హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు

అత్యాచారం కేసులో జైలుకు వెళ్ళి పై బెయిల్ పై వచ్చిన ఓ నిందితుడు బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో సస్నీ పోలీసు స్టేషన్ పరిథిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

2018 లో గౌరవ శర్మ నే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ కేసులో గౌరవ్ శర్మకు కింది కోర్టు జైలు శిక్ష విధించగా ప్రస్తుతం ఆయన బెయిల్ పై గ్రామంలోనే ఉంటున్నాడు. సోమవారంనాడు నిందితుడు గౌరవ్ శర్మ భార్య, అత్త స్థానిక దేవాలయానికి వెళ్ళగా అక్కడ బాధితురాలు ఆమె సోదరి తారసపడ్డారు. గౌరవ శర్మ జైలుకెళ్ళినప్పటి నుండి బాధితురాలి కుటుంబంపై కోపంగా ఉన్న వాళ్ళిద్దరూ బాధితురాలితో గొడవకు దిగారు. ఆ గొడవ పెద్దదవడంతో బాధితురాలి తండ్రి జోక్యం చేసుకున్నాడు. . ఇంతలో అక్కడికి చేరుకున్న నిందితుడు గౌరవ్ శర్మ బాధితురాలి తండ్రితో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగింది. ఇంతలో అక్కడి నుండి హటాత్తుగా వెళ్ళిపోయిన గౌరవ్ శర్మ కొంత మంది తన స్నేహితులను తీసుకొని, చేతిలో తుపాకీ పట్టుకొని మళ్ళీ వచ్చి బాధితురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు. తీవ్ర బుల్లెట్ గాయాలతో కుప్పకూలిపోయిన బాధితురాలి తండ్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా అతను ప్రాణాలు వదిలాడు. నిందితుడు గౌరవ్ శర్మ ప్రస్తుతం పరారీలో ఉండగా అతనికి సహకరించిన కుటుంబ సభ్యుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ హటాత్ సంఘటనతో బాధితురాలు కుటుంబం షాక్ కు గురయ్యింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.

"దయచేసి నాకు న్యాయం చేయండి. మొదట అతను నన్ను వేధించాడు. ఇప్పుడు అతను నా తండ్రిని కాల్చి చంపాడు. అతనితో పాటు మరో అక్కడ( హత్య జరుగుతున్నప్పుడు) ఆరు, ఏడు మంది ఉన్నారు. నా తండ్రికి ఎవరిపైనా శత్రుత్వం లేదు. నా తండ్రిని చంపినతని పేరు గౌరవ్ శర్మ, "అని బాధితురాలు బోరున ఏడుస్తూ చెప్పింది.

Keywords : uttar pradesh, hatras, rape, father, murder, gaurav sharma, police
(2024-04-25 00:46:26)



No. of visitors : 949

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హత్రాస్