షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌


షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్క‌రణ‌

సీఏఏ. ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరస‌నలు జరిగిన ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నిరసనలు జరుగుతున్న సమయంలో కాల్పులకు పాల్పడి ʹʹఈ దేశంలో హిందువులకు మాత్రమే పాలించే హక్కు ఉంది మరెవరికీ లేదుʹʹ ʹʹజై శ్రీ రాంʹʹ అని నినాదాలు చేసిన కపిల్ గుజ్జర్ అనే వ్యక్తి ఈ రోజు ఉదయం బీజేపీలో చేరాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని బిజెపి యూనిట్ ఈయనను సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు గజియాబాద్ బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా కపిల్ గుజ్జర్ మాట్లాడుతూ ʹʹనేను బీజేపీలో చేరడానికి ఇంతకు ముందే సిద్ధమయ్యాను. బీజేపీనే ఎంచుకోవడానికి కారణం, ఆ పార్టీ హిందుత్వం కోసం పని చేస్తుందిʹʹ అన్నాడు.

షహీన్ భాగ్ లో కాల్పులు జరిపిన తర్వాత ఢిల్లీ పోలీసులు కపిల్ గుజ్జర్ ను అరెస్టు చేయగా తమ కుటుంభానికి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలున్నాయని వాదించాడు. ఆ విధంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆప్‌లో తన తండ్రి 2019 వరకు పని చేశాడని తన ఫోన్‌లో ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషితో ఉన్న తన తండ్రి ఫొటోలను చూపించాడు. అయితే అతడి వాదనను అతడి కుటుంబ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించాయి. గుర్జర్ కుటుంబంతో ఆప్‌కు ఎలాంటి సంబంధం ఏదని ఆప్ నేతలు చెప్పగా, తాను ఆప్‌తో ఎప్పుడూ పని చేయలేదని గుర్జార్ తండ్రి పేర్కొన్నాడు.

కాగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు కొందరు రెచ్చ గొట్టే ప్రసంగాలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్ ʹఠాకూర్ గోలీ మారో సాలోంకుʹ అనే విద్వేష‌పూరిత నినాదాలు చేసిన తర్వాత కపిల్ గుజ్జర్ షహీన్ భాగ్ లో కాల్పులు జరిపాడు. గుజ్జర్ వెనక వందల మంది పోలీసులు ఉండగా ఇతను కాల్పులకు పాల్పడటం గమనార్హం.

కపిల్ గుజ్జర్ అరెస్టయిన కొద్ది రోజుల్లోనే బెయిల్ పై బైటికి వచ్చాడు. ఈ రోజు బీజేపీలో చేరాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. ఈయన పార్టీలో చేరిన ఫోటోలు, నాయకులు ఈయనకు పార్టీ కండువాకప్పై ఆహ్వానిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజనులు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుమ్మెత్తి పోశారు. మనసు నిండా విద్వేషం నిండిన ఇటువంటివారికి బీజేపీయే సరియైన పార్టీ అని పలువురు నెటిజనులు కామెంట్లు చేశారు. దీంతో అప్రమత్తమైన బీజేపీ నాయకత్వం సాయంత్రం కల్లా కపిల్ గుజ్జర్ ను పార్టీ నుండి బహిష్కరించారు.
.
"బహుజన్ సమాజ్ పార్టీ నుండి పార్టీలో చేరిన కొంతమంది వ్యక్తులలో కపిల్ గుజ్జర్ కూడా ఉన్నారు. వివాదాస్పద షాహీన్ బాగ్ సంఘటనలో ఆయన ప్రమేయం గురించి మాకు తెలియదు. తెలుసుకున్న తరువాత, ఆయన సభ్యత్వం తక్షణమే రద్దు చేయబడింది" అని బిజెపి ఘజియాబాద్ చీఫ్ సంజీవ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

Keywords : kapil gujjar, bjp, firing at shaheen bhagh, Shaheen Bagh Shooter Removed From BJP Hours After Joining
(2021-01-25 01:05:22)No. of visitors : 123

Suggested Posts


ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...

ఇక నిన్న సాయంత్రం నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారంచేశారు. వాట్సప్, ఫేస్ బుక్ ల్లో ఆ ఫోటోలను విస్త్రుతంగా ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కొందరు అమాయకంగా నమ్మి షేర్లు చేస్తుండగా మరి కొందరు కావాలనే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ధ్వంసమైన ఇళ్ళు, వందలాది శవాలు, శవ ఊరేగింపు , శవాల మూకుమ్మడి ఖననం మొదలైన ఫోటోలున్నాయి.

Congress, BJP, CPI(M) join hands in Sikkim

Setting aside ideological differences, the Congress, the BJP and the CPI (M) have joined hands in Sikkim to fight Chief Minister Pawan Kumar Chamlingʹs Sikkim....

బీజేపీ గెలుపుకు ఎమ్ ఐ ఎమ్ సహాయం ?

బీహార్ లో బీజేపీ గెలవాలనిఎమ్ ఐ ఎమ్ కోరుకుంటుందా ? తాను 40 సీట్లకు పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్, జేడీయూ,ఆర్జేడీ ల ఓట్లను చీల్చి బీజేపీ గెలుపుకు మార్గం సుగుమం చేస్తోందా ? అవుననే అంటున్నాయి....

గోడు వెళ్ళబోసుకున్న అన్నదాత - ఆత్మహత్య చేసుకోమన్న కేంధ్రమంత్రి

తాజాగా ఓ కేంద్ర మంత్రి మరో అడుగు ముందుకు వెళ్లి, తన గోడు చెప్పుకుంటున్న ఓ రైతును ʹవెళ్లి చావు పోʹ అని కసురుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన రాజస్థాన్‌లోని టోంక్‌లో జరిగింది....

కలిసి పోటీ చేద్దాం - కాంగ్రెస్ కు బీజేపీ పిలుపు

జాతీయ స్థాయిలో బద్ద శతృవులుగా ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడమా ! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కలిసి పోటీ చేద్దాం రమ్మంటూ బీజేపీ కాంగ్రెస్ ను పిలిచింది....

BJP Worker Avinash Kumar Das Shot Dead In Patna: CCTV Footage

Avinash Kumar was out for a morning walk near Daldali Road when he was shot dead at about 7 am. The CCTV camera at a nearby temple was an eyewitness to the ghastly crime.....

బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !

ʹబీజేపీకి ఓటు వేయకండి..మళ్ళీ ఆ పార్టీకే ఓటు వేస్తే అందరినీ టీ అమ్ముకునేలా చేస్తుందిʹ అని సూసైడ్ లెటర్ రాసి ఓ వృద్ద రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌ జిల్లాకు చెందిన

విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి

ప్రముఖ రచయితలు అరుంధతీరాయ్, ఆనంద్ తేల్తుంబ్డే, రొమిల్లా థాపర్, గిరీష్ కర్నాడ్, ఓల్గా, నయనతార సెహగల్, కేఎన్ పణిక్కర్ వంటి 210 మంది రచయితలు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమై ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం - రాజ్ థాక్రే

ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే ఆరోపించారు. ఇతర పార్టీల ఓట్లు చీల్చి తాను లాభపడటం కోసం బీజేపీ.. ఎంఐఎం ను పావుగా వాడుతోందని....

బీజేపీ అధిష్ఠానంపై పార్టీ అగ్రనేతల ఫైర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో తేల్చాలంటూ ఆ పార్టీ అగ్ర నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి....

Search Engine

వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష‌
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
more..


షహీన్