉండాలని మనం కోరుకుంటున్నాము. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం అంగీకరించడంలేదు. గడ్చిరోలి ప్రజలకు మద్దతుగా మహేష్ మాట్లాడటం వారికి ఇష్టముండదు.

పెద్ద మైనింగ్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా మిగిలి ఉన్న ప్రతిబంధకాన్ని తొలగించడానికి మహేష్ ను కార్యాచరణలో లేకుండా చేశారు. ఈ కంపెనీలు విలువైన ఖనిజాలను దోపిడీ చేస్తున్న ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలు తమ సమిష్టి హక్కుల కోసం వ్యవస్థీకృతంగా, శాంతియుతంగా నిలబడటానికి మహేష్ సహాయం చేశారు. వారి గురించి మాట్లాడటం, వారిని సమీకరించడం నేరం ఎలా అవుతుంది ? ఈ దేశ ప్రజలమైన మనం, ఆర్టికల్ 19 (ఎ), (బి), (సి) లో ప్రాథమిక హక్కులుగా పేర్కొన్న ఇటువంటి హక్కులను పరిరక్షించాలని మన రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాన్ని ఆదేశించాము.

తమ భూముల్లో తమ ఇష్టానికి వ్యతిరేకంగా గనుల తవ్వకం జరగనివ్వకుండా తోటి పౌరులకు సహాయం చేయడానికి మహేష్ న్యాయ స్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నాడు. అయితే, కార్పొరేట్ అధిపతులకు వ్యతిరేకంగా వుండే విషయాల్లో న్యాయ వ్యవస్థను ఉపయోగించడం మన ప్రభుత్వానికి ఇష్టం లేదు. అర డజను పైగా కార్పొరేట్ మైనింగ్ దిగ్గజాలు ఈ ప్రాంతపు సహజ వాతావరణాన్ని నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నాయి.

గడ్చిరోలిలోని మైనింగ్ కంపెనీల నుండి 2019-20లో పన్నుల ద్వారా వచ్చిన రూ. 4,745 కోట్ల ఆదాయంలో ఎంత మొత్తం స్థానికులకు బదిలీ అవుతోంది? ఇక్కడ 2017-18లో తలసరి నెలవారీ ఆదాయం కేవలం రూ. 7,144 మాత్రమే వుండింది. మహేష్ మరింత సమానమైన ఆర్థిక వ్యవస్థ కోసం పోరాడుతున్నాడు అంతే. మహేష్ అరెస్టు అయాక 300 గ్రామసభలు అతనికి మద్దతుగా తీర్మానాన్ని ఆమోదించాయంటే ఏ మాత్రం ఆశ్చర్యపడనక్కర లేదు. ఈ ప్రాంతంలో, పంచాయతీల(షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల(అటవీ హక్కుల గుర్తింపు)చట్టం, ఆదివాసీల ప్రయోజనాల కోసం వున్న ఇతర కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి అతను చేసిన కృషివల్ల ఆయనకు లభిస్తున్న మద్దతును ఇది చూపిస్తుంది. ఉదాహరణకు, అతని కృషి వల్ల తెందూ ఆకు సేకరణ చేసే ఆదివాసీలను, దళారీలు చేసే దోపిడీ కొంతవరకు ఆగింది. మొత్తంమీద అతని కృషి కారణంగా ఆదివాసీలలో సాధికారత భావన నెలకొంది.

మహేష్‌పైన పోలీసులు 20,000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. వారు తమ ప్రామాణిక పని విధానానికి దుమ్ము దులిపారు, కేసులో తోచిన ప్రతి సెక్షన్ ని పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 34, 121, 124 ఎ, 153, 121 ఎ, 117, 120 బి, 505 (1) (బి) వగైరా.
ప్రభుత్వం అతన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం క్రింద జైలులో ఉంచింది. ఇది భారతదేశంలోని అనేక క్రూరమైన చట్టాలలో ఒకటి. ఇందులో బెయిల్ దొరకడం అసాధ్యం.

మహేష్ పాస్పోర్ట్ ని 2018 కి ముందే జప్తు చేసారు. అతని కుటుంబం మహారాష్ట్రలో వుంటుంది. మహేష్ ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారని, రెండు సంవత్సరాలు ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి కార్యక్రమం (పిఎంఆర్డిఎఫ్)లో పరిశోధకుడిగా గడ్చిరోలి జిల్లాలో ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేశారని కోర్టులో ప్రముఖంగా చెప్పారు. విస్తృతమవుతున్న కరోనా విపత్తు సమయంలో అతను జైలులో ఉన్నాడు, బలహీనమైన ఆరోగ్యస్థితిలో, తీవ్రమైన పెద్దప్రేగు అల్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు.

UAPA సెక్షన్ 43 డి (5) ప్రకారం కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది - యితర ఆరోఫణలతోపాటు, ʹప్రభుత్వ వ్యతిరేక వ్యవహారాలలో నిమగ్నమైన సంస్థలో నిధుల నిర్వహణ, రిక్రూట్మెంట్, విధానాల నిర్ణయం, మొదలైన వాటిలో పాల్గొన్నాడుʹ అనే ఆరోపణ కూడా వుంది.

మహేష్ ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని పిఎంఆర్డిఎఫ్ సహచరులు డెబ్బై తొమ్మిది మంది, మాజీ గ్రామీణాభివృద్ధి మంత్రి జైరామ్ రమేష్ ఒక ప్రకటనపై సంతకం చేశారు. రాష్ట్రంలో నిరంతర కుల దురాగతాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న పీడిత వర్గాల ప్రతిఘటనకు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వం మహేష్‌పై తొందరపాటుతో తీసుకున్న పోలీసు చర్యనే ఈ అరెస్టు అని ప్రకటనలో వివరించారు.

మహేష్ ఆలోచనా ధోరణిని ఎవరైనా సమర్థించవచ్చు లేదా నిరాకరించవచ్చు. అయినప్పటికీ, వాస్తవం ఏమిటంటే, ఇతరులు లేదా ప్రభుత్వం అంగీకరించని విషయాలు చెప్పే ప్రజల హక్కును ప్రభుత్వం పరిరక్షించినప్పుడు మాత్రమే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అర్ధవంతమవుతుంది. ప్రభుత్వమూ, అందరూ అంగీకరించే అభిప్రాయాలను మాత్రమే ప్రభుత్వం రక్షిస్తే స్వేచ్ఛగా మాట్లాడగలిగే హక్కు (శాంతియుతంగా సమావేశమయ్యే, సమీకరించే) వుండి ఉపయోగమేముంది?

గడ్చిరోలి ప్రాంతంలోని నిర్వాసితులైన ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాడు మహేష్. వారి ప్రయోజనాల కోసం శక్తివంతమైన, అన్యాయమైన శక్తులకు ఎదుర్కొని నిలబడి వాదించాడు. మనలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా శక్తివంతమైన సంస్థకు వ్యతిరేకంగా ఒక భిన్నాభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సిరావచ్చు.

ఒకవేళ మనల్ని ఏ సాక్ష్యాలు లేని నేరాలకు పాల్పడిన నిందితులుగా జైలులో నిర్బంధిస్తే, నేరం నిరూపించబడే వరకు ఒక వ్యక్తిని నిర్దోషిగా పరిగణించాలి అనే నియమం తలక్రిందులైతే, మనకోసం ఎవరూ మాట్లాడకపోతే, ఎలా వుంటుందో వూహించండి.

ఈ దేశంలోని ప్రజల పౌర స్వేచ్ఛను కాపాడటానికి మహేష్ వంటి వ్యక్తులను మనం రక్షించాలి. ప్రజల హక్కులను కాలరాయలేరని మనం ప్రభుత్వానికి తెలియచేయాలి. మహేష్ రౌత్ ను వెంటనే విడుదల చేయాలి. అతనిపై పెట్టిన ఆరోపణలన్నింటినీ ఎత్తివేయాలి.

‍ -సురభి అగ్రవాల్, సందీప్ పాండే

(అనువాదం పద్మ కొండిపర్తి)

(counterview.net సౌజన్యంతో)

Keywords : bhima koregaoun, BK16, Mahesh raut, maharashtra, taloja jail
(2021-01-20 16:11:13)No. of visitors : 330

Suggested Posts


కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

మృత్యు శ‌య్య‌పై ఉన్న వ‌ర‌వ‌ర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు

వరవరరావు మృత్యుముఖంలో చావుబ‌తుకుల్లో మంచంపై ప‌డిఉన్నాడు. అతనికి త‌గు చికిత్స అత్య‌వ‌స‌రం.

Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movement

Activists-Intellectuals detained in the Elgar Parishad-Bhima Koregaon case, to join farmers in their struggle by observing day long symbolic hunger strike.

రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అమరులైన రైతులకు మా నివాళి. వాళ్ల అమరత్వం ఉద్యమాన్ని మరింత దృడంగా మలుస్తుందన్న విశ్వాసముంది.

Search Engine

అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌
దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్
more..


భీమా