అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !

అదానీపై

అదానీ గ్రూపు దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం దావా కేసులో గుజ‌రాత్ కుచ్ జిల్లా కోర్టు ప్ర‌ముఖ పాత్రికేయుడు ప‌ర‌ణ్‌జోయ్ గుహా ఠాకుర్తాకు అరెస్టు వారెంటు జారీచేసింది.

ఐపీసీ సెక్షన్ 500 కింద న‌మోదైన కేసులో ఠాకుర్తా ను అరెస్టు చేయాల‌ని మేజిస్ట్రేట్ ప్రదీప్ సోని న్యూ ఢిల్లీ నిజాముద్దీన్ పోలీసుల‌ను ఆదేశించారు.

ప్రత్యేక ఆర్థిక మండలాల నిబంధనలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉల్లంఘించింద‌ని, అందుకోసం అదానీ గ్రూప్ 500 కోట్లు ముట్ట‌జెప్పిందంటూ జూన్ 2017 లో ఎక‌నామిక‌ల్ అండ్ పొలిటిక‌ల్ వీక్లీ ప్ర‌చురించిన క‌థ‌నంపై అదానీ గ్రూప్ పరువు నష్టం దావా వేసింది.

కాగా.. అరెస్టు వారెంట్ కు సంబంధించి ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌ని ఠాకుర్తా త‌రుపు న్యాయ‌వాది తెలిపారు. కేవ‌లం మీడియాలోనే వారెంటుకు సంబంధించిన వార్త‌లు చూసిన‌ట్లు న్యాయ‌వాది ఆనంద్ యజ్ఞిక్ తెలిపారు.

క‌థ‌నాన్ని ప్ర‌చురించిన ప‌త్రిక‌కు ఈ కేసుతో సంబంధం లేద‌ని, స‌హ ర‌చ‌యిత‌ల‌పై కేసును ఉప‌సంహ‌రించుకున్న అదానీ గ్రూపు ప‌ర‌ణ్‌జోయ్ గుహా ఠాకుర్తా పై మాత్రం ఉపసంహ‌రించుకోలేద‌న్నారు.

గ‌త ఏడాది క‌రోనా సంక్షోభం కార‌ణంగా కోర్టు విచార‌ణ‌ల‌పై ప్ర‌భావం పడ‌డంతో అదానీ గ్రూప్ దాఖ‌లు చేసిన కేసు సోమ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది.

ఆర్థిక మండ‌ళ్ల‌పై క‌థ‌నాన్ని ఈపీడ‌బ్లూ 2017 జూన్ 14న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అప్పట్లో ఎక‌నామిక‌ల్ అండ్ పొలిటిక‌ల్ వీక్లీకి ఠాకుర్తా చీఫ్ ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండే వారు. ఆ త‌రువాత అదే వ్యాసాన్ని ది వైర్ వెబ్ సైట్ పునః ప్ర‌చురించింది.

అదానీ గ్రూప్ నోటీసులు జారీ చేసిన త‌రువాత ఈపీడ‌బ్లూ ఆ వ్యాసాన్ని తొల‌గించింది. కానీ ది వైర్ వెబ్ సైట్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. చివ‌ర‌కు 2019 మేలో అదానీ గ్రూపు ది వైర్ కి వ్య‌తిరేకంగా వేసిన కేసుల‌న్నింటినీ ఉప‌సంహ‌రించుకుంది.

వ్యాసాన్ని తొల‌గించాలంటూ ఈపీడ‌బ్లూ ప్ర‌చుర‌ణ సంస్థ స‌మీక్ష ట్ర‌స్ట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ ఠాకుర్తా చీఫ్ ఎడిట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు.

Keywords : adani, journalist, modi, sez, arrest, Paranjoy Guha Thakurta
(2024-04-25 01:22:45)



No. of visitors : 554

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అదానీపై