రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్


రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

రైతాంగ

రెండు నెలలకు పైగా దేశ రైతాంగం చేస్తున్న పోరాటానికి దండకారణ్య క్రాంతికారీ జనతన సర్కార్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జోన్ క్రాంతికారీ జనతన సర్కార్ సమన్వయ కమిటీ దండకారణ్య ఇంచార్జ్ సుక్కు లేకాం హిందీలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠం

రైతు వ్యతిరేక, దేశద్రోహ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించండి!

మహత్తర భూంకాల్ పోరాట వారసత్వాన్ని ఎత్తి పడుతూ రైతుల ఉద్యమానికి మద్దతుగా ఫిబ్రవరి 10 న సంకల్ప్ దివస్ ను జరుపుకుందాం

వ్యవసాయ విప్లవం రైతుల సమస్యలకు సరైన మరియు ఏకైక పరిష్కారం! రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ సర్కార్ తీసుకవచ్చిన దేశ ద్రోహ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో రెండు నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు, వారికి నాయకత్వం వహిస్తున్న రైతు సమన్వయ కమిటీకి దండకారణ్య జోన్ క్రాంతి కారీ జనతన సర్కార్ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. జనవరి 26 న, కిసాన్ మోర్చా పిలుపు మేరకు 8 లక్షల ట్రాక్టర్లతో 20 లక్షల మంది రైతులు ఢిల్లీకి వెళుతుండగా, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఢిల్లీ పోలీసులు రైతు నాయకులు, రైతులపై టియర్ గ్యాస్ మరియు లాఠీ ఛార్జ్ ఉపయోగించారు. ఈ సందర్భంగా వందలాది మంది రైతులు గాయపడ్డారు. మీడియా నివేదిక ప్రకారం, పోలీసు బుల్లెట్‌తో ఒక రైతు మరణించడమే కాదు, రైతులు, రైతు నాయకులపై ఢిల్లీ పోలీసులు 2000 కి పైగా అక్రమ కేసులను నమోదు చేశారు.

అధికారుల నుండి అనుమతి పొందిన తరువాత శాంతియుతంగా,ప్రజాస్వామ్య పద్ధతిలో‌ ఆందోళన చేస్తున్న‌ రైతులపై కేంద్ర ప్రభుత్వం అనాగరిక అణచివేతను ప్రయోగించడాన్ని జనతన సర్కార్ తీవ్రంగా ఖండిస్తున్నది.

కేంద్రం తీసుకవచ్చిన‌ మూడు వ్యవసాయ చట్టాలు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలైన అంబానీ, అదానీ, దమాని, వాల్మోర్ట్స్, టిసిఐలకు మాత్రమే లాభాలను కురిపించడానికి, భూమి, ఉత్పత్తి, నిల్వ, అమ్మకం... వీట‌న్నింటిపై ఆ సంస్థలకు పూర్తి నియంత్రణను ఏర్పాటు చేయడానికి మాత్రమే తీసుకువచ్చారు,

వాస్తవానికి ఈ చట్టాలు ఈ దేశ వ్యవసాయాన్ని, రైతులను నాశనం చేస్తాయి. ఈ చట్టం దేశ ప్రజల పట్ల‌ మోసం, కుట్ర, ద్రోహం చేయడమే.

సామ్రాజ్యవాదం‍, దళారీ బ్యూరోక్రాటిక్ పెట్టిబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటం విస్తృత సమన్వయం కోసం దండకరణ్యంలో పంచాయతీ, ప్రాంతం మరియు డివిజన్ స్థాయిల్లో క్రాంతి కారీ జనతన సర్కార్ ల సమన్వయ కమిటీ ఏర్పడింది.

దండకారణ్య జోన్ క్రాంతికారీ జనతన సర్కార్ సమన్వయ కమిటీ దేశంలో జరుగుతున్న‌ రైతు ఉద్యమానికి గట్టిగా మద్దతు ఇస్తుంది. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక మరియు దేశద్రోహమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిస్తున్నది.

రైతు ఉద్యమం విజయవంతం అవడం కోసం...1910 నాటి బస్తర్ మహత్తర భూంకాల్ పోరాట వారసత్వాన్ని చాటి చెబుతూ ఆ పోరాటం 111 వ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10 న సంకల్ప దినాన్ని పాటించాలని క్రాంతికారీ జనతన సర్కార్ పిలుపునిస్తున్నది. రైతు ఉద్యమానికి మద్దతుగా ముందుకు వస్తున్న కార్మికులు, దేశభక్తులు, ప్రజాస్వామ్యవాదులు మరియు ప్రగతిశీల శక్తులందరికీ సంకల్ప దినాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నది. దండకారణ్యంలోని అన్ని స్థాయిల్లోని జనతన ప్రభుత్వాలు, విప్లవాత్మక ప్రజలు, సంస్థలను రైతు ఉద్యమానికి మద్దతుగా ప్రజలను సమీకరించాలని పిలుపునిస్తున్నాము.

దేశం యొక్క ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి, రైతుల అన్నిరకాల‌ సమస్యలకు ఏకైక మరియు సరైన పరిష్కారం నూత‌ ప్రజాస్వామ్య విప్లవం మాత్రమే. దీని ఇరుసు వ్యవసాయ విప్లవం. అందువల్ల, సామ్రాజ్యవాద‍దళారీ బ్యూరోక్రాటిక్ క్యాపిటలిజం-ఫ్యూడల్-వర్గ వ్యతిరేక పోరాటం ద్వారా వ్యవసాయ విప్లవం ద్వారా నూతన ప్రజాస్వామిక‌ విప్లవాన్ని విజయవంతం చేసే దిశగా పయనించాలని మా ప్రభుత్వం పోరాడుతున్న రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది.

(సుక్కు లేకం)
ఇన్‌ఛార్జి, జోన్ క్రాంతికారీ జనతన సర్కార్ సమన్వయ కమిటీ,
దండకారణ్యం

Keywords : farmers protest, kranthikari janthana sarkar, dandakaranya, maoists, delhi
(2022-06-27 17:53:21)No. of visitors : 1217

Suggested Posts


అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులు

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు.

దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ

he Central Committee of our Party firstly conveys its revolutionary greetings to the Indian peasantry that is fighting non-compromisingly and with a strong will against the central government to achieve their

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


రైతాంగ