బీజేపీకి లొంగిపోయిన కేసీఆర్... అందుకే వ్యవసాయ చట్టాలపై యూ టర్న్..... పౌరహక్కుల సంఘం


బీజేపీకి లొంగిపోయిన కేసీఆర్... అందుకే వ్యవసాయ చట్టాలపై యూ టర్న్..... పౌరహక్కుల సంఘం

బీజేపీకి

కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల , రైతు వ్యతిరేక వ్య్వసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నెల రోజులకుపైగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి దాకా ఆ చట్టాలను వ్యతిరేకించారు. ఈ నెల 8వ తేదీన జరిగిన దేశవ్యాప్త బంద్ కు కూడా మద్దతు ప్రకటించారు. అయితే బంద్ తర్వాత ఢిల్లీకి వెళ్ళొచ్చిన కేసీఆర్ హటాత్తుగా తన స్టాండ్ ను మార్చుకున్నారు. బహిరంగంగా చెప్పక పోయినా వ్యవ‌సాయచట్టాలకు అనుకూలంగా తెలంగాణలో చర్యలు చేపట్టారు. కేసీఆర్ ఇలా మడమ తిప్పడంపై అన్ని వైపుల నుండి విమర్షలు వస్తున్నాయి. కేసీఆర్ తీసుకున్న యూ టర్న్ పై పౌరహక్కుల సంఘం తెలంగాణ శాఖ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఆ సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం....

కేంద్ర వ్యవసాయ చట్టాలకు KCR మద్దతుగా యూటర్న్ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికం మరియు రైతు వ్యతిరేకచర్య. పౌర హక్కుల సంఘం తెలంగాణ,ఈ నిర్ణయాన్ని ఖండిస్తుంది.

BJP కేంద్రప్రభుత్వం అంబానీ, అదాని కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చడానికి తెచ్చిన నూతన వ్యవసాయచట్టాలకు అనుగుణంగా,తెలంగాణ ముఖ్యమంత్రి KCR యూటర్న్ తీసుకోవడాన్ని పౌర హక్కుల సంఘం రైతు వ్యతిరేక చర్యగా భావిస్తోంది. ఒకవైపు ఢిల్లీ సరిహద్దులో మంచుగడ్డకట్టే చలిలో రైతాంగం చారిత్రాత్మక వీరోచితపోరాటం చేస్తుంటే,వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అండగా ఉండి ఉద్యమిస్తోంటే, మొదట్లో KCR వ్యవసాయ చట్టాల రద్దు కొరకు మద్దతు ప్రకటించి, రైతుల దేశవ్యాప్త 8 డిసెంబర్,2020 బందులో TRS పార్టీ కార్యకర్తలు హైవే లలో ఆనాడు MLA, MP లు,KTR, హరీష్ రావు లు పాల్గొన్నారు. ఢిల్లీ కి పోయి KCR, మోడీ, అమిత్షా లను కలిసి రహస్య చర్చలు జరిపి వాళ్ళతో మిలాఖత్ అయిపోయినారు.,BJP కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రాల-కేంద్రం మధ్యనున్న ఫెడరల్ విలువలను ధ్వంసం చేసి KCR ను బెదిరించో, భయపెట్టో లొంగదీసుకుంటేనే, ఇప్పుడు రైతువ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని అర్థం అవుతుంది.రాజ్యాంగ బద్ధంగా ఉన్న ఫెడరల్ విలువలను పాటించాల్సిన కేంద్ర ప్రభుత్వం KCR, జగన్, ఇతర ముఖ్యమంత్రులను పిలిపించుకుని బలంతంగా చట్టాలకు మద్దతు ఇప్పిచ్చు కోవడం, కేరళ గవర్నర్, ఆ రాష్ట్రం నూతన వ్యవసాయ చట్టాల రద్దుకొరకు తీర్మానం ప్రవేశం పెట్టడానికి అసెంబ్లీ సిట్టింగ్ అనుమతి ఇవ్వకపోవడం లాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట.
ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ముఖ్యమంత్రి గా తీసుకున్న నిర్ణయాలు కావు,ముఖ్యమంత్రి అంటేనే అత్యంత బాధ్యత గల వ్యక్తి. ఇవి.ఏదైనా ఒక సమస్యకు, ఆందోళనకు మద్దతుఇస్తున్నామంటే ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలే.కాని KCR తన ప్రయోజనాలే లక్షంగా మెదులుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తన అవసరాలు ఉన్నాయి కనుక, KCR రైతు ఉద్యమానికి మద్దతు తెలిపితే కూడా కారణం ఏదైనా రైతులకు మద్దతు, నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉన్నదని తెలంగాణ మేధావులు, ప్రజాస్వామిక వాదులు హర్షించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని రైతులపంటల కొనుగోలు కేంద్రాలు తెలంగాణ లో ఉండవని, తమ పంటల ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చునని, సర్కార్ వ్యాపార సంస్థ కాదని,ధర ఎక్కడ ఎక్కువస్తే అక్కడే పంటలను అమ్ముకోవాలని, కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెపుతున్నాయని నిర్ణయం తీసుకున్నాడు. ఇది అప్రజాస్వామిక వైఖరి, రైతు వ్యతిరేక నిర్ణయం. ఇటువంటి పనులు చేయకుండా KCR రైతుల పక్షాన నిలబడాల్సివుంది.జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్లా, కరీంనగర్, అదిలాబాద్ రైతాంగ పోరాటాల గడ్డయిన తెలంగాణ పోరాటాల స్ఫూర్తితో, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణరాష్ట్రంలో ఇటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు అండగా ఉండవద్దని, తెలంగాణ ముఖ్యమంత్రి KCR తిరిగి ఆలోచించాలని, తెలంగాణ పక్షాన, యావత్ రైతాంగం పక్షాన, పౌరహక్కుల సంఘం తెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది. అదే విదంగా తెలంగాణ లోని బుద్ధిజీవులందరూ, KCR తీసుకున్న యూటర్న్ ను వ్యతిరేకించాలని నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై పోరాడుతున్న రైతాంగానికి అండగా నిలబడాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తుంది.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.

2.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.

4.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ
సాయంత్రం,5:30.
28,డిసెంబర్,2020.
హైదరాబాద్.
పౌర హక్కుల సంఘం తెలంగాణ.

Keywords : farmers protest, telangana, kcr, U Turn, bjp
(2021-01-25 22:57:39)No. of visitors : 493

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
more..


బీజేపీకి