రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా
పౌర హక్కుల సంఘం తెలంగాణ.
పత్రికా ప్రకటన..........
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది. మోడీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను,విద్యుత్ సవరణ చట్టాన్ని (2020) ఉపసంహరించాలని,పంటలకు కనీస మద్దతు ధర( MSP) చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న రైతులు ఇచ్చిన దేశవ్యాప్త బందు పిలుపుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.....
నవంబర్ 26,27 న, దేశవ్యాప్తంగా రైతుల ఛలో ఢిల్లీ ర్యాలీలపై కేంద్ర BJP ప్రభుత్వం పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో అణిచివేత, లాఠీఛార్జ్ ,వాటర్ కేనాన్ ప్రయోగం తీవ్ర పోలీస్ నిర్బంధాన్ని అమలు చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది.రైతులు శాంతియుతంగా ప్రదర్శనలు చేయడం నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు.
మోడీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి ఊడిగం చెయ్యడానికి మూడు కొత్త వ్యయసాయ చట్టాలు,విద్యుత్ సవరణ చట్టంను(2020) తీసుకురావడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ దేశంనలుమూలల నుంచి రైతులు ఢిల్లీకి వెళుతుండగా అడ్డుకోవడం, బారికేడ్లు పెట్టడం,రోడ్డుపై పెద్ద పెద్దకందకాలు తవ్వడం,పెద్దపెద్ద బండరాళ్ళుపెట్టి,ఇనుప ముళ్ళకంచెలు మరియు ఇసుక కుప్పలు పోసి ఆటంకాలు సృష్టించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులచే రహదారులను దిగ్బంధించడం అప్రజాస్వామిక చర్య మరియు రాజ్యాంగ వ్యతిరేకం.నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులపై,క్రూర నిర్బంధ చట్టాలు నమోదు చేయడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.
రైతు వ్యతిరేక చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలపై కేంద్రపోలిస్ బలగాలను ఉపయోగించి అణిచివేయడం మానుకోవాలని.కనీసం రైతుల ఆందోళన ఏమిటో అని వినే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం అత్యంత అమానవీయం.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో రైతు సంఘాలతో చర్చలు జరపాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ డిమాండ్లను పరిష్కరించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.డిసెంబర్ 8న జరిగే దేశవ్యాప్త బందుకు,మేధావులు,ప్రజాస్వామిక వాదులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు,కార్మిక సంఘాలు,విపక్షాలు అన్ని వర్గాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
1.మూడు కొత్త వ్యవసాయ బేషరతుగా చట్టాలు రద్దుచేయాలి.
2.విద్యుత్ సవరణ చట్టంను(2020) రద్దుచేయాలి.
3.రైతు పంటకి కనీస మద్దతు ధరకు (Minimum Support Price) చట్టబద్దత కల్పించాలి.
4.ప్రజాస్వామికంగా నిరసన తెలుపుతున్న రైతులపై పాశవికంగా అమలుచేస్తున్న నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలి.రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి..
రైతుల పోరాటానికి మద్దతుగా దేశ వ్యాప్త బందును విజయవంత చేయాలని కోరుతూ ఈ రోజు గోదావరిఖనిలో ధర్నా జరిగింది వివిధ పౌర, ప్రజా సంఘాలు నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేశారు.
1.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.GAV, ప్రసాద్,అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4.ఏనుగు మల్లారెడ్డిప్రధాన కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
7.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
8..పుల్ల సుచరిత, సహాయ కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
9.నార వినోద్, బొడ్డుపెల్లి రవి,పొగులరాజేశం, కడ రాజయ్య, యాదవనేని పర్వతాలు.
7.T. రాజిరెడ్డి,CITU, రాష్ట్ర అధ్యక్షుడు.
6.I. కృష్ణ, IFTU, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
7.E.నరేష్, IFTU, రాష్ట్ర సహాయ కార్యదర్శి.
8.K.విశ్వనాధం, IFTU, రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
9.గాండ్ల మల్లేశం, TPF, పెద్దపెల్లి జిల్లా కమిటీ సభ్యుడు.
10.లక్ష్మీపతి గౌడ్,INTUC RG-1,నాయకులు.
11.ముడిమడుగుల మల్లయ్య, అధ్యక్షుడు, రైతు సమస్యల సదనసామితి తెలంగాణ.
12.బియ్యాల స్వామి, రైతు.
13.పోరెడ్డి వెంకట్ రెడ్డి, సామాజిక కార్యకర్త.
Keywords : farmers protest, bharat bandh, CLC, godavarikhani
(2021-01-24 16:14:37)
No. of visitors : 296
Suggested Posts
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది. |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు. |
| ʹముందు ఖాలిస్తానీ అన్నారు..తర్వాత పాకిస్తానీ అన్నారు..ఇప్పుడు మావోవాదీ అంటున్నారుʹ
కేంద్రం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఉద్యమం 18వ రోజుకు చేరుకుంది. ఈ రోజు (ఆదివారం) జైపూర్, ఢిల్లీ రహదారిపై మార్చ్ నిర్వహించి ఆ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని ప్రకటించిన రైతులు ఆ మేరకు వేలాది మంది బయలుదేరారు. రాజస్తాన్ నుండి, దక్షిణ హర్యాణా నుండి వేలాది వాహనాల్లో రైతులు బయలు దేరారు. ఆ రోడ్డ |
| రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ
రైతుల చట్టబద్ధమైన, శాంతియుత నిరసనలను ప్రభుత్వం అణచివేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ జాతీయ మహిళా సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశాయి. పోరాడుతున్న రైతులు, రైతు సంస్థల నాయకులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, విపత్తు సమయంలో అమల్లోకి వచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు. |
| బీజేపీ సర్కార్ పై రైతుల పోరు ఉధృతం - డిసెంబర్ 8న భారత్ బంద్కు పిలుపుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఉధృతంగా సాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు ఒక వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు రైతు అసంఘాల మధ్య చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ పొలంపనుల్లో... ఫోటోలో ఉన్న బాలిక పేరు ప్రియ. ఆమెకు 11 ఏళ్ళ వయస్సు. మగపిల్లలే వ్యవసాయం చేస్తారనే పితృస్వామిక భావజాలాన్ని బద్దలు కొడుతూ ఈ బాలిక అద్భుతంగా పొలం పనులు చేస్తోంది. ఈమె తండ్రి సతీష్ కుమార్ ఉద్యమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళాడు. దాంతో పంట చెడిపోకుండా ప్రియ రంగంలోకి దిగింది. |